iPhone SE 4 Specifications | టెక్ దిగ్గజం ఆపిల్ నుంచి ఏదైనా కొత్త ప్రాడక్ట్ వస్తుందంటే స్మార్ట్ ఫోన్ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. త్వరలో యాపిల్ ఓ కొత్త స్మార్ట్ ఫోన్ మోడల్‌ను మార్కెట్లోకి తీసుకురానుంది. కొన్ని రోజుల కిందటి వరకు యాపిల్ ఐఫోన్ ఎస్ఈ4 (iPhone SE 4) మీద ఊహాగానాలు ఉండేవి. కానీ యాపిల్ సీఈవో టిమ్ కిక్ (Tim Cook) వాటిక్ చెక్ పెడుతూ ఓ విషయాన్ని అధికారికంగా వెల్లడించారు. ఫిబ్రవరి 19న యాపిల్ కంపెనీ కొత్త మోడల్ మార్కెట్లోకి లాంచ్ ఛేస్తున్నట్లు సోషల్ మీడియాలో ప్రకటించారు.  

ఐఫోన్ ఎస్ఈ4 (iPhone SE4) నుంచి ఇది 4వ జనరేషన్. SE సిరీస్‌ను రీఫ్రెష్ చేయడంలో భాగంగా యాపిల్ కొత్త మోడల్ రిలీజ్ చేస్తోంది. యాపిల్ నాలుగో తరం ఎస్ఈ మోడల్ ను ఫిబ్రవరి 19న మార్కెట్లోకి లాంఛ్ చేస్తున్నామని సీఈవో టిమ్ కుక్ ప్రకటించడంతో కొత్త ఐఫోన్ ఫోన్ మీద అంచనాలు పెరిగిపోతున్నాయి. కొత్త మోడల్ బడ్జెట్ ధరలోనే వినియోగదారులకు అందుబాటులోకి వస్తుందని సంస్థ పేర్కొంది. 

ఐఫోన్ ఎస్ఈ4 అంచనా ధరఐఫోన్ ఎస్ఈ 4 ధర (iPhone SE4 Price) సుమారుగా 499 డాలర్లు ఉండనుంది. భారత కరెన్సీలో రూ.43,500 - రూ.44,000 నుంచి iPhone SE4 మార్కెట్లోకి రానుంది. ఐఫోన్ ఎస్ఈ 3 ధర 429 డాలర్లతో లాంచ్ అయింది. ఆ తరువాత ధర పెరిగింది. వచ్చే వారం లాంఛ్ కానున్న ఎస్ఈ 4 మరిన్ని ఫీచర్లతో రాబోతోంది. డిమాండ్ కనుక పెరిగితే యాపిల్ దీని ధర సైతం పెంచే అవకాశం ఉంది. 

ఐఫోన్ SE 4 ఫీచర్లు, స్పెసిఫికేషన్లుత్వరలో మార్కెట్లోకి రానున్న ఐఫోన్ SE 4 ఐఫోన్ 8లాంటి డిజైన్‌ను పోలి ఉంది. మరికొందరు నెటిజన్స్ ఐఫోన్ 14ని గుర్తుకు తెచ్చేలా ఫ్లాట్ ఎడ్జ్డ్ ఫ్రేమ్ ఉందంటున్నారు. డిస్‌ప్లేలో మార్పులు గమనించవచ్చు.  పాత LCD స్క్రీన్ బదులుగా 6.06 ఇంచుల OLED ప్యానెల్‌ ఉందని రిపోర్ట్స్ సూచిస్తున్నాయి. స్క్రీన్ 2532x1170 పిక్సెల్‌స్ రిజల్యూషన్, 60Hz రిఫ్రెష్ రేట్‌ ప్లస్ కానుంది. ఆపిల్ ఐఫోన్ SE 4 లో కెమెరా క్లారిటీ అప్‌గ్రేడ్‌ చేశారు. 48MP బ్యాక్ కెమెరా, 12 MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. బ్యాటరీ విషయంలో ఎంతో మెరుగైంది. గతంలో ఎస్ మోడల్‌లో 2,018mAh ఉన్న బ్యాటరీ తాజా మోడల్‌లో  3,279 mAhకి అప్‌గ్రేడ్ చేశారు. 

  • డిస్‌ప్లే: 6.06 అంగుళాల OLED,
  • 2532x 1170 స్క్రీన్ రిజల్యూషన్, సెరామిక్ షీల్డ్ ప్రొటెక్షన్  
  • ప్రాసెసర్: A18 చిప్
  • ర్యామ్: 8 GB
  • స్టోరేజ్ కెపాసిటీ: 128 GB
  • బ్యాక్ కెమెరా: 48 మెగా పిక్సెల్స్
  • ఫ్రంట్ కెమెరా: 12 మెగా పిక్సెల్స్
  • బ్యాటరీ: 3,279 mAh
  • కనెక్టివిటీ: 5G, Wi-Fi 6
  • బ్లూటూత్ 5.3
  • ఛార్జింగ్: USB- టైప్ C (వైర్డ్), Qi2 (MagSafe) వైర్‌లెస్
  • రీఫ్రెష్ రేట్: 60Hz  

Also Read: JioHotstar Subscription Plans: ఐపీఎల్‌ లవర్స్‌కు బిగ్‌షాక్- జియో హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ తీసుకుంటేనే మ్యాచ్‌ చూసే ఛాన్స్‌- ప్లాన్స్ రేట్లు ఇవే