శాంసంగ్ ప్రస్తుతం అప్‌గ్రేడెడ్ స్పెసిఫికేషన్లతో కొత్త కెమెరా సెన్సార్లపై పని చేస్తుంది. ఈ సంవత్సరం ప్రారంభంలో శాంసంగ్ తన ఫ్లాగ్‌షిప్ గెలాక్సీ ఎస్23 సిరీస్‌ను లాంచ్ చేసింది. ఈ సిరీస్‌లో శాంసంగ్ గెలాక్సీ ఎస్23, శాంసంగ్ గెలాక్సీ ఎస్23 ప్లస్, శాంసంగ్ గెలాక్సీ ఎస్23 అల్ట్రా స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. అల్ట్రా మోడల్‌లో ఫోన్ వెనకవైపు నాలుగు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 200 మెగాపిక్సెల్ కాగా, దీంతో పాటు 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 10 మెగాపిక్సెల్ టెలిఫొటో లెన్స్ కూడా అందించారు. అలాగే 10x ఆప్టికల్ జూమ్ కోసం మరో 10 మెగాపిక్సెల్ టెలిఫొటో సెన్సార్ కూడా ఉంది.


రివెగ్నస్ (ఎక్స్ ఐడీ (@Tech_Reve)) అనే ప్రముఖ టిప్‌స్టర్ తెలిపిన దాని ప్రకారం శాంసంగ్ ప్రస్తుతం తన సొంత ఐసోసెల్ కెమెరా సెన్సార్లలో కొత్త బ్యాచ్‌పై పని చేస్తుంది. ఈ లిస్టెడ్ సెన్సార్లు 2024 ద్వితీయార్థంలో మాస్ ప్రొడక్షన్‌కు వెళ్లే అవకాశం ఉంది. ఈ లీకుల ప్రకారం... 50 అంగుళాల ఐసోసెల్ జీఎన్6 1.6 అంగుళాల సెన్సార్, 200 మెగాపిక్సెల్ ఐసోసెల్ హెచ్‌పీ7 0.6 అంగుళాల సెన్సార్, 440 మెగాపిక్సెల్ ఐసోసెల్ హెచ్‌యూ1 సెన్సార్‌ను కంపెనీ రూపొందిస్తుంది. అయితే ఈ సెన్సార్ సైజు మాత్రం తెలియరాలేదు.


ఒక అంగుళం సైజున్న సోనీ ఐఎంఎక్స్989 సెన్సార్‌తో పోటీ పడేందుకు శాంసంగ్ 50 అంగుళాల ఐసోసెల్ జీఎన్6 1.6 అంగుళాల సెన్సార్‌ను రూపొందించనున్నట్లు సమాచారం. ఒకవేళ ఇదే నిజమైతే త్వరలో రాబోయే ఫ్లాగ్‌షిప్ స్మార్ట్ ఫోన్లకు ఇది మంచి అప్‌గ్రేడ్ కానుంది.


అలాగే వార్తల్లో ఉన్న శాంసంగ్ 440 మెగాపిక్సెల్ ఐసోసెల్ హెచ్‌యూ1 కెమెరా సెన్సార్ కూడా అంగుళం కంటే ఎక్కువ సైజులో ఉండనుందని సమాచారం. ఏకంగా 600 మెగాపిక్సెల్ రిజల్యూషన్ వరకు ఉన్న సెన్సార్లను రూపొందించే ఆలోచనలో ఉన్నట్లు కంపెనీ ఇటీవలే తెలిపింది.


ఇక శాంసంగ్ గెలాక్సీ ఎస్23 అల్ట్రా విషయానికి వస్తే... ఇందులో మూడు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.1,24,999గా ఉంది. ఇక 12 జీబీ ర్యామ్ + 512 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.1,34,999గానూ, 12 జీబీ ర్యామ్ + 1 టీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.1,54,999గానూ నిర్ణయించారు.


శాంసంగ్ గెలాక్సీ ఎస్23 అల్ట్రా మొబైల్‌లో 6.8 అంగుళాల డిస్‌ప్లేను అందించారు. ఈ స్మార్ట్ ఫోన్ స్క్రీన్ రిజల్యూషన్ 1440 x 3088 పిక్సెల్స్‌గా ఉంది. సెక్యూరిటీ కోసం ఫోన్‌లో ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అందుబాటులో ఉంది. ఆక్టా-కోర్ ప్రాసెసర్ అయిన క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 చిప్‌సెట్‌పై శాంసంగ్ గెలాక్సీ ఎస్23 అల్ట్రా పని చేయనుంది.


ఈ ఫోన్‌లో వెనకవైపు 200 మెగాపిక్సెల్ కెమెరాను ప్రధాన సెన్సార్‌గా అందించారు. దీంతోపాటు 12 మెగాపిక్సెల్, 10 మెగాపిక్సెల్ కెమెరాలు కూడా అందుబాటులో ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 12 మెగాపిక్సెల్ కెమెరా అందించారు. 5000 ఎంఏహెచ్ సామర్థ్యమున్న బ్యాటరీ కూడా ఇందులో ఉంది.


Read Also: సెకండ్ హ్యాండ్ ఐఫోన్‌ కొంటున్నారా? ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోవాల్సిందే!


Read Also: మీ స్మార్ట్ ఫోన్ ఊరికే స్లో అయిపోతుందా? - అయితే ఈ టిప్స్ ఫాలో అవ్వండి!


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial