ఐకూ నియో 7 స్మార్ట్ ఫోన్‌ను కంపెనీ వైస్ ప్రెసిడెంట్ ఇటీవలే టీజ్ చేశారు. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 9000 ప్లస్ ప్రాసెసర్‌ను అందించనున్నారు. ఈ ఫోన్ అక్టోబర్‌లో మనదేశంలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఇక ఐకూ 11 సిరీస్ నవంబర్‌లో, వివో ఎక్స్90 సిరీస్ డిసెంబర్‌లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.


ప్రముఖ టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ తెలిపిన వివరాల ప్రకారం ఐకూ నియో 7లో 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్న ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లే ఉండనుంది. ఐకూ నియో 7 వెనకవైపు మూడు కెమెరాలు ఉండనున్నాయి. వీటిలో ప్రధాన కెమెరాగా 50 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్766వీ సెన్సార్ ఉండనుంది.


120W ఫాస్ట్ చార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఐఆర్ బ్లాస్టర్, ఎన్ఎఫ్‌సీ సపోర్ట్ కూడా ఇందులో ఉండనుంది. మిగతా స్పెసిఫికేషన్లన్నీ ఐకూ నియో 6 తరహాలోనే ఉండనున్నాయని తెలుస్తోంది.


దీని ముందు వెర్షన్ అయిన ఐకూ నియో 6 స్మార్ట్ ఫోన్ మనదేశంలో ఏప్రిల్‌లోనే లాంచ్ అయింది. ఇందులో మూడు వేరియంట్లు మార్కెట్లోకి వచ్చాయి. వీటిలో 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 2,799 యువాన్లుగా (సుమారు రూ.33,500) నిర్ణయించారు. 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 2,999 యువాన్లుగానూ (సుమారు రూ.35,900), 12 జీబీ ర్యామ్  + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 3,299 యువాన్లుగానూ (సుమారు రూ.39,400) ఉంది. బ్లూ, ఆరెంజ్ రంగుల్లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు.


ఐకూ నియో 6 స్పెసిఫికేషన్లు
ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఆరిజిన్ ఓఎస్ ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో 6.62 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. దీని యాస్పెక్ట్ రేషియో 20:9గానూ, స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌గానూ ఉంది. 12 జీబీ వరకు ర్యామ్, 256 జీబీ వరకు స్టోరేజ్ ఇందులో ఉన్నాయి.


దీని బ్యాటరీ సామర్థ్యం 4700 ఎంఏహెచ్‌గా ఉంది. 80W ఫ్లాష్ చార్జ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 1 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. ఈ స్మార్ట్ ఫోన్ మందం 0.85 సెంటీమీటర్లు కాగా... బరువు 193.95 గ్రాములుగా ఉంది.


ఇక కెమెరాల విషయానికి వస్తే... ఇందులో వెనకవైపు మూడు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 64 మెగాపిక్సెల్ కాగా... దీంతోపాటు 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగాపిక్సెల్ మోనోక్రోమ్ లెన్స్ కూడా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 16 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు.


Also Read: iPhone 14 Series: ఐఫోన్ 14 సిరీస్ వ‌చ్చేసింది - ధర విషయంలో జాగ్రత్త పడ్డ యాపిల్ - మనదేశంలో ఎంతంటే?


Also Read: Apple Watch Series 8: యాపిల్ బెస్ట్ వాచ్ వచ్చేసింది - మనదేశంలో ధర ఎంతో తెలుసా?