ఐకూ జెడ్6 లైట్ 5జీ స్మార్ట్ ఫోన్ మనదేశంలో లాంచ్ అయింది. ప్రపంచంలోనే క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 1 ప్రాసెసర్‌తో లాంచ్ అయిన మొదటి ఫోన్ ఇదే. దీని స్క్రీన్ రిప్రెష్ రేట్ 120 హెర్ట్జ్ కాగా, దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉంది.


ఐకూ జెడ్6 లైట్ 5జీ ధర
ఇందులో రెండు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.13,999 కాగా, 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.15,499గా నిర్ణయించారు. పోకో ఎం5, రెడ్‌మీ 11 ప్రైమ్ 5జీలతో ఈ ఫోన్ పోటీ పడనుంది. స్టెల్లార్ గ్రీన్, మిస్టిక్ నైట్ కలర్ ఆప్షన్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు.


సెప్టెంబర్ 14వ తేదీ నుంచి అమెజాన్‌లో ఐకూ జెడ్6 లైట్ 5జీ సేల్ జరగనుంది. ఎస్‌బీఐ క్రెడిట్ కార్డులతో కొనుగోలు చేస్తే ఈ స్మార్ట్ ఫోన్‌పై రూ.2,500 తగ్గింపు అందించనున్నారు. దీంతో ఈ స్మార్ట్ ఫోన్ 4 జీబీ ర్యామ్ వేరియంట్ ధర రూ.11,499కు తగ్గనుంది. 6 జీబీ ర్యామ్ వేరియంట్ ధర రూ.13,999కు తగ్గింది.


ఐకూ జెడ్6 లైట్ 5జీ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
ఐకూ జెడ్6 లైట్ 5జీలో 6.58 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు. ఈ స్మార్ట్ ఫోన్ టచ్ శాంప్లింగ్ రేట్ 240 హెర్ట్జ్‌గా ఉంది. స్క్రీన్ రిజల్యూషన్ 2408×1080 పిక్సెల్స్‌గా ఉంది. 2.5డీ ఫ్లాట్ ఫ్రేమ్ డిజైన్ ఈ ఫోన్‌లో అందించారు. ఏజీ మ్యాట్ ఫినిష్ కూడా ఇందులో ఉంది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 1 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పని చేయనుంది. 


6 జీబీ వరకు ర్యామ్, 128 జీబీ వరకు స్టోరేజ్ ఈ ఫోన్‌లో అందించారు. స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 1 టీబీ వరకు పెంచుకోవచ్చు. ఫోన్ వెనకవైపు రెండు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 2 మెగాపిక్సెల్ మాక్రో కెమెరా కూడా అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంది.


ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ ఆపరేటింగ్ సిస్టంపై ఐకూ జెడ్6 లైట్ 5జీ పని చేయనుంది. రెండు సంవత్సరాల పాటు మేజర్ అప్‌డేట్స్‌ను ఇది అందించనుంది. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా, 18W ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. దీని చార్జర్‌ను ప్రత్యేకంగా కొనుగోలు చేయాల్సి ఉంటుంది. 


Also Read: iPhone 14 Series: ఐఫోన్ 14 సిరీస్ వ‌చ్చేసింది - ధర విషయంలో జాగ్రత్త పడ్డ యాపిల్ - మనదేశంలో ఎంతంటే?


Also Read: Apple Watch Series 8: యాపిల్ బెస్ట్ వాచ్ వచ్చేసింది - మనదేశంలో ధర ఎంతో తెలుసా?