Realme Narzo 60x: తక్కువ ధరలో 5జీ ఫోన్ కొనాలనుకుంటున్నారా - రూ.13 వేలలోపే రియల్‌మీ కొత్త 5జీ మొబైల్ - ఫీచర్లు చూడండి!

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రియల్‌మీ తన కొత్త బడ్జెట్ స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసింది.

Continues below advertisement

Realme Narzo 60x: రియల్‌మీ నార్జో 60ఎక్స్ స్మార్ట్ ఫోన్ మనదేశంలో లాంచ్ అయింది. రియల్‌మీ నార్జో 60, రియల్‌మీ నార్జో 60 ప్రో స్మార్ట్ ఫోన్ల సరసన చేరింది. ఈ రెండు ఫోన్లూ జులైలోనే మనదేశంలో లాంచ్ అయ్యాయి. ఇప్పుడు రియల్‌మీ నార్జో 60ఎక్స్ కూడా మనదేశంలో లాంచ్ అయింది. ఈ ఫోన్‌లో ఆక్టాకోర్ 6ఎన్ఎం మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ ప్రాసెసర్‌ను అందించారు. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా, 5000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీని కూడా ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. 

Continues below advertisement

రియల్‌మీ నార్జో 60ఎక్స్ ధర, సేల్ వివరాలు
ఈ స్మార్ట్ ఫోన్‌కు సంబంధించి రెండు ర్యామ్ వేరియంట్లు మనదేశంలో లాంచ్ అయ్యాయి. 4 జీబీ ర్యామ్ వేరియంట్ ధర రూ.12,999 కాగా, 6 జీబీ ర్యామ్ వేరియంట్ ధర రూ.14,499గా నిర్ణయించారు. నెబ్యులా పర్పుల్, స్టెల్లార్ గ్రీన్ కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. సెప్టెంబర్ 15వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు రియల్‌మీ నార్జో 60ఎక్స్ సేల్ ప్రారంభం కానుంది. అమెజాన్, రియల్‌మీ వెబ్ సైట్లలో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు.

రియల్‌మీ నార్జో 60ఎక్స్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
ఈ స్మార్ట్ ఫోన్‌లో 6.72 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఎల్సీడీ డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్ కాగా, పీక్ బ్రైట్‌నెస్ లెవల్ 680 నిట్స్‌గా ఉంది. ఆండ్రాయిడ్ 13 ఆధారిత రియల్‌మీ యూఐ 4.0 ఆపరేటింగ్ సిస్టంపై ఈ స్మార్ట్ ఫోన్ పని చేయనుంది. ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ ప్రాసెసర్ ద్వారా రియల్‌మీ నార్జో 60ఎక్స్ రన్ కానుంది.

6 జీబీ వరకు ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్ ఈ స్మార్ట్ ఫోన్‌లో అందుబాటులో ఉంది. దీన్ని వర్చువల్‌గా 12 జీబీ వరకు పెంచుకోవచ్చు. అంటే 12 జీబీ వరకు ర్యామ్ ఇందులో ఉండనుందన్న మాట. 128 జీబీ యూఎఫ్ఎస్ 2.1 స్టోరేజ్ కూడా ఉంది. స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా పెంచుకోవచ్చు.

ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు రెండు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 2 మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్ కూడా అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 8 మెగాపిక్సెల్ కెమెరా అందుబాటులో ఉంది.

రియల్‌మీ నార్జో 60ఎక్స్ 5జీ బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా, 33W వైర్డ్ సూపర్ వూక్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఫోన్ పక్కభాగంలో అందించారు. 5జీ, 4జీ, జీపీఎస్, బ్లూటూత్, యూఎస్‌బీ టైప్-సీ 2.0 పోర్టు కూడా ఉన్నాయి. దీని బరువు 190 గ్రాములు కాగా, మందం 0.78 సెంటీమీటర్లుగా ఉంది.

Read Also: వాట్సాప్‌లో ఇకపై హై-క్వాలిటీ వీడియోలను పంపుకోవచ్చు, ఎలాగో తెలుసా?

Read Also: సెకండ్ హ్యాండ్ ఐఫోన్‌ కొంటున్నారా? ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోవాల్సిందే!

Read Also: మీ స్మార్ట్ ఫోన్ ఊరికే స్లో అయిపోతుందా? - అయితే ఈ టిప్స్ ఫాలో అవ్వండి!

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

Continues below advertisement
Sponsored Links by Taboola