Seethe Ramudi Katnam Serial Today Episode సీత విద్యాదేవితో ప్లంబర్‌ సూట్‌ కేస్‌తో వెళ్లాడని సాంబ అనుమానం వచ్చి పట్టుకుంటే మహాలక్ష్మీ, అర్చన అత్తయ్యలు తిట్టి వాడిని పంపేశారని చెప్తుంది. దాంతో విద్యాదేవి ప్లంబర్‌కి డబ్బులు ఇవ్వడానికి నీ కిడ్నాప్‌కి ఏదో సంబంధం ఉన్నట్లుందని మనమే ఈ విషయాన్ని తేల్చుదామని ఇద్దరూ అనుకుంటారు. 

సీత గదిలో బెడ్ సర్దుతుంటే రామ్ వచ్చి సీతని కళ్లు మూసుకోమని చెప్పి నుదిటిపై ముద్దు పెట్టి తర్వాత కుంకుమ పెడతాడు. నీ కోసమే గుడికి వెళ్లానని రామ్ చెప్పడంతో సీత ఆశ్చర్యపోతుంది. ప్రేమతో రామ్‌ని హగ్ చేసుకుంటుంది. 

మహాలక్ష్మీ: నా గురించి సీత తెలుసుకోకముందే మెకానిక్‌కి పట్టుకొని సీతకి చెక్ పెట్టాలి. డాక్టర్ కాల్ చేయడంతో మహాలక్ష్మీ చాలా టెన్షన్ పడుతుంది. డాక్టర్: మహా..మహాలక్ష్మీ: హలో ఎందుకు కాల్ చేశావే అప్పుడు కూడా సడెన్‌గా ఇంటికి వచ్చి అలాగే టెన్షన్ పెట్టావా.డాక్టర్: ఇక్కడ నాకు బీపీ పెరిగిపోతుంది మహా. నీ సొంత కొడుకు గురించి చెప్పాలి. మహాలక్ష్మీ: ఇప్పుడు నా కన్న కొడుకు గురించి ఎందుకు చెప్తున్నావ్.డాక్టర్: చెప్పాల్సిన అవసరం వచ్చింది. నా నరాలు తెగిపోయేలా ఉన్నాయ్ మహా త్వరగా రా.మహాలక్ష్మీ: ఒకే వస్తున్నా. అని ఫాస్ట్‌గా వెళ్లి కంగారులో సీతని ఢీ కొట్టేస్తుంది. సీత: ఇంత అర్జెంట్‌గా అత్తయ్య ఎక్కడికి వెళ్తుంది. ఏదో కంగారులో ఉంది అది ఏంటో కనిపెట్టాలి.మహాలక్ష్మీ: సాంబ గేట్ ఓపెన్ చేయ్.సీత:  సాంబ స్కూటీలో మహాలక్ష్మీని ఫాలో అవుతుంది. మహాలక్ష్మీ అత్తయ్య ఏదో చేస్తుంది అది కనిపెట్టాలని అనుకుంటుంది.మహాలక్ష్మీ: డాక్టర్‌కి ఏమైందని అడుగుతుంది.డాక్టర్: నీ కొడుకుని భరించడం నా వల్ల కాదు. నీ డబ్బు పిచ్చి కారణంగా నీ భర్త నిన్ను నీ ఐదేళ్ల కొడుకు గౌతమ్‌ని వదిలేసి వెళ్లిపోయాడు. నీ గతం దాచేసి సుమతి దగ్గర ఆశ్రయం పొంది సుమతి లైఫ్ తీసుకున్నావ్.. అప్పటి నుంచి నీ కొడుకును నేనే చూసుకుంటున్నా.. ఇక నా వల్ల కాదు మహా నీ డబ్బు వద్దు నీ కొడుకు వద్దు వాడి ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. రౌడీలా తయారయ్యాడు. మందు  సిగరెట్‌కి బానిస అయిపోయాడు. ఈ మధ్య ఒకడి తల పగలగొట్టాడు. ఇప్పుడు జైలులో ఉన్నాడు. ఇంక నా వల్ల కాదు. రెండు రోజుల్లో రిలీజ్ అవుతున్నాడు. ఇక నీ కొడుకుని నువ్వే తీసుకెళ్లిపో ఇక నా ఇంట్లో వద్దు.మహాలక్ష్మీ: ఇప్పుడప్పుడే వాడికి నేను కన్న తల్లి అని తెలీకూడదు మ్యానేజ్ చేయ్. నీకు ఎంత డబ్బు కావాలి అన్నా ఇస్తాను. ఇప్పుడే డబ్బు వేశాను చూడు.డాక్టర్: నువ్వు నన్ను డబ్బుతో మ్యానేజ్ చేస్తున్నావ్ కానీ నేను వాడిని మ్యానేజ్ చేయలేను. వాడు జైలు నుంచి వస్తే నీ బ్యాడ్ టైం మొదలైనట్లే. 

సీత మహాలక్ష్మీని డాక్టర్‌తో చూస్తుంది. మహాలక్ష్మీ షాక్ అయి నువ్వు ఇక్కడ ఏం  చేస్తున్నావ్ అంటుంది. ఈ డాక్టర్ మన ఇంటికి వచ్చారు కదా అంటుంది. మీ మధ్య ఏముందో త్వరలోనే కనిపెడతానంటూ సీత వెళ్లిపోతుంది. మహాలక్ష్మీ ఇంటికి వెళ్తుంది. ఇంతలో ఓ జంట తమ బిడ్డని తీసుకొని ఇంటికి వచ్చి సీతని పిలుస్తారు.  అక్కడే ఉన్న మహాలక్ష్మీ వాళ్లని ఎవరు అని అంటుంది. దాంతో వాళ్లు పాపకి సీత సుమతి అని పేరు పెట్టిందని చెప్తారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: సత్యభామ సీరియల్: ఇంకా లేదేంటా అనుకుంటే వచ్చేసిందిగా సంధ్యకి సవతి.. అమ్మాయిలంతా ఇలాంటి వెదవలకే పడతారేంట్రా!