iPhone 16e: హోమ్‌బటన్‌కు బైబై, లైట్నింగ్ పోర్ట్‌కు టాటా- ఐఫోన్‌లో మార్పులు గమనించారా!

iPhone 16e: ఐఫోన్ 16eని విడుదల చేసిన ఆపిల్ చాలా మార్పులు చేసింది. కొన్ని ఫీచర్లు, స్పెసిఫికేషన్‌లు నిలిపివేసింది.

Continues below advertisement

Apple iPhone 16e: ఆపిల్ ఇటీవల ఐఫోన్ 16e ని విడుదల చేసింది. ఫేస్ ఐడి వంటి లక్షణాలతో దీనికి ఆధునిక రూపాన్ని తీసుకొచ్చింది. ఈ ఐఫోన్ విడుదలతో ఆపిల్‌కు చెందిన కొన్ని ఉత్పత్తులు నిలిపివేసింది. కొన్ని ఫీచర్స్‌ను కూడా తీసివేసింది. మార్పుల్లో హోమ్ బటన్, చిన్న సైజు ఐఫోన్‌ లాంటి చాలా విషయాలు ఉన్నాయి.  

Continues below advertisement

ఈ మూడు ఫోన్లు కనిపించవు

సరసమైన ధరకు ఐఫోన్ 16e విడుదల చేసిన తర్వాత ఆపిల్ కంపెనీ మూడు ఐఫోన్ మోడళ్ల అమ్మకాలను నిలిపివేసింది. ఈ జాబితాలో iPhone SE, iPhone 14, iPhone 14 Plus ఉన్నాయి.  

ఇకపై ఏ ప్రోడక్ట్ కూడా ఎరుపు రంగులో రానట్టే

ఆపిల్ REDతో 2006లో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఆఫ్రికాలో టిబి, మలేరియా వంటి వ్యాధుల నియంత్రణకు ప్రచారం చేసి గ్లోబల్ ఫండ్ సేకరించేది. అందుకే ఆపిల్ తన ఉత్పత్తుల్లో కొన్నింటిని ఎరుపు రంగులో అందించేది. ఇప్పుడు మూడు ఐఫోన్ మోడళ్ల అమ్మకాలు నిలిపివేయడంతో కంపెనీ వద్ద ఎరుపు రంగులో ఉత్పత్తులు లేవు. కొత్త ఐఫోన్ కూడా నలుపు, తెలుపు రంగుల్లోనే విడుదల చేసింది. అందుకే ఇకపై ఏ ప్రోడక్ట్ కూడా రెడ్ కలర్‌లో రాదని సమాచారం. 

64GB స్టోరేజ్‌  ఫోన్‌లకు సెలవు 
64GB వేరియంట్ ఐఫోన్ 16e ఇంకా లాంచ్ కాలేదు. అంటే ఇకపై విడుదల కూడా కాకపోవచ్చు. ఇప్పుడు ఆపిల్ కంపెనీ ఐఫోన్‌లు కనీసం 128GB అంతకు మించిన స్టోరేజ్‌తోనే విడుదల చేయబోతోందని అర్థం. ఇది ధరపై కూడా ప్రభావం చూపనుంది. 

సైజులో కూడా మార్పులు 
ఇప్పటి వరకు ఆపిల్ అమ్మకాలు సాగించిన ఐఫోన్‌లలో SE ఒక్కటే చిన్న స్కీన్‌తో వచ్చేది. ఇప్పుడు దాని ఉత్పత్తి కూడా నిలిపివేయడంతో చిన్న స్క్రీన్ ఐఫోన్లు మార్కెట్‌లో కనిపించవు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న కంపెనీ ఉత్పత్తి చేస్తున్న ఉత్పత్తి చేస్తున్న ఐఫోన్‌లలో 6.1 ఇంచ్‌ల డిస్‌ప్లేతో వచ్చేదే చిన్న స్కీన్ కలిగిఉన్న ఫోన్. ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ 6.9 అంగుళాల డిస్‌ప్లే కలిగి ఉంది.  

లైట్నింగ్ పోర్ట్ మాయం 
అన్ని కొత్త ఆపిల్ ఐఫోన్‌లు ఇప్పుడు USB-C పోర్ట్‌తో వస్తున్నాయి. ఐఫోన్ SE 3లో లైట్నింగ్ పోర్ట్ అందుబాటులో ఉంది. ఈ ఫోన్ ఉత్పత్తి నిలిపివేయడంతో లైట్నింగ్ పోర్ట్ మాయమైనట్టే చెప్పాలి. యూరప్‌తో సహా ప్రపంచంలోని చాలా దేశాలు USB-C పోర్ట్ తప్పనిసరి చేశాయి. అందుకే ప్రతి కంపెనీ కూడా ఇదే మోడల్‌తో ఉత్పత్తులు అమ్మకాలు చేస్తున్నాయి. ఇది ఆపిల్‌ను కూడా ప్రభావితం చేసింది.లైట్నింగ్ పోర్ట్‌కు బదులు USB-C పోర్ట్‌తో కొత్త మోడల్ ఫోన్లు వచ్చాయి.  

హోమ్ బటన్‌కు బైబై  
ఐఫోన్ 16e లాంచ్‌తో ఆపిల్ కూడా హోమ్ బటన్‌కు వీడ్కోలు పలికింది. ఇకపై వచ్చే మోడల్స్‌కి కూడా హోమ్ బటన్ ఉండదని తెలుస్తోంది. ఐఫోన్ విడుదలైన తర్వాత ఇప్పటి వరకు హోమ్ బటన్‌తోనే అన్ని మోడల్స్ వచ్చాయి. ఇప్పుడే తొలిసారిగా హోమ్ బటన్ లేకుండా ఫోన్‌ లాంచ్ చేసింది. 18 సంవత్సరాల తర్వాత ఐఫోన్  టచ్ ID ఫీచర్ నిలిపివేసింది.  

Also Read: సమ్మర్ వచ్చేసింది.. ఏసీ కొనాలనుకుంటున్నారా? అయితే ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోండి

Continues below advertisement