Detox Diet for Weight Loss : డీటాక్స్ అనేది ఈ మధ్యకాలంలో బాగా పాపులర్​ అవుతుంది. శరీరాన్ని డీటాక్స్ చేయడం వల్ల అందానికి, ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు అందుతాయి. అందుకే దీనిని చాలామంది రెగ్యులర్​గా ఫాలో అవుతున్నారు. శరీరంలోని టాక్సిన్లను వదిలించుకోవడానికి డిటాక్స్ డైట్​ని ఫాలో అవుతున్నారు. అసలు డీటాక్స్ డైట్ అంటే ఏమిటి? కలిగే లాభాలు.. తినాల్సిన ఫుడ్స్, తీసుకోకూడానివి ఏంటో చూసేద్దాం. బరువును తగ్గించే ఈ డైట్​ఫాలో అవ్వడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయో లేదో తెలుసుకుందాం. 


గట్ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకుంటూ.. బరువు తగ్గాలనుకుంటే కచ్చితంగా డిటాక్స్ డైట్ మంచి ఆప్షన్. దీనివల్ల ఎనర్జీ పెరుగుతుంది. మానసికంగా కూడా ఇది ప్రయోజనాలు చేకూరుస్తుందని చెప్తారు. అంతేకాకుండా శరీరానికి పోషకాలను అందించడంలో హెల్ప్ చేస్తుంది. మరి ఈ డైట్​ వల్ల కలిగే లాభాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. 


డీటాక్స్ డైట్​ వల్ల కలిగే లాభాలివే


బరువు : డీటాక్స్ డైట్​ వల్ల ప్రధానంగా బరువు తగ్గుతారు. ఎందుకంటే దీనిలో కేలరీలను కంట్రోల్​గా తీసుకుంటారు. ఇది బరువు తగ్గడంతో పాటు.. మెటబాలీజంను పెంచి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. 


మధుమేహం : డీటాక్స్ డైట్​లో షుగర్స్​ని కట్ చేస్తారు. దీనివల్ల రక్తంలోని షుగర్, ఇన్సులిన్ లెవెల్స్ కంట్రోల్​లో ఉంటాయి. మధుమేహాన్ని కంట్రోల్ చేయడంలో ఇది మంచి బెనిఫిట్స్ ఇస్తుంది. 


ఎనర్జీ : బాడీని యాక్టివ్​గా చేసి.. శరీరంలోని కొవ్వును కరిగించి శక్తిని అందిస్తుంది. తీసుకున్న పోషకాలను శరీరానికి అందించి ఎనర్జీని ఇస్తుంది. ఫోకస్​ని పెంచి.. మెంటల్​ హెల్త్​ని ఇంప్రూవ్ చేస్తుంది.


జీర్ణ సమస్యలు : గట్ హెల్త్​కి డీటాక్స్ డైట్ చాలా మంచిది. కడుపు ఉబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలను దూరం చేసి.. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. 


డీటాక్స్ డైట్​లో రకాలు


డీటాక్స్​ డైట్​లో భాగంగా కొన్ని రకాల ఫుడ్స్​ని డైట్​లో తీసుకోవాల్సి ఉంటుంది. ఇవి శరీరంలోని టాక్సిన్లను బయటకు పంపి హెల్తీగా ఉంచడంలో హెల్ప్ చేస్తాయి. మరి డీటాక్స్ డైట్​లో ప్రధానంగా తీసుకోవాల్సిన ఫుడ్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. డీటాక్స్ డైట్స్ ప్రధానంగా మూడు రకాలు. జ్యూస్ క్లెన్స్, ఉడికించిన ఫుడ్స్, డైట్​ నుంచి కొన్ని ఫుడ్స్ తీసేయండి. 


జ్యూస్ క్లెన్స్(Juice Cleanse)​లో భాగంగా.. పండ్లు, కూరగాయలతో చేసిన జ్యూస్​లను తీసుకుంటూ ఉంటారు. Raw Food Diet ఫాలో అయ్యేవారు ఉడికించని, ప్రాసెస్ చేయని ఫుడ్స్ తీసుకుంటారు. అన్​ప్రాసెస్ ఫుడ్స్, పండ్లు, కూరగాయలు, నట్స్ తీసుకుంటారు. Elimination Diet ఫాలో అయ్యేవారు కొన్ని ఫుడ్స్​ని పూర్తిగా తినడం మానేస్తారు. గ్లూటెన్, డెయిరీ వంటి ఫుడ్స్​ లేకుండా వారి డైట్​ ఉంటుంది. 


డీటాక్స్ డైట్​లో తినాల్సిన ఫుడ్స్ ఇవే 


పాలకూర, కాలె వంటి ఆకుకూరల్లో యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. బ్లూ బెర్రీలు, స్ట్రాబెర్రీలు, రాస్ప్రెబెర్రీలలో కూడా యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్ ఉంటాయి. బాదం, వాల్​నట్స్, చియా సీడ్స్​లో హెల్తీ ఫ్యాట్, ఫైబర్ ఉంటుంది. సాల్మన్, ట్యూనా వంటి ఓమెగా ఫ్యాటీ 3 ఫుడ్స్ మంచివి. చిలగడ దుంపల్లో విటమిన్ ఏ, ఫైబర్ నిండి ఉంటుంది. వీటన్నింటినీ డీటాక్స్​ డైట్​లో భాగంగా తీసుకోవచ్చు. 


డీటాక్స్ డైట్​లో తినకూడని ఫుడ్స్ ఏంటంటే.. 


షుగర్, సాల్ట్, కొవ్వుతో నిండి ఉండే ప్రాసెస్ చేసిన ఫుడ్స్ తినకూడదు. సోడాలు, స్పోర్ట్స్ డ్రింక్స్, ఎనర్జీ డ్రింక్స్ వంటి షుగర్ డ్రింక్స్ తాగకూడదు. వైట్ బ్రెడ్, పాస్తా, షుగర్ స్నాక్స్​లలో రిఫైన్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. వాటి జోలికి వెళ్లకూడదు. డీప్ ఫ్రై చేసిన ఫుడ్స్ తినకపోవడమే మంచిది. రెడ్ మీట్, ఫ్యాట్ ఎక్కువగా ఉండే డెయిరీ ప్రొడెక్ట్స్ తీసుకోకపోవడమే మంచిది. 


తీసుకోవాల్సిన జాగ్రత్తలు


డీటాక్స్ డైట్​ వల్ల శరీరానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అయితే కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకుంటే మంచి ఫలితాలుంటాయి. డీటాక్స్ డైట్​ వల్ల శరీరానికి కావాల్సిన కొన్ని పోషకాలు అందకపోవచ్చు. కాబట్టి వాటిని సప్లిమెంట్స్ రూపంలో తీసుకోవాలి. లేదా బ్యాలెన్స్ ఫుడ్ తినొచ్చు. డీహైడ్రేషన్ సమస్యలు వచ్చే అవకాశముంది కాబట్టి నీటిని ఎక్కువగా తీసుకోవాలి. ముఖ్యంగా ఈ డైట్ ఫాలో అయ్యేముందు కచ్చితంగా వైద్యుల సలహా తీసుకోవాలి. 



Also Read : వేగంగా నడిస్తే బరువు తగ్గుతారా లేదా వెనక్కి నడిస్తే చేస్తే మంచిదా? నిపుణులు ఇచ్చే సలహాలు ఇవే