Tecno Phantom V Flip Launch: ప్రస్తుతం భారతదేశంలో చవకైన ఫోల్డబుల్ ఫోన్ విక్రయిస్తున్న బ్రాండ్ ఏదో మీకు తెలుసా? మీరు కనీసం గెస్ కూడా చేయలేరు. చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ టెక్నో లాంచ్ చేసిన టెక్నో ఫాంటం వీ ఫోల్డ్ మనదేశంలో అత్యంత చవకైన ఫోల్డ్ ఫోన్. దీని ధర రూ.88,888గా ఉంది. అమెజాన్‌లో దీనిపై 24 నెలల నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది.


ఇతర కంపెనీలతో పోల్చితే కంపెనీ టెక్నో ఫాంటమ్ వి ఫోల్డ్‌ను అతి తక్కువ ధరకు టెక్నో విడుదల చేసింది. ఇప్పుడు కంపెనీ త్వరలో ఫ్లిప్ స్మార్ట్‌ఫోన్‌ను కూడా విడుదల చేయనుంది. కంపెనీ సెప్టెంబరు 22వ తేదీన సింగపూర్‌లో జరగనున్న ఫ్లిప్ ఇన్ స్టైల్ టెక్నో ఫ్లాగ్‌షిప్ ప్రొడక్ట్ లాంచ్ 2023 ఈవెంట్‌లో టెక్నో ఫాంటం వీ ఫ్లిప్‌ను లాంచ్ చేయనుంది. ప్రస్తుతానికి ఈ ఫోన్ భారతదేశంలో కూడా లాంచ్ అవుతుందా లేదా అనే సమాచారం అందుబాటులో లేదు. లాంచ్‌కు ముందు ఈ మొబైల్ ఫోన్‌కు సంబంధించిన కొంత సమాచారం వెలుగులోకి వచ్చింది. స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి ప్రవేశించే ముందు, దాని మొబైల్ కవర్ ఒక చైనీస్ షాపింగ్ వెబ్‌సైట్‌లో అమ్మకానికి అందుబాటులోకి వచ్చింది.


లీక్‌ల ప్రకారం చూస్తే టెక్నో ఫాంటమ్ వీ ఫ్లిప్‌లో సర్క్యులర్ కవర్ డిస్‌ప్లే అందించారు. ఫోటోగ్రఫీ కోసం ఫోన్‌లో రెండు కెమెరాలు ఉండనున్నాయి. ముందు భాగంలో పంచ్ హోల్ డిస్‌ప్లే అందుబాటులో ఉంటుంది. గూగుల్ ప్లే కన్సోల్ వెబ్‌సైట్‌లో కూడా ఈ స్మార్ట్‌ఫోన్ కనిపించింది. ఈ లిస్టింగ్ ప్రకారం 8 జీబీ ర్యామ్, మీడియాటెక్ డైమెన్సిటీ 1300 చిప్‌సెట్‌ను ఫోన్‌లో కనుగొనవచ్చు. టెక్నో ఫాంటమ్ వి ఫ్లిప్‌ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13తో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.


స్క్రీన్ గురించి చెప్పాలంటే ఇందులో ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లేను పొందుతారు. ఫోటోగ్రఫీ కోసం ఫోన్‌లో 64 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా, 13 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా ఉండనున్నాయి. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం ముందు వైపు 32 మెగాపిక్సెల్ కెమెరాను చూడవచ్చు. 45W ఫాస్ట్ ఛార్జింగ్‌‌ను సపోర్ట్ చేయనున్న 4500 ఎంఏహెచ్ బ్యాటరీని అందించనున్నారు. లీక్‌లను బట్టి దీని ధర దాదాపు రూ.50,000 ఉండవచ్చు. శాంసంగ్ ఫ్లిప్ 4 ధర రూ.90 వేల వరకు ఉంది. దీన్ని బట్టి టెక్నో ఫోన్ ధర చాలా తక్కువ అని చెప్పవచ్చు.


మరోవైపు వివో ఎక్స్ ఫోల్డ్ ప్లస్ స్మార్ట్ ఫోన్ గతంలోనే చైనాలో లాంచ్ అయింది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 ప్లస్ జెన్ 1 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. ఈ కొత్త ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్‌లో 8.03 అంగుళాల అమోఎల్ఈడీ ఇన్నర్ డిస్‌ప్లేను అందించారు. కవర్ డిస్‌ప్లేగా 6.53 అంగుళాల కవర్ డిస్‌ప్లే ఉంది. దీని బ్యాటరీ సామర్థ్యం 4730 ఎంఏహెచ్ కాగా, 80W వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్, 50W వైర్‌లెస్ ఫాస్ట్ చార్జింగ్ ఫీచర్లు ఉన్నాయి.


Read Also: వాట్సాప్‌లో ఇకపై హై-క్వాలిటీ వీడియోలను పంపుకోవచ్చు, ఎలాగో తెలుసా?


Read Also: సెకండ్ హ్యాండ్ ఐఫోన్‌ కొంటున్నారా? ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోవాల్సిందే!


Read Also: మీ స్మార్ట్ ఫోన్ ఊరికే స్లో అయిపోతుందా? - అయితే ఈ టిప్స్ ఫాలో అవ్వండి!


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial