రెడ్‌మీ నోట్ 12 సిరీస్ స్మార్ట్ ఫోన్లు ఈ సంవత్సరం చైనాలో లాంచ్ కానున్నాయి. వీటి గ్లోబల్ లాంచ్ 2023లో జరగనుంది. ఈ సిరీస్‌లో రెడ్‌మీ నోట్ 12, రెడ్‌మీ నోట్ 12 ప్రో, రెడ్‌మీ నోట్ 12 ప్రో ప్లస్ స్మార్ట్ ఫోన్లు ఉండనున్నాయి. ఈ ఫోన్లు చైనా కంపల్సరీ సర్టిఫికేషన్ (3సీ) డేటాబేస్‌లో ఇప్పటికే కనిపించాయి. ఈ లిస్టింగ్‌లో వీటి ఫాస్ట్ చార్జింగ్ కెపాసిటీలు రివీల్ అయ్యాయి. రెడ్‌మీ నోట్ 12 ప్రో ప్లస్ స్మార్ట్ ఫోన్ 210W ఫాస్ట్ చార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది తెలుస్తోంది.


మై స్మార్ట్ ప్రైస్ కథనం ప్రకారం రెడ్‌మీ నోట్ 12 స్మార్ట్ ఫోన్ 22101316C మోడల్ నంబర్‌తో, రెడ్‌మీ నోట్ 12 ప్రో స్మార్ట్ ఫోన్ 22101316UCP మోడల్ నంబర్‌తో, రెడ్‌మీ నోట్ 12 ప్రో ప్లస్ స్మార్ట్ ఫోన్ 22101316UC మోడల్ నంబర్‌తోనూ 3సీ డేటాబేస్‌లో కనిపించాయి. రెడ్‌మీ నోట్ 12 స్మార్ట్ ఫోన్ 67W ఫాస్ట్ చార్జింగ్, రెడ్‌మీ నోట్ 12 ప్రో స్మార్ట్ ఫోన్ 120W ఫాస్ట్ చార్జింగ్, రెడ్‌మీ నోట్ 12 ప్రో ప్లస్ స్మార్ట్ ఫోన్ 210W ఫాస్ట్ చార్జింగ్‌లను సపోర్ట్ చేయనున్నట్లు 3సీ వెబ్ సైట్ ద్వారా లీక్ అయింది.


రెడ్‌మీ నోట్ 12 సిరీస్ ఈ సంవత్సరం ఏప్రిల్‌లోనే నెట్‌వర్క్ యాక్సెస్ లైసెన్స్‌ను పొందాల్సి ఉంది. రెడ్‌మీ నోట్ 12 ప్రో, రెడ్‌మీ నోట్ 12 ప్రో ప్లస్ స్మార్ట్ ఫోన్లు టెనా డేటాబేస్‌లో కూడా కనిపించాయి. ఇందులో 6.6 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ అమోఎల్ఈడీ డిస్‌ప్లే ఉండనుంది. రెడ్‌మీ నోట్ 12 ప్రో స్మార్ట్ ఫోన్‌లో 4980 ఎంఏహెచ్ బ్యాటరీ, రెడ్‌మీ నోట్ 12 ప్రో ప్లస్ స్మార్ట్ ఫోన్‌లో 4300 ఎంఏహెచ్ బ్యాటరీ అందించనున్నారు.


రెడ్‌మీ నోట్ 12 స్మార్ట్ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. రెడ్‌మీ 11 తరహాలో స్ట్రయిట్ ఎడ్జెస్ ఉన్న రెక్టాంగులర్ డిజైన్‌తో ఈ ఫోన్ లాంచ్ కానుంది. ఈ ఫోన్ త్వరలో లాంచ్ కానుందని లేటెస్ట్ డెవలప్‌మెంట్స్‌ను బట్టి చెప్పవచ్చు.


రెడ్‌‌మీ ఏ1 స్మార్ట్ ఫోన్ ఇటీవలే మనదేశంలో లాంచ్ అయింది. ఈ ఫోన్ ధరను రూ.6,499గా నిర్ణయించారు. క్లాసిక్ బ్లాక్, లైట్ గ్రీన్, లైట్ బ్లూ రంగుల్లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. డ్యూయల్ సిమ్‌ను ఇందులో అందించారు. 6.52 అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లేతో రెడ్‌మీ ఏ1 వచ్చింది. ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో ఏ22 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. 2 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ ఇందులో ఉన్నాయి.


ఫోన్ వెనకవైపు రెండు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 8 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు ఏఐ లెన్స్ కూడా ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 5 మెగాపిక్సెల్ సెన్సార్ అందించారు. 20 భారతీయ భాషలను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా, 10W ఫాస్ట్ చార్జింగ్‌ను అందించారు.


Also Read: iPhone 14 Series: ఐఫోన్ 14 సిరీస్ వ‌చ్చేసింది - ధర విషయంలో జాగ్రత్త పడ్డ యాపిల్ - మనదేశంలో ఎంతంటే?


Also Read: Apple Watch Series 8: యాపిల్ బెస్ట్ వాచ్ వచ్చేసింది - మనదేశంలో ధర ఎంతో తెలుసా?