రెడ్‌మీ ఏ2 ప్లస్ స్మార్ట్ ఫోన్ కొత్త వేరియంట్ మనదేశంలో లాంచ్ అయింది. ఇందులో 4 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ అందించారు. ఇదే ఫోన్‌కు చేసిన అప్‌గ్రేడ్. షావోమీ సబ్ బ్రాండ్ రెడ్‌మీ లాంచ్ చేసిన లేటెస్ట్ బడ్జెట్ ఫోన్ ఇదే. ఈ మొబైల్‌లో మీడియాటెక్ హీలియో జీ36 ప్రాసెసర్‌ను అందించారు. మూడు వేర్వేరు కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ అందుబాటులో ఉంది. ఫోన్ వెనకవైపు 8 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. ఈ ఫోన్ బేస్ వేరియంట్లు మనదేశంలో మార్చిలో లాంచ్ అయ్యాయి.


రెడ్‌మీ ఏ2 ప్లస్ ధర
ప్రస్తుతం లాంచ్ అయిన 4 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.8,499గా నిర్ణయించారు. గతంలో లాంచ్ అయిన 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.7,999గా ఉంది. క్లాసిక్ బ్లాక్, ఆక్వా బ్లూ, సీ గ్రీన్ రంగుల్లో ఈ ఫోన్ అందుబాటులో ఉంది. ఫ్లిప్‌కార్ట్, ఎంఐ.కాం, ఎంఐ హోం స్టోర్స్‌లో రెడ్‌మీ ఏ2 ప్లస్ కొనుగోలు చేయవచ్చు.


రెడ్‌మీ ఏ2 ప్లస్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టంపై రెడ్‌మీ ఏ2 ప్లస్ పని చేయనుంది. ఇందులో 6.52 అంగుళాల హెచ్‌డీ+ ఎల్సీడీ డిస్‌ప్లేను అందించారు. ఈ ఫోన్ టచ్ శాంప్లింగ్ రేట్ 120 హెర్ట్జ్‌గా ఉంది. వాటర్ డ్రాప్ తరహా నాచ్‌ను రెడ్‌మీ ఏ2 ప్లస్‌లో అందించారు. ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో జీ36 ప్రాసెసర్ కూడా రెడ్‌మీ ఏ2 ప్లస్‌లో ఉంది. 4 జీబీ వరకు ర్యామ్, 128 జీబీ వరకు స్టోరేజ్ అందించారు. మెమొరీ ఫ్యూజన్ ఫీచర్ ద్వారా ర్యామ్‌ను 7 జీబీ వరకు పెంచుకోవచ్చు. స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా మరింత పెంచుకునే అవకాశం ఉంది.


ఇక కెమెరాల విషయానికి వస్తే... ఈ స్మార్ట్ ఫోన్ వెనకవైపు రెండు కెమెరాలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 8 మెగాపిక్సెల్‌గా ఉంది. దీంతోపాటు క్యూవీజీఏ సెన్సార్ కూడా అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 5 మెగాపిక్సెల్ కెమెరాను అందుబాటులో ఉంది. ఎంట్రీ లెవల్ స్మార్ట్ ఫోన్ కాబట్టి ఇంతకంటే ఎక్కువ ఫీచర్లు ఇందులో ఆశించలేం.


దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉంది. 32 రోజుల వరకు స్టాండ్‌బై టైం, 32 గంటల వరకు కాలింగ్ టైంను ఇది అందించనుంది. 4జీ ఎల్టీఈ, వైఫై, బ్లూటూత్ వీ5, జీపీఎస్/ఏ-జీపీఎస్, గ్లోనాస్, బైదు, 3.5 ఎంఎం ఆడియో జాక్‌లు ఈ ఫోన్‌లో ఉన్నాయి. యాక్సెలరో మీటర్, ఫోన్ వెనకవైపు ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కూడా రెడ్‌మీ ఏ2 ప్లస్‌లో అందించారు. రెడ్‌మీ ఏ2 ప్లస్ స్మార్ట్ ఫోన్ మనదేశంలో మొట్టమొదటిగా ఈ సంవత్సరం మార్చిలో లాంచ్ అయింది.


Read Also: సెకండ్ హ్యాండ్ ఐఫోన్‌ కొంటున్నారా? ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోవాల్సిందే!


Read Also: మీ స్మార్ట్ ఫోన్ ఊరికే స్లో అయిపోతుందా? - అయితే ఈ టిప్స్ ఫాలో అవ్వండి!


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial