వన్‌ప్లస్ 10 ప్రో వినియోగదారులకు ఆక్సిజన్ ఓఎస్ 13 స్టేబుల్ అప్‌డేట్‌ను అందించారు. దీంతోపాటే ఆండ్రాయిడ్ 13 అప్‌డేట్ కూడా రానుంది. అయితే ఆక్సిజన్ ఓఎస్ 13 బీటా ప్రోగ్రాంలో పాల్గొన్నవారికి మొదట ఈ అప్‌డేట్ రానుంది. మిగిలిన వినియోగదారులకు తర్వాత అందించనున్నారు. NE2211_11.C.19 ఫర్మ్ వేర్ వెర్షన్ నంబర్‌తో మనదేశంలో ఆక్సిజన్ ఓఎస్ 13ను అందిస్తున్నారు. యూఎస్‌లో NE2215_11.C.19 వెర్షన్ నంబర్‌తోనూ, యూరోప్‌లో NE2213_11.C.19 వెర్షన్ నంబర్‌తోనూ ఈ అప్‌డేట్ రోల్అవుట్ అవుతుంది. వన్‌ప్లస్ 10 ప్రో మనదేశంలో మార్చి 31వ తేదీన లాంచ్ అయింది.
ఆక్సిజన్ఓఎస్ 13 ఛేంజ్ లాగ్: ఏం మారింది?
ఆండ్రాయిడ్ 13 ఆధారిత స్టేబుల్ ఆక్సిజన్ఓఎస్ 13 అప్‌డేట్‌ను వన్‌ప్లస్ అందించింది. భారతదేశంతో పాటు అమెరికా, యూరోప్‌ల్లో కూడా ఈ అప్‌డేట్ అందుబాటులోకి రానుంది. ఈ అప్‌డేట్ ద్వారా ఆక్వామార్ఫిక్ డిజైన్ థీమ్ కలర్స్, యానిమేషన్స్ లభించనున్నాయి. హోం స్క్రీన్ మీద వరల్డ్ క్లాక్ విడ్జెట్‌ను కూడా చూడవచ్చు. క్వాంటం యానిమేషన్ ఇంజిన్ 4.0ను కూడా ఇందులో యాడ్ చేశారు.
దీంతోపాటు వన్‌ప్లస్ ఫాంట్స్‌ను కూడా ఆప్టిమైజ్ చేసింది. ఈ అప్‌డేట్ ద్వారా మీటింగ్ అసిస్టెంట్, లార్జ్ ఫోల్డర్ ఐకాన్స్, మీడియా ప్లేబ్యాక్ కంట్రోల్స్ ద్వారా లభించనున్నాయి. కొత్త సైడ్‌బార్ టూల్‌బాక్స్ ద్వారా యాప్స్‌లో ఫ్లోటింగ్ విండోను ఓపెన్ చేయవచ్చు. ఇయర్ ఫోన్ కనెక్టివిటీని కూడా మరింత సులభంగా మార్చవచ్చని వన్‌ప్లస్ తెలిపింది.
వన్‌ప్లస్ 10 ప్రో స్పెసిఫికేషన్లు
ఆండ్రాయిడ్ 12 ఆధారిత కలర్ఓఎస్ 12.1 ఆపరేటింగ్ సిస్టంపై పనిచేయనుంది. ఇందులో 6.7 అంగుళాల క్యూహెచ్‌డీ+ కర్వ్‌డ్ అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. దీని డిస్‌ప్లే యాస్పెక్ట్ రేషియో 20.1:9గా ఉంది. డైనమిక్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్ ఫీచర్‌ను వన్‌ప్లస్ ఇందులో అందించింది. 12 జీబీ వరకు ర్యామ్, 256 జీబీ వరకు స్టోరేజ్ కూడా ఇందులో ఉంది. డిస్‌ప్లే ప్రొటెక్షన్ కోసం కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్యానెల్‌ను కూడా ఇందులో అందించారు.
క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 1 ప్రాసెసర్‌పై వన్‌ప్లస్ 10 ప్రో పనిచేయనుంది. 5జీ, 4జీ ఎల్టీఈ, వైఫై 6, బ్లూటూత్ వీ5.2, జీపీఎస్/ఏ-జీపీఎస్, ఎన్ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు వంటి కనెక్టివిటీ ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి.
ఇక కెమెరాల విషయానికి వస్తే.. ఇందులో వెనకవైపు మూడు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరాగా 48 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్789 సెన్సార్‌ను అందించారు. దీంతోపాటు 50 మెగాపిక్సెల్ శాంసంగ్ ఐసోసెల్ జేఎన్1 సెన్సార్‌ను అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాగానూ, మరో 8 మెగాపిక్సెల్ టెలిఫొటో షూటర్‌ను కూడా ఇందులో అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 32 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్615 కెమెరాను ఇందులో అందించారు. ఈ ఫోన్ 8కే వీడియో రికార్డింగ్‌ను కూడా సపోర్ట్ చేయనుంది.
ఇందులో ఇన్‌డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను అందించారు. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉంది. 80W వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్‌ను, 50W వైర్‌లెస్ చార్జింగ్‌ను కూడా ఇది సపోర్ట్ చేయనుంది. దీని మందం 0.85 సెంటీమీటర్లు కాగా, బరువు 200.5 గ్రాములుగా ఉంది. ఇందులో స్టీరియో స్పీకర్లు ఉన్నాయి. డాల్బీ అట్మాస్‌ను కూడా ఇది సపోర్ట్ చేయనుంది.
Also Read: iPhone 14 Series: ఐఫోన్ 14 సిరీస్ వచ్చేసింది - ధర విషయంలో జాగ్రత్త పడ్డ యాపిల్ - మనదేశంలో ఎంతంటే?
Also Read: Apple Watch Series 8: యాపిల్ బెస్ట్ వాచ్ వచ్చేసింది - మనదేశంలో ధర ఎంతో తెలుసా?