మోటో జీ72 స్మార్ట్ ఫోన్ ఇప్పటికే కొంతకాలం నుంచి లీకుల్లో ఉంది. ఇప్పుడు దీని లాంచ్ తేదీ రివీల్ అయింది. దీనికి సంబంధించిన మైక్రోసైట్‌ను ఫ్లిప్‌కార్ట్ క్రియేట్ చేసింది. దీని డిజైన్, హైలెట్స్‌ను ఈ మైక్రో సైట్‌లో చూడవచ్చు.
మోటో జీ72 లాంచ్ తేదీ
మోటో జీ72 స్మార్ట్ ఫోన్ మనదేశంలో అక్టోబర్ 3వ తేదీన లాంచ్ కానుంది. ఇది ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉండనుంది. ఈ ఫోన్ మిడ్ రేంజ్ విభాగంలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. మిటియోరైట్ గ్రే, పోలార్ బ్లూ రంగుల్లో ఈ ఫోన్ మార్కెట్లో ఎంట్రీ ఇవ్వనుంది.
మోటో జీ72 స్పెసిఫికేషన్లు (అంచనా)
ఇందులో పీఓఎల్ఈడీ డిస్‌ప్లేను అందించనున్నారు. సన్నటి బెజెల్స్‌తో పంచ్ హోల్ తరహా డిజైన్‌ను ఇందులో అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్ కాగా, ఫుల్ హెచ్‌డీ+ రిజల్యూషన్‌తో ఈ డిస్‌ప్లే ఉండనుంది. దీని టచ్ శాంప్లింగ్ రేట్ 576 హెర్ట్జ్ గా ఉంది. హెచ్‌డీఆర్10 ను ఇది సపోర్ట్ చేయనుంది.
ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు ఉండనున్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 108 మెగాపిక్సెల్ కాగా దీంతోపాటు అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, మాక్రో లెన్స్ కూడా ఉండనున్నాయి. ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. అన్ని మోటొరోలా ఫోన్ల తరహాలోనే ఇది కూడా స్టాక్ ఆండ్రాయిడ్ ఎక్స్‌పీరియన్స్‌ను అందించనుంది.
మీడియాటెక్ హీలియో జీ99 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. మీడియాటెక్ హీలియో జీ96 ప్రాసెసర్ కంటే ఇది వేగంగా పని చేయనుంది. 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ఇందులో ఉండనున్నాయి. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా 33W ఫాస్ట్ చార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. డాల్బీ అట్మాస్ సపోర్ట్ కూడా ఇందులో ఉంది. సెక్యూరిటీ కోసం ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్‌లాక్ ఫీచర్‌లను అందించారు. ఐపీ52 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ రేటింగ్‌లు కూడా ఇందులో ఉన్నాయి.
మోటొరోలా తన 200 మెగాపిక్సెల్ కెమెరా స్మార్ట్ ఫోన్‌ను చైనాలో లాంచ్ చేసింది. అదే మోటొరోలా ఎక్స్30 ప్రో. ప్రపంచంలో 200 మెగాపిక్సెల్ సెన్సార్‌తో లాంచ్ అయిన మొదటి ఫోన్ ఇదే. వీటిలో 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 3,699 యువాన్లుగా (సుమారు రూ.43,600) నిర్ణయించారు. 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 4,199 యువాన్లుగానూ(సుమారు రూ.49,500), 12 జీబీ ర్యామ్ + 512 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 4,499 యువాన్లుగానూ (సుమారు రూ.53,000) ఉంది.
ఈ స్మార్ట్ ఫోన్‌లో 6.73 అంగుళాల పీఓఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 ప్లస్ జెన్ 1 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. 12 జీబీ వరకు ఎల్పీడీడీఆర్5 ర్యామ్, 512 జీబీ యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజ్ ఇందులో ఉన్నాయి. దీని బ్యాటరీ సామర్థ్యం 4500 ఎంఏహెచ్ కాగా, 125W ఫాస్ట్ చార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది.
ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 200 మెగాపిక్సెల్ కాగా... దీంతోపాటు 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 12 మెగాపిక్సెల్ టెలిఫొటో షూటర్ అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 60 మెగాపిక్సెల్ కెమెరా కూడా ఉంది. కేవలం ఏడు నిమిషాల్లోనే 50 శాతం చార్జింగ్, 19 నిమిషాల్లోనే పూర్తి చార్జింగ్ ఎక్కనుంది. 50W వైర్‌లెస్ చార్జింగ్‌ను కూడా ఇది సపోర్ట్ చేయనుంది.
Also Read: iPhone 14 Series: ఐఫోన్ 14 సిరీస్ వచ్చేసింది - ధర విషయంలో జాగ్రత్త పడ్డ యాపిల్ - మనదేశంలో ఎంతంటే?
Also Read: Apple Watch Series 8: యాపిల్ బెస్ట్ వాచ్ వచ్చేసింది - మనదేశంలో ధర ఎంతో తెలుసా?