రియల్‌మీ ఇటీవలే లాంచ్ చేసిన 11ఎక్స్ 5జీ సేల్ మనదేశంలో ప్రారంభం అయింది. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్ అందుబాటులో ఉంది. రూ.15 వేల లోపు ధరతోనే ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పని చేయనుంది. 64 మెగాపిక్సెల్ కెమెరాను కూడా  రియల్‌మీ 11ఎక్స్ 5జీలో అందించారు.


రియల్‌మీ 11ఎక్స్ 5జీ ధర, ఆఫర్లు
ఇందులో రెండు వేరియంట్లు లాంచ్ అయ్యాయి. వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.14,999గా ఉంది. ఇక టాప్ ఎండ్ వేరియంట్ అయిన 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.15,999గా నిర్ణయించారు.


మిడ్‌నైట్ బ్లాక్, పర్పుల్ డాన్ కలర్ ఆప్షన్లలో రియల్‌మీ 11ఎక్స్ 5జీని కొనుగోలు చేయవచ్చు. ఫ్లిప్‌కార్ట్, రియల్‌మీ, కొన్ని లీడింగ్ ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్లలో ఈ ఫోన్ అందుబాటులో ఉంది. ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డులతో ఈ ఫోన్ కొనుగోలు చేస్తే ప్రారంభ ఆఫర్ కింద రూ.1,500 తగ్గింపును కంపెనీ అందించనుంది.


రియల్‌మీ 11ఎక్స్ 5జీ స్పెసిఫికేషన్లు
ఆండ్రాయిడ్ 13 ఆధారిత రియల్‌మీ యూఐ 4.0 ఆపరేటింగ్ సిస్టంపై ఈ స్మార్ట్ ఫోన్ పని చేయనుంది. ఇందులో 6.72 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ శాంసంగ్ అమోఎల్ఈడీ డిస్‌ప్లేను కూడా కంపెనీ అందించింది. ఈ స్మార్ట్ ఫోన్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్ కాగా, టచ్ శాంప్లింగ్ రేట్ 240 హెర్ట్జ్‌గా ఉంది.


రియల్‌మీ 11ఎక్స్ 5జీలో 8 జీబీ ర్యామ్ అందించారు. డైనమిక్ ర్యామ్ ఎక్స్‌ప్యాన్షన్ ఫీచర్ ద్వారా ర్యామ్‌ను మరింత పెంచుకునే అవకాశం అందుబాటులో ఉంది. ఈ ఫీచర్ ద్వారా ర్యామ్‌ను ఏకంగా 16 జీబీ వరకు పెంచుకోవచ్చు. ఆక్టాకోర్ 6ఎన్ఎం మీడియాటెక్ డైమెన్సిటీ 6100 ప్లస్ ప్రాసెసర్‌పై రియల్‌మీ 11ఎక్స్ 5జీ పని చేయనుంది. ఈ ఫోన్ వెనకవైపు రెండు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 64 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 2 మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్ అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ ముందువైపు 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంది.


రియల్‌మీ 11ఎక్స్ 5జీలో 128 జీబీ వరకు స్టోరేజ్ అందించారు. ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఫోన్ పక్కభాగంలో అందించారు. 5జీ, 4జీ ఎల్టీఈ, వైఫై, బ్లూటూత్ వీ5.2, జీపీఎస్, ఏ-జీపీఎస్, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు వంటి కనెక్టివిటీ ఫీచర్లు కూడా ఉన్నాయి. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉంది. 33W ఫాస్ట్ ఛార్జింగ్‌ను రియల్‌మీ 11ఎక్స్ 5జీ సపోర్ట్ చేయనుంది. రియల్‌మీ 11ఎక్స్ 5జీ మందం 0.78 సెంటీమీటర్లు కాగా, బరువు 190 గ్రాములుగా ఉంది.


Read Also: వాట్సాప్‌లో ఇకపై హై-క్వాలిటీ వీడియోలను పంపుకోవచ్చు, ఎలాగో తెలుసా?


Read Also: సెకండ్ హ్యాండ్ ఐఫోన్‌ కొంటున్నారా? ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోవాల్సిందే!


Read Also: మీ స్మార్ట్ ఫోన్ ఊరికే స్లో అయిపోతుందా? - అయితే ఈ టిప్స్ ఫాలో అవ్వండి!


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial