Things to Consider When Buying an Air Conditioner : ఈసారి ఎండలతో మామూలుగా ఉండదంటోంది వాతావరణ శాఖ. దానికి తగ్గట్లే ఫిబ్రవరి కూడా ముగియకముందే సూర్యుడు  తన వేడితో మండించేస్తున్నాడు. ఇప్పుడే ఇలా ఉంటే సమ్మర్​లో పరిస్థితి ఊహిస్తేనే భయంకరంగా ఉంటుంది. అందుకే ఎండవేడిని తట్టుకోవడానికి మెజారిటీ జనాలు ఏసీలను ఆశ్రయిస్తారు. ఏసీ లేకపోతే తీసుకోవాలని ప్లాన్ చేస్తూ ఉంటారు. మీరు కూడా అలాంటివారిలో ఒకరా? అయితే మీరు ఏసీ కొనేముందు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. 


పరిగణలోకి తీసుకోవాల్సిన విషయాలివే..


ఏసీ కొనే ముందు కొన్ని విషయాలు కచ్చితంగా పరిగణలోకి తీసుకోవాలి. గది పరిమాణం, ఇన్సులేషన్, కూలింగ్ కెపాసిటీ ఎంత ఉండాలో నిర్ణయించుకుని క్లారిటీ తెచ్చుకోవాలి. బెడ్​రూమ్ లేదా హాల్ వంటి వాటిని దృష్టిలో ఉంచుకుంటే మంచిది. అలాగే మీరు ఏసీని ఎంత బడ్జెట్​లో తీసుకోవాలనుకుంటున్నారో కూడా ఫిక్స్ అవ్వాలి. అలాగే లోన్​లో తీసుకుంటే.. డౌన్ పేమెంట్ ఎంత చేయాలి? ఒకేసారి కట్టేస్తే ఎంత డబ్బు దగ్గర ఉండాలో దానిని సిద్ధం చేసుకోండి.


ఎయిర్ కండీషనర్​ తీసుకోవడమే కాదు.. దాని ఇన్​స్టాలేషన్, షో రూమ్​ నుంచి మీకు కావాల్సిన ప్రదేశానికి తీసుకురావడం వంటివాటికి అయ్యే ఖర్చును కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఏసీల శక్తి సామర్థ్యాన్ని చెక్ చేసుకోవాలి. అధిక శక్తి సామర్థ్య నిష్పత్తులు (EER), సీజనల్ ఎనర్జీ ఎఫిషియెన్సీ రేషియోస్ (SEER) ఉన్న ఏసీలు ఎంచుకుంటే మంచిది. 


ఎలాంటి ఏసీలు బెటర్​ అంటే.. 


మీరు ఎంచుకునే రూమ్​లను బట్టి ఎయిర్ కండీషనల్ రకాలు ఉంటాయి. ఒక్కో ప్రదేశానికి ఇవి మారుతూ ఉంటాయి. కాబట్టి.. ఏ గదికి ఎలాంటి ఏసీని ఎంచుకోవాలో ఇప్పుడు చూసేద్దాం.


విండో యూనిట్ (Window Unit) : చిన్న గదులకు విండో యూనిట్ ఏసీలు అనుకూలమైనవి. పైగా వీటిని ఇన్​స్టాల్ చేయడం కూడా సులభమే. పైగా ధరలు కూడా అందుబాటులో ఉంటాయి. 


స్ప్లిట్ సిస్టమ్ (Split System) : మీ ఇంట్లో పెద్ద గదులు ఉంటే.. స్ప్లిట్ సిస్టమ్ బెటర్ ఆప్షన్ అవుతుంది. వీటి ఫ్లెక్సీబులిటీ.. మీకు మంచి ఎక్స్​పీరియన్స్ ఇస్తుంది. 


పోర్టబుల్ యూనిట్ (Portable Unit): చిన్న ప్రదేశాలకు పోర్టబుల్ యూనిట్ చాలా బెస్ట్. వీటిని మూవ్ చేయడం సులభమే. ఇన్​స్టాలేషన్ ఇబ్బంది కూడా ఉండదు. 


సెంట్రల్ ఏసీ (Central Air Conditioning) : ఇంటి మొత్తానికి ఏసీ ఉండాలనుకుంటే.. సెంట్రల్ ఎయిర్ కండిషనింగ్ ప్లాన్ చేసుకోవచ్చు. ఇది చాలా ఎఫెక్టివ్​గా ఉంటుంది. 


ఏసీ ఫీచర్లు ఇలా ఉండాలి.. 


ఏసీని కొనే ముందు కొన్ని ఫీచర్లను పరిగణలోకి తీసుకోవాలి. మీరు ఏ ఏసి అయితే కొంటున్నారో దాని గురించిన పూర్తి సమాచారంతో పాటు ఈ ఫీచర్ల గురించి అడిగి తెలుసుకోవాలి. 


కూలింగ్ స్పీడ్ : మల్టిపుల్ ఫ్యాన్ స్పీడ్, త్వరగా కూలింగ్​ని ఇస్తాయో లేదో తెలుసుకోండి. 


ఎయిర్ ప్యూరిఫికేషన్ : ఏసీ ఉపయోగించేప్పుడు డోర్స్ అన్ని క్లోజ్ చేసేస్తాము కాబట్టి.. ఎయిర్ ప్యూరిఫైయర్​లతో వచ్చిందో లేదో తెలుసుకోండి. కొన్ని ఏసీలు ఇంటర్నల్ ఎయిర్ ప్యూరిఫైయర్​తో వస్తాయి. ఇవి ఇండోర్ ఎయిర్ క్వాలిటీని మెరుగుపరుస్తాయి. 


స్మార్ట్ టెక్నాలజీ : స్మార్ట్ టెక్నాలజీతో వచ్చే ఏసీలు వినియోగించుకునేందుకు మరింత అనువుగా ఉంటాయి. కాబట్టి Wi-Fi కనెక్టివిటీ, స్మార్ట్ ఫోన్ యాప్​ ద్వారా కంట్రోల్ చేయడం, వాయిస్ అసిస్టెంట్ ఇంటిగ్రేషన్​తో వచ్చే ఏసీలను మీరు కన్సిడర్ చేయొచ్చు. 


సౌండ్ లేకుండా : బెడ్​రూమ్​లో ఏసీని ఉపయోగించాలనుకుంటే.. తక్కువ శబ్ధం వచ్చే ఏసీలను ఎంచుకుంటే మంచిది. ఇవి నిద్రకు ఇబ్బందిని కలిగించవు. 


దృష్టిలో ఉంచుకోవాల్సిన మరిన్ని అంశాలివే.. 


ఏసీ తీసుకునేప్పుడు దానికి వారెంటీ ఇస్తున్నారో లేదో.. ఇస్తే ఎంత కాలం వారెంటీ ఉందే చెక్ చేసుకోవాలి. మెయింటినెన్స్ అవసరాలు, ఏసీ పరికరాలు రిప్లేస్​మెంట్​కి అయ్యే ఖర్చును గురించి ముందుగానే చెక్ చేసుకోవాలి. ఏసీ కొనేప్పుడు ఇన్​స్టాలేషన్ ఫ్రీగా ఇస్తారో లేదో తెలుసుకోండి. లేదంటే మీరు ప్రొఫెషనల్ వ్యక్తిని ఇన్​స్టాలేషన్​ని ఎంచుకోండి. ఈ అంశాలను పరిగణలోకి తీసుకుని మీ బడ్జెట్లో వచ్చే ఏసీ ఎంచుకోవచ్చు. అలాగే మార్కెట్​లో ప్రస్తుతం ఏ బ్రాండ్ ఏసీలు బాగున్నాయో రీసెర్చ్ చేసి.. రివ్యూలు, రేటింగ్​ల ఆధారంగా కూడా ఏసీని కొనగోలు చేయొచ్చు. 



Also Read : డబ్బులు, లక్ కలిసి రావాలంటే ఇంట్లో ఈ పెయింటింగ్స్ పెట్టుకోవాలి.. బుద్ధుడి బొమ్మని అక్కడ పెడితే మంచిదట