iphone 16e : ఆపిల్ కంపెనీ ఈ మధ్య కాలంలోనే చౌకైన మోడల్ ఐఫోన్ 16eని విడుదల చేసింది. ఫిబ్రవరి 19న విడుదలైన ఈ ఫోన్‌లు అమ్మకాలు ఫిబ్రవరి 28 నుంచి ప్రారంభంకానున్నాయి. ఇప్పటికే ముందస్తు బుకింగ్‌లు ప్రారంభమయ్యాయి. భారత్‌లో ఈ ఫోన్ ధర రూ.59,900గా నిర్ణయించింది. అయితే అమ్మకానికి ముందే ఆపిల్ అధికారిక పంపిణీదారు రెడింగ్టన్ ఆకర్షణీయమైన ఆఫర్లు ప్రకటించింది. ఈ ఆఫర్ కారణంగా ఈ ఫోన్‌పై ఏకంగా రూ. 10,000 వరకు తగ్గింపు పొందవచ్చు.
ఐఫోన్ 16eపై రెడింగ్టన్ అనేక బ్యాంక్ ఆఫర్లు ప్రకటించింది. ICICI బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, SBI క్రెడిట్ కార్డ్ హోల్డర్లకు రూ.4,000 తక్షణ క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. దీని వలన ఫోన్ ధర రూ.55,900కి తగ్గుతుంది. పాత ఫోన్‌ను ఎక్సేంజ్ చేస్తే రూ. 6,000 వరకు రాయితీ వస్తుంది.
Also Read: హోమ్‌బటన్‌కు బైబై, లైట్నింగ్ పోర్ట్‌కు టాటా- ఐఫోన్‌లో మార్పులు గమనించారా!
పాత ఫోన్‌ను మార్చుకుని బ్యాంక్ ఆఫర్ కూడా తీసుకుంటే iPhone 16eపై పదివేల రూపాయలు తగ్గుతుంది. అంటే రూ.49,900కే iPhone 16eను పొందవచ్చు. ఎక్సేంజ్ ఆఫర్ మీ పాత ఫోన్ మోడల్, పనితీరుపై ఆధారపడి ఉంటుంది. మీరు Cashify వంటి థర్డ్-పార్టీ ప్లాట్‌ఫామ్‌లలో కూడా ఎక్సేంజ్ రేటు ఎంతో తెలుసుకోవచ్చు.
ఐఫోన్ 16e మూడు స్టోరేజ్ వేరియంట్లలో లభిస్తుంది. ఈ ఫోన్ 128GB వేరియంట్ ధర రూ.59,900, 256GB వేరియంట్ ధర రూ.69,900గా, 512GB వేరియంట్ ధర రూ.89,900గా ఉంది. 6.1-అంగుళాల OLED స్క్రీన్‌తో వస్తుందీ ఫోన్. ఐఫోన్ సిగ్నేచర్ ఫేస్ ఐడి నాచ్‌తో వస్తుంది. మ్యూట్ టోగుల్ స్థానంలో కొత్త యాక్షన్ బటన్ కలిగి ఉంది. కంపెనీ ఫోన్‌లోని లైట్నింగ్ పోర్ట్‌ను తీసివేసి USB-C పోర్ట్‌ను ఇచ్చారు.
ఈ ఫోన్‌లో A18 చిప్ ప్రాసెసర్ అమర్చారు. ఇది Genmoji, రైటింగ్ టూల్స్, ChatGPT ఇంటిగ్రేషన్ వంటి Apple ఇంటెలిజెన్స్ ఫీచర్‌లు కలిగి ఉంటుంది. కెమెరా సెటప్ గురించి మాట్లాడుకుంటే, 48MP ఫ్యూజన్ కెమెరాను కలిగి ఉంది. 2x టెలిఫోటో (డిజిటల్) జూమ్ ఫీచర్ ఉంది. అదే సమయంలో సెల్ఫీ, వీడియో కాల్ కోసం 12MP ఫ్రంట్ కెమెరా ఉంది.
భవిష్యత్తులో ఐఫోన్ 16e విజువల్ ఇంటెలిజెన్స్ అప్‌డేట్ రాబోతుందని ఆపిల్ ప్రకటించింది. ఫిబ్రవరి 28న ఉదయం 8 గంటల నుంచి అన్ని స్టోర్లలో ఐఫోన్ 16e అమ్మకం ప్రారంభమవుతుందని రెడింగ్టన్ తెలిపింది.
Also Read: గూగుల్ పే బాదుడు షురూ.. కార్డుల ద్వారా బిల్లులు చెల్లిస్తే ఛార్జి కట్టాల్సిందే