మోటో జీ84 5జీ స్మార్ట్ ఫోన్ మనదేశంలో సెప్టెంబర్ 1వ తేదీన లాంచ్ కానుంది. మోటో జీ82 5జీకి తర్వాతి వెర్షన్‌గా మోటో జీ84 5జీ రానుంది. వీటిలో మోటో జీ82 5జీ 2022లో లాంచ్ అయింది. ప్రస్తుతానికి మోటో జీ84 5జీకి సంబంధించిన డిజైన్, కలర్ ఆప్షన్లను కంపెనీ లాంచ్ చేసింది. డిస్‌ప్లే, ప్రాసెసర్, కెమెరా, బ్యాటరీ వంటి కీలక స్పెసిఫికేషన్లను కూడా కంపెనీ టీజ్ చేసింది. ప్రస్తుతానికి ఒక టిప్‌స్టర్ ఈ ఫోన్ ధరను కూడా లీక్ చేశారు.


ప్రముఖ టిప్‌స్టర్ యోగేష్ బ్రార్ దీని ధర రూ.22 వేల నుంచి రూ.24 వేల మధ్యలో ఉండవచ్చని ట్వీట్ చేశారు. ఆక్టాకోర్ క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పని చేయనుంది. 12 జీబీ వరకు ర్యామ్, 256 జీబీ వరకు స్టోరేజ్ ఈ ఫోన్‌లో ఉండనుంది.


మోటొరోలా తెలుపుతున్న దాని ప్రకారం ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టంపై పని చేయనుంది. మార్ష్‌మెల్లో బ్లూ, మిడ్‌నైట్ బ్లూ, వివా మాగెంటా కలర్ ఆప్షన్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు. వివా మాగెంటా కలర్ ఆప్షన్ వెగాన్ లెదర్ ఫినిష్‌తో రానుంది.


మోటో జీ84 5జీ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
ఇందులో 6.55 అంగుళాల 10 బిట్ పీఓఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌గా ఉండనుంది. ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు ఉండనున్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్, 8 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కూడా ఉన్నాయి. దీంతోపాటు ఎల్ఈడీ ఫ్లాష్ యూనిట్ కూడా ఉండనుంది.


వెనకవైపు దీర్ఘచతురస్రాకారంలో కెమెరా మాడ్యూల్‌ను అందించారు. బ్యాక్ ప్యానెల్‌లో పైన ఎడమవైపు లెఫ్ట్ కార్నర్‌లో ఈ కెమెరా సెటప్ ఉంది. అలాగే ఫ్రంట్ కెమెరా కోసం ముందువైపు మధ్యలో హోల్ పంచ్ కెమెరాను అందించారు. 


ఇందులో 5000 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు. 30W ఫాస్ట్ ఛార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. డస్ట్, స్ప్లాష్ రెసిస్టెన్స్ కోసం ఐపీ54 రేటింగ్ కూడా ఉంది. 5జీ కనెక్టివిటీ, డాల్బీ అట్మాస్, మోటో స్పేషియల్ సౌండ్, స్పోర్ట్స్ స్టీరియో స్పీకర్లు కూడా ఈ ఫోన్‌లో ఉండనున్నాయి. మోటో ఈ13 స్మార్ట్ ఫోన్‌లో కొత్త వేరియంట్‌ లాంచ్ కానుంది.






Read Also: సెకండ్ హ్యాండ్ ఐఫోన్‌ కొంటున్నారా? ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోవాల్సిందే!


Read Also: మీ స్మార్ట్ ఫోన్ ఊరికే స్లో అయిపోతుందా? - అయితే ఈ టిప్స్ ఫాలో అవ్వండి!


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial