ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ మోటొరోలా తన మోటో ఈ13 స్మార్ట్ ఫోన్‌లో కొత్త వేరియంట్‌ను లాంచ్ చేసింది. ఇందులో 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ అందించారు. దీనికి సంబంధించిన సేల్ ఆగస్టు 16వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఈ స్మార్ట్ ఫోన్‌లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు.


మోటో ఈ13 ధర
ప్రస్తుతం లాంచ్ అయిన 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.8,999గా నిర్ణయించారు. గతంలో లాంచ్ అయిన 2 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.6,999గానూ, 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.7,999గానూ ఉంది. ఇప్పుడు లాంచ్ అయిన కొత్త వేరియంట్ సేల్ ఆగస్టు 16వ తేదీ నుంచి జరగనుంది. ఫ్లిప్‌కార్ట్‌లో దీన్ని కొనుగోలు చేయవచ్చు.


మోటో ఈ13 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే.. ఇందులో 6.5 అంగుళాల హెచ్‌డీ+ ఐపీఎల్ ఎల్సీడీ డిస్‌ప్లేను అందించారు. దీని యాస్పెక్ట్ రేషియో 20:9గా ఉంది. 60 హెర్ట్జ్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్ ఫీచర్ కూడా ఇందులో అందించారు. ఆక్టాకోర్ యూనిసోక్ టీ606 ప్రాసెసర్‌పై మోటో ఈ13 పనిచేయనుంది. 8 జీబీ వరకు ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ఉండనున్నాయి. స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 1 టీబీ వరకు పెంచుకునే అవకాశం ఉంది.


ఇక కెమెరాల విషయానికి వస్తే.. ఇందులో వెనకవైపు రెండు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 13 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కూడా ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 5 మెగాపిక్సెల్ సెన్సార్ అందించారు. డాల్బీ అట్మాస్ ఆడియోను ఇది సపోర్ట్ చేయనుంది.


దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉంది. 10W ఫాస్ట్ చార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. 4జీ, వైఫై, బ్లూటూత్, జీపీఎస్/ఏ-జీపీఎస్, ఎఫ్ఎం రేడియో, యూఎస్‌బీ టైప్-సీ, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్ ఇందులో ఉన్నాయి. ఫోన్ వెనకవైపు ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ అందుబాటులో ఉంది. గూగుల్ అసిస్టెంట్‌కు కూడా ప్రత్యేకమైన బటన్ అందించారు. ఈ ఫోన్ మందం 0.85 సెంటీమీటర్లు కాగా, బరువు 179.5 గ్రాములుగా ఉంది.










Read Also: గూగుల్ కాకుండా బెస్ట్ సెర్చింజన్లు ఇవే - టాప్ 5 స్థానాల్లో ఏం ఉన్నాయి?


Read Also: వణుకు పుట్టిస్తున్న AI కెమేరాలు - ఒక్క నెలలో ఎంపీలు, ఎమ్మెల్యేలతో సహా 32 లక్షల మందికి జరిమానా


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial