ఈ మెయిల్స్, ఫొటోస్, వీడియోస్, కాంటాక్ట్స్ సహా ఎన్నో విషయాలు గూగుల్ తో ముడిపడి ఉన్నాయి. గూగుల్ అకౌంట్ ఉంటే ఇవన్నీ భద్రంగా దాచుకునే అవకాశం ఉంది. స్మార్ట్ ఫోన్స్ లో గూగుల్ అకౌంట్ లేకపోతే అసలు ఏ పనీ జరగదు. అందుకే గూగుల్ అకౌంట్ ను బ్యాకప్ చేసుకోవడం చాలా అవసరం. నిజానికి స్మార్ట్ ఫోన్స్ లో ఆటో బ్యాకప్ ఉంటుంది. అయితే.. గూగుల్ అకౌంట్ బ్యాకప్ అయ్యిందో? లేదో? మ్యాన్యువల్ గా కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది.
మీరు మీ పాత స్మార్ట్ ఫోన్ ను చాలా కాలంగా ఉపయోగిస్తున్నట్లయితే, మరో స్మార్ట్ ఫోన్ కు మారడం కాస్త కష్టంగానే ఉంటుంది. అంతేకాదు.. పాత ఫోన్ లో ఫోటోలు, వీడియోలు, చాట్, యాప్ డేటా, ఫైళ్లు, ఫోల్డర్‌ల వరకు అన్నింటినీ కొత్త ఫోన్ లోకి బదిలీ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే, మీ పాత ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ లోని కంటెంట్ మొత్తాన్ని గూగుల్ అకౌంట్ లో బ్యాకప్ చేసి.. కొత్త పోన్ లోకి తీసుకునే అవకాశం ఉంటుంది. మీ చేయాల్సిందల్లా మీ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ ను మీ గూగుల్ అకౌంట్ కు కనెక్ట్ చేయడం. ఆ తర్వాత ఆటోమేటిక్ గా డేటా బ్యాకప్ అవుతుంది. దాన్ని మరో కొత్త ఫోన్ లోకి డౌన్ లోడ్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. మీ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ లో మీ డేటాను బ్యాకప్ చేయడానికి, కొత్త స్మార్ట్ ఫోన్ లో దాన్ని డౌన్ లోడ్ చేసుకోవడానికి సంబంధించిన పద్దతి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
డేటాను ఆటోమేటిక్ గా బ్యాకప్ చేయడం ఎలా?
1 - మీ Android స్మార్ట్ ఫోన్ లో సెట్టింగ్స్ ను ఓపెన్ చేయండి.
2 - ఇప్పుడు, Googleని ఎంచుకోండి.
3 - ఆ తర్వాత బ్యాకప్‌ను సెలక్ట్ చేయండి.
4 - బ్యాకప్ నౌ అనే ఆప్షన్ నొక్కండి. వెంటనే డేటా బ్యాకప్ అవుతుంది.
డేటాను మాన్యువల్గా బ్యాకప్ చేయడం ఎలా?
1 - మీ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ లో సెట్టింగ్స్ ను ఓపెన్ చేయండి.
2 - ఇప్పుడు Googleని నొక్కండి.
3 - అనంతరం బ్యాకప్‌ను సెలక్ట్ చేసి, క్లిక్ చేయండి.
4 - చివరగా బ్యాకప్ నౌ ఎంపికను నొక్కండి. వెంటనే డేటా బ్యాకప్ అవుతుంది.
మీ కొత్త ఫోన్ లో డేటాను ఎలా డౌన్ లోడ్ చేసుకోవాలంటే?
మీరు కొత్త స్మార్ట్ ఫోన్ ను సెటప్ చేస్తున్నప్పుడు బ్యాకప్ తీసుకునే ఎంపిక కనిపిస్తుంది. మీరు చేయాల్సిందల్లా మీ గూగుల్ అకౌంట్ లోకి లాగిన్ కావాలి. ఆపై రీస్టోర్ బ్యాకప్ ఎంపికపై నొక్కండి. మీరు బ్యాకప్ చేయాలి అనుకుంటున్నారా అని అడుగుతుంది. మీరు రీస్టోర్ చేయాలి అనుకుంటున్న పలు అంశాలు కనిపిస్తాయి. అందులో ఫోటోలు, చాట్ లు, యాప్ ల వంటి పలు అంశాలను ఎంచుకోండి. వెంటనే గూగుల్.. మీరు కావాలి అనుకున్న బ్యాకప్ ను కొత్త మోబైల్ లో రీస్టోర్ చేస్తుంది.
Also Read: iPhone 14 Series: ఐఫోన్ 14 సిరీస్ వచ్చేసింది - ధర విషయంలో జాగ్రత్త పడ్డ యాపిల్ - మనదేశంలో ఎంతంటే?
Also Read: Apple Watch Series 8: యాపిల్ బెస్ట్ వాచ్ వచ్చేసింది - మనదేశంలో ధర ఎంతో తెలుసా?