ఐటెల్ పీ40 ప్లస్ స్మార్ట్ ఫోన్ మనదేశంలో లాంచ్ అయింది. చైనీస్ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ అందించిన బడ్జెట్ ఫ్రెండ్లీ మొబైల్ ఇదే. ఈ కొత్త హ్యాండ్‌సెట్‌లో ఎల్సీడీ డిస్‌ప్లేను అందించారు. ఫోన్ వెనకవైపు హోల్ పంచ్ కటౌట్ అందించారు. యూనిసోక్ టీ606 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పని చేయనుంది. 4 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్‌ను ఇందులో అందించారు. ఐటెల్ పీ40 ప్లస్ స్మార్ట్ ఫోన్‌లో 7000 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 18 రోజుల స్టాండ్ బై టైంను ఇది అందించనుంది.


ఐటెల్ పీ40 ప్లస్ ధర
ఈ ఫోన్‌లో కేవలం ఒక్క వేరియంట్ మాత్రమే భారతీయ మార్కెట్లో లాంచ్ అయింది. 4 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్‌తో వచ్చిన ఈ వేరియంట్ ధరను రూ.8,099గా నిర్ణయించారు. ఫోర్స్ బ్లాక్, ఐస్ సియాన్ కలర్ ఆప్షన్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు. అమెజాన్‌లో జులై 11వ తేదీ నుంచి దీని సేల్ జరగనుంది. ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంకు కార్డుల ద్వారా ఈ ఫోన్ కొనుగోలు చేస్తే 10 శాతం అదనపు తగ్గింపు లభించనుంది.


ఐటెల్ పీ40 ప్లస్ స్పెసిఫికేషన్లు
ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పని చేయనుంది. ఇందులో 6.8 అంగుళాల హెచ్‌డీ+ ఐపీఎస్ డిస్‌ప్లేను అందించారు. 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఫీచర్ కూడా ఇందులో ఉంది. సెల్ఫీ కెమెరా కోసం హోల్ పంచ్ కటౌట్ కూడా అందించారు. ఆక్టాకోర్ యూనిసోక్ టీ606 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పని చేయనుంది. 4 జీబీ ర్యామ్ ఇందులో ఉంది. ఉపయోగించని స్టోరేజ్ నుంచి మరో 4 జీబీ వరకు ర్యామ్ పెంచుకోవచ్చు.


ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు రెండు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 13 మెగాపిక్సెల్‌గా ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 8 మెగాపిక్సెల్ కెమెరా అందించారు. ఇందులో 128 జీబీ స్టోరేజ్ కూడా అందించారు.


ఫేస్ అన్‌లాక్ సపోర్ట్, ఫింగర్ ప్రింట్ సెన్సార్ వంటి సెక్యూరిటీ ఫీచర్లు ఉన్నాయి. వైఫై, బ్లూటూత్, జీపీఎస్, 4జీ, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్ వంటి కనెక్టివిటీ ఫీచర్లు అందించారు. దీని బ్యాటరీ 7000 ఎంఏహెచ్‌గా ఉంది. ఒక్కసారి ఛార్జింగ్ పెడితే 18 రోజుల స్టాండ్‌బై టైం లభించనుంది. 72 గంటల మ్యూజిక్ ప్లేబ్యాక్, 41 గంటల టాక్ టైంను సింగిల్ ఛార్జ్‌తో ఈ ఫోన్ అందిస్తుందని కంపెనీ పేర్కొంది.






Read Also: ట్విట్టర్ చరిత్రలోనే అత్యధిక వ్యూస్ పొందిన మస్క్ ట్వీట్ - ఎంత రీచ్ వచ్చింది?


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial