Lava O2: 50 మెగాపిక్సెల్ కెమెరా, 16 జీబీ + 128 జీబీ - రూ.8 వేలలోపే ధరలోనే లావా ఓ2 లాంచ్!

Lava New Phone: భారతీయ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ లావా మనదేశంలో కొత్త ఫోన్ లాంచ్ చేసింది. అదే లావా ఓ2.

Continues below advertisement

Lava O2 Launched: లావా ఓ2 స్మార్ట్ ఫోన్ మనదేశంలో లాంచ్ అయింది. కంపెనీ లాంచ్ చేసిన లేటెస్ట్ బడ్జెట్ ఫోన్ ఇదే. ఈ కొత్త స్మార్ట్ ఫోన్ యూనిసోక్ టీ616 ప్రాసెసర్‌పై రన్ కానుంది. ఇందులో 8 జీబీ వరకు ర్యామ్ అందించారు. 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్న హెచ్‌డీ+ డిస్‌ప్లే, వెనకవైపు 50 మెగాపిక్సెల్ కెమెరా కూడా అందించారు. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా, 18W ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేయనుంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఫోన్ పక్కభాగంలో అందించారు.

Continues below advertisement

లావా ఓ2 ధర (Lava O2 Price in India)
ఇందులో కేవలం ఒక్క వేరియంట్ మాత్రమే అందుబాటులో ఉంది. 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్‌తో వచ్చిన ఈ వేరియంట్ ధరను రూ.8,499గా నిర్ణయించారు. ప్రారంభ ఆఫర్ కింద రూ.500 తగ్గింపు లభించనుంది. అంటే రూ.7,999కే దీన్ని దక్కించుకోవచ్చన్న మాట. మార్చి 27వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు దీని సేల్ జరగనుంది. అమెజాన్, లావా ఈ-స్టోర్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు. ఇంపీరియల్ గ్రీన్, మ్యాజెస్టిక్ పర్పుల్, రాయల్ గోల్డ్ కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ అందుబాటులో ఉంది.

లావా ఓ2 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు (Lava O2 Specifications)
డ్యూయల్ సిమ్ లావా ఓ2 స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టంపై పని చేయనుంది. ఇందులో 6.5 అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు. దీని పిక్సెల్ డెన్సిటీ 269 పీపీఐ కాగా, స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్‌గా ఉంది. యూనిసోక్ టీ616 ప్రాసెసర్‌పై లావా ఓ2 రన్ కానుంది. 8 జీబీ ర్యామ్ ఇందులో అందించారు. వర్చువల్ ర్యామ్ ఫీచర్ ద్వారా దీన్ని 16 జీబీ వరకు పెంచుకోవచ్చు.

ఫోన్ వెనకవైపు రెండు కెమెరాలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్‌గా ఉంది. దీంతోపాటు ఎల్ఈడీ ఫ్లాష్ కూడా అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 8 మెగాపిక్సెల్ సెన్సార్ అందుబాటులో ఉంది. స్క్రీన్ ఫ్లాష్ ఫీచర్‌ను కంపెనీ లావా ఓ2లో అందించడం విశేషం.

128 జీబీ యూఎఫ్ఎస్ 2.2 ఇంటర్నల్ స్టోరేజ్ ఈ ఫోన్‌లో ఉంది. దీన్ని మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 512 జీబీ వరకు పెంచుకోవచ్చు. 4జీ వోల్టే, బ్లూటూత్ 5, జీపీఆర్ఎస్, ఓటీజీ, వైఫై, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్ అందించారు. ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఫోన్ పక్కభాగంలో అందించారు. ఫేస్ అన్‌లాక్ ఫీచర్ కూడా అందుబాటులో ఉంది. యాక్సెలరో మీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్లను కూడా ఈ ఫోన్‌లో చూడవచ్చు.

లావా ఓ2 బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా, 18W ఫాస్ట్ ఛార్జింగ్‌ను కూడా ఈ డివైస్ సపోర్ట్ చేయనుంది. ఒక్కసారి పూర్తిగా ఛార్జింగ్ పెడితే 500 గంటల స్టాండ్ బై టైంను, 38 గంటల టాక్ టైంను ఈ ఫోన్ అందిస్తుందని కంపెనీ తెలిపింది. దీని మందం 0.87 సెంటీమీటర్లు కాగా, బరువు 200 గ్రాములుగా ఉంది.

Also Read: నోకియా ఫోన్లు ఇక కనిపించవా? - కంపెనీ కొత్త ప్రకటనకు అర్థం ఏంటి?

Also Read: వాట్సాప్ ఛాట్ బ్యాకప్ చేస్తున్నారా? - అయితే త్వరలో రానున్న ఈ రూల్ తెలుసా?

Continues below advertisement