OnePlus Nord CE 3 Lite 5G: వన్‌ప్లస్ నార్డ్ సీఈ 3 లైట్ 5జీ స్మార్ట్ ఫోన్ మనదేశంలో లాంచ్ అయింది. గతేడాది లాంచ్ అయిన వన్‌ప్లస్ నార్డ్ సీఈ 2 లైట్ 5జీకి తర్వాతి వెర్షన్‌గా ఈ ఫోన్ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ ఫోన్‌లో 6.72 అంగుళాల ఎల్సీడీ డిస్‌ప్లేను అందించారు. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉంది.
వన్‌ప్లస్ నార్డ్ సీఈ 3 లైట్ 5జీ ధర
ఈ ఫోన్ రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.19,999గా నిర్ణయించారు. ఇక టాప్ ఎండ్ మోడల్ అయిన 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.21,999గా ఉంది. పాస్టల్ లైమ్, క్రోమాటిక్ గ్రే రంగుల్లో దీన్ని కొనుగోలు చేయవచ్చు. వన్‌ప్లస్ ఆన్‌లైన్ స్టోర్, అమెజాన్ ఇండియా, ఇతర రిటైల్ స్టోర్లలో ఏప్రిల్ 11వ తేదీ నుంచి దీని సేల్ ప్రారంభం కానుంది.
ఐసీఐసీఐ బ్యాంకు కార్డులు, ఈఎంఐ లావాదేవీల ద్వారా వన్‌ప్లస్ నార్డ్ సీఈ 3 లైట్ 5జీ స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేస్తే రూ.1,000 తగ్గింపు లభించనుంది. దీంతోపాటు ఈ ఫోన్ నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లు కూడా అందుబాటులో ఉన్నాయి.
వన్‌ప్లస్ నార్డ్ సీఈ 3 లైట్ 5జీ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
ఆండ్రాయిడ్ 13 ఆధారిత ఆక్సిజన్ఓఎస్ 13.1 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పని చేయనుంది. రెండు మేజర్ ఆక్సిజన్ ఓఎస్ అప్‌డేట్స్, మూడు సంవత్సరాల పాటు సెక్యూరిటీ అప్‌డేట్స్ ఇస్తామని కంపెనీ తెలిపింది. ఇందులో 6.72 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఎల్సీడీ డిస్‌ప్లేను అందించారు. దీని యాస్పెక్ట్ రేషియో 20:9 కాగా, స్క్రీన్ టు బాడీ రేషియో 91.4 శాతంగా ఉంది. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌గానూ, టచ్ శాంప్లింగ్ రేట్ 240 హెర్ట్జ్‌గానూ ఉంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్ ద్వారా స్క్రీన్‌ను ప్రొటెక్ట్ చేయనున్నారు.
క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పని చేయనుంది. 8 జీబీ ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్ వన్‌ప్లస్ నార్డ్ సీఈ 3 లైట్ 5జీలో ఉంది. వర్చువల్‌గా మరో 8 జీబీ వరకు ర్యామ్ పెంచుకోవచ్చు. దీని స్టోరేజ్ 256 జీబీ వరకు ఉంది. స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 1 టీబీ వరకు పెంచుకోవచ్చు.
ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 108 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 2 మెగాపిక్సెల్ మాక్రో షూటర్, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కూడా అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 16 మెగాపిక్సెల్ కెమెరా అందుబాటులో ఉంది.
దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా, 67W సూపర్‌వూక్ వైర్డ్ చార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. 0 నుంచి 80 శాతం వరకు ఛార్జింగ్ కేవలం 30 నిమిషాల్లోనే ఎక్కుతుందని కంపెనీ అంటోంది. 5జీని కూడా ఇది సపోర్ట్ చేయనుంది. 5జీ, 4జీ ఎల్టీఈ, వైఫై, 3.5 ఎంఎం ఆడియో జాక్, బ్లూటూత్ వీ5.1, జీపీఎస్, ఏ-జీపీఎస్, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు వంటి కనెక్టివిటీ ఫీచర్లు అందించారు. డ్యూయల్ స్టీరియో స్పీకర్లు, నాయిస్ క్యాన్సిలేషన్ సపోర్ట్ కూడా ఈ ఫోన్‌లో ఉంది. దీని మందం 0.83 సెంటీమీటర్లు కాగా, బరువు 195 గ్రాములుగా ఉంది.