రియల్‌మీ నార్జో 60 సిరీస్ స్మార్ట్ ఫోన్లు మనదేశంలో లాంచ్ అయ్యాయి. ఇందులో రియల్‌మీ నార్జో 60 5జీ, రియల్‌మీ నార్జో 60 ప్రో 5జీ మొబైల్స్ ఉన్నాయి. ఈ రెండు ఫోన్లలోనూ మీడియాటెక్ డైమెన్సిటీ ప్రాసెసర్లు అందించారు. 5000 ఎంఏహెచ్ బ్యాటరీలు, సూపర్‌వూక్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ వీటిలో ఉండనున్నాయి. రియల్‌మీ నార్జో 60 ప్రో 5జీలో ఏకంగా 1 టీబీ స్టోరేజ్‌ను అందించారు.
రియల్‌మీ నార్జో 60 5జీ ధర
ఇందులో రెండు వేరియంట్లు లాంచ్ అయ్యాయి. వీటిలో 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.17,999గా ఉంది. 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.19,999గా నిర్ణయించారు. కాస్మిక్ బ్లాక్, మార్స్ ఆరెంజ్ రంగుల్లో దీన్ని కొనుగోలు చేయవచ్చు.
రియల్ మీ నార్జో 60 ప్రో 5జీ ధర
ఈ స్మార్ట్ ఫోన్‌లో మూడు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.23,999 కాగా, 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.26,999గా నిర్ణయించారు. ఇక టాప్ ఎండ్ వేరియంట్ అయిన 12 జీబీ ర్యామ్ + 1 టీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.29,999గా నిర్ణయించారు.
ఈ రెండు స్మార్ట్ ఫోన్లకు సంబంధించిన ప్రీ-ఆర్డర్లు ఇప్పటికే ప్రారంభం అయ్యాయి. జులై 15వ తేదీ నుంచి వీటి సేల్ ప్రారంభం కానుంది. అమెజాన్ ప్రైమ్ డే 2023 సేల్‌లో ఈ ఫోన్‌ను విక్రయించనున్నారు. ప్రీ-ఆర్డర్ చేస్తే రియల్‌మీ నార్జో 60 5జీ మొబైల్‌పై రూ.1,000 తగ్గింపు లభించనుంది. రియల్‌మీ నార్జో 60 ప్రో 5జీని ఐసీఐసీఐ బ్యాంకు లేదా ఎస్‌బీఐ బ్యాంకు క్రెడిట్ కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే రూ.1,500 ఫ్లాట్ ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభించనుంది. రియల్‌మీ అధికారిక వెబ్ సైట్లో కూడా ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు.
రియల్‌మీ నార్జో 60 ప్రో 5జీ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
ఈ స్మార్ట్ ఫోన్‌లో 6.7 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ సూపర్ అమోఎల్ఈడీ కర్వ్‌డ్ డిస్‌ప్లేను అందించారు. ఆండ్రాయిడ్ 13 ఆధారిత రియల్‌మీ యూఐ 4.0 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పని చేయనుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7050 5జీ ప్రాసెసర్ రియల్‌మీ నార్జో 60 ప్రోలో ఉంది. 12 జీబీ వరకు ర్యామ్, 1 టీబీ వరకు స్టోరేజ్ ఇందులో అందించారు.
ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు రెండు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 100 మెగాపిక్సెల్ కాగా, మరో 2 మెగాపిక్సెల్ సెన్సార్ కూడా అందించారు. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఫీచర్‌ను ఈ కెమెరా సపోర్ట్ చేయనుంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు వైపు 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా, 67W సూపర్‌వూక్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఇందులో ఉంది.
రియల్‌మీ నార్జో 60 5జీ స్పెసిఫికేషన్లు
రియల్‌మీ నార్జో 60 స్మార్ట్ ఫోన్‌లో 6.43 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ సూపర్ అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్ కాగా, టచ్ శాంప్లింగ్ రేట్ 1000 హెర్ట్జ్‌గా ఉంది. ఆండ్రాయిడ్ 13 ఆధారిత రియల్‌మీ యూఐ 4.0 ఆపరేటింగ్ సిస్టంపైనే రియల్‌మీ నార్జో 60 కూడా పని చేయనుంది.
ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 6020 ప్రాసెసర్‌ను అందించారు. 16 జీబీ వరకు ర్యామ్, 256 జీబీ వరకు స్టోరేజ్ ఈ ఫోన్‌లో ఉండనున్నాయి. ఇన్‌బిల్ట్‌గా 8 జీబీ ర్యామ్ ఉండనుంది. అవసరం అయినప్పుడు స్టోరేజ్ నుంచి 8 జీబీ వరకు వర్చువల్ ర్యామ్‌గా వాడుకోవచ్చు.
కెమెరాల విషయానికి వస్తే... రియల్‌మీ నార్జో 60 5జీలో వెనకవైపు 64 మెగాపిక్సెల్‌ను అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉంది. 33W ఫాస్ట్ ఛార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది.
Read Also: ట్విట్టర్ చరిత్రలోనే అత్యధిక వ్యూస్ పొందిన మస్క్ ట్వీట్ - ఎంత రీచ్ వచ్చింది?
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial