Vastu Paintings : ఇంటికి మంచి లుక్‌ని ఇచ్చేందుకు, ఆర్ట్స్ అంటే ఇష్టమున్నావారు ఇంట్లో పెయింటింగ్స్ పెట్టుకుంటారు. మరికొందరు వాస్తును ఫాలో అవుతూ కొన్ని వస్తువులను ఇంట్లో డెకరేట్ చేస్తారు. అయితే మంచి లుక్‌ని ఇవ్వడంతో పాటు.. వాస్తుపరంగా కూడా మేలు చేసే కొన్ని పెయింటింగ్స్ ఇక్కడున్నాయి. వాటిని ఇంట్లో ఏ వైపు పెడితే ఏయే రంగాల్లో అభివృద్ధి ఉంటుందో.. ఎలాంటి పెయింట్స్ వల్ల పాజిటివిటీ పెరుగుతుందో ఇప్పుడు చూసేద్దాం.
వాస్తు శాస్త్రం, జ్యోతిష్యం, ఆధ్యాత్మికతతో కూడిన పురాతన భారతీయ తత్వశాస్త్రం ప్రకారం కొన్ని పెయింటింగ్‌లు జీవితాలను ప్రభావితం చేస్తాయి అంటారు. దానికి అనుగుణంగానే చాలామంది ఇళ్లల్లో ఏడు గుర్రాలు, వాటర్ ఫాల్స్, నెమలి, తామర పువ్వు వంటి పెయింటింగ్స్ వేయించుకుంటారు. ఇంతకీ ఈ పెయింటింగ్స్ పెట్టుకుంటే కలిగే లాభాలు ఏంటో.. ఏ వైపు పెడితో లక్ కలిసి వస్తుందో తెలుసుకుందాం.
ఏడుగుర్రాలు (Seven Running Horses)
ఇంట్లో ఏడు గుర్రాలు పరుగెడుతున్న పెయింటింగ్ పెట్టుకుంటే చాలా మంచిదట. ఇది కెరీర్లో ముందుకు వెళ్లడాన్ని, సక్సెస్‌ని సూచిస్తుందట. దీనిని ఇంట్లో దక్షిణాన ప్లేస్ చేస్తే మంచిది. ఏనుగులు కూడా బలం, స్థిరత్వాన్ని సూచిస్తాయి.
తామర పువ్వు (Lotus)
తామర పువ్వు స్వచ్ఛత, శ్రేయస్సును సూచిస్తుంది. దీనిని ఇంట్లో ఈశాన్యంలో పెడితే మంచి ఫలితాలు ఉంటాయట. కేవలం తామర మాత్రమే కాదు.. గులాబీలు, ఇతర పువ్వులు కూడా శ్రేయస్సును అందించి ఎమోషనల్‌గా బ్యాలెన్స్‌గా ఉండేలా చేస్తాయి.
పర్వతాలు (Mountains)
పర్వతాలు కలిగిన ఫోటోను ఇంట్లో నైరుతి దిశగా పెడితే మంచిది. ఇది స్థిరత్వాన్ని, మద్ధతును సూచిస్తుంది. ఇవి ప్రశాంతతను కూడా ఇస్తాయి.
వాటర్‌ఫాల్స్ (Waterfalls)
డబ్బులు, ఆర్థిక శ్రేయస్సు కోసం వాటర్‌ఫాల్స్ పెయింటింగ్‌ను ఇంట్లో పెట్టుకోవచ్చు. ఈశాన్యంలో ఈ పెయింటింగ్ పెడితే అభివృద్ధి బాగుంటుంది. సానుకూలతను అందించి స్ట్రెస్‌ని తగ్గిస్తాయి.
నెమలి (Peacock)
డబ్బుతో పాటు లక్ కలిసి రావాలంటే ఇంట్లో దక్షిణ దిశగా నెమలి పెయింటింగ్స్ పెడితే మంచిదట. చిలుకలు కూడా అదృష్టం, శ్రేయస్సును అందిస్తాయి.
బుద్దుడు (Buddha)
బుద్దుడు బొమ్మలు, పెయింటింగ్స్‌ని చాలామంది ఇంట్లో పెట్టుకుంటారు. చాలామంది గిఫ్ట్‌గా కూడా ఇస్తూ ఉంటారు. ఇంట్లో ప్రశాంతంత కావాలి, ఒత్తిడి లేకుండా ఉండాలనుకునేవారు బుద్ధుడు పెయింటింగ్‌ని ఇంట్లో పెట్టుకోవచ్చు. ఈశాన్యంలో పెడితే మంచి ఫలితాలుంటాయి.
ఈ రంగులు బెస్ట్
పెయింటింగ్స్‌లో కొన్ని రంగులు కచ్చితంగా ఉండేలా చూసుకోవాలి. సూర్యునితో అనుసంధానమైన పసుపును మంగళకరమైన రంగుగా చెప్తారు. ఇది సానుకూలతను ఇస్తుంది. ఆకుపచ్చ రంగు పెరుగుదలను సూచిస్తుంది. అంతేకాకుండా సామరస్యం, సమతుల్యను, శ్రేయస్సును ప్రోత్సాహిస్తాయి. ఆరెంజ్‌ను శక్తివంతమైన రంగుగా చెప్తారు. ఇవి సృజనాత్మకత, ఆనందాన్ని ప్రేరేపిస్తాయట.
ఈ తరహా పెయింటింగ్స్‌ని ఎక్కువగా ఇంట్లో పెట్టుకుంటారు. కాబట్టి మీరు ఇంట్లో పెట్టుకోవాలన్నా.. ఎవరికైనా మంచిని కోరుతూ గిఫ్ట్ చేయాలన్నా ఈ పెయింటింగ్స్‌ని గిఫ్ట్ చేయవచ్చు. ఇంట్లో ఇవే పెట్టుకోవాలని రూల్ ఏమి లేదు. కానీ పెట్టుకుంటే పాజిటివ్ ఫలితాలు వస్తాయని చెప్తుంది వాస్తు శాస్త్రం.
Also Read : 30 రోజులు డీటాక్స్ డైట్ చేస్తే బరువు తగ్గుతారట, మరెన్నో ప్రయోజనాలు.. తీసుకోవాల్సిన ఫుడ్స్ ఇవే