iPhone 15 Series Launch Time: యాపిల్ ఐఫోన్ 15 సిరీస్‌ సెప్టెంబర్‌లో లాంచ్ కానుంది. ఈ సిరీస్‌లో ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్, ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మాక్స్‌లు మార్కెట్లో ఎంట్రీ ఇవ్వనున్నాయి. మీరు యాపిల్ కొత్త స్మార్ట్ ఫోన్లను కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తుంటే మీకు ఒక బ్యాడ్‌న్యూస్. ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ కంటే ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ ధర చాలా ఎక్కువగా ఉండనుందని మార్కెట్లో టాక్ నడుస్తుంది. అంటే మీ జేబుకి పడే చిల్లు సైజు భారీగా పెరగనుందన్న మాట.


యాపిల్ విశ్లేషకుడు జెఫ్ పు తెలుపుతున్న దాని ప్రకారం ఐఫోన్ 15 ప్రో, ప్రో మాక్స్ వేరియంట్‌లు 14 సిరీస్ కంటే ఎక్కువ ధరతో రానున్నాయి. దీని ధర 1,099 డాలర్ల కంటే ఎక్కువగా ఉండనుందని సమాచారం. ఐఫోన్ 15 ప్రో సిరీస్‌లో పెద్ద బ్యాటరీ, డిస్‌ప్లేలు మాత్రమే కాకుండా పెరిస్కోప్ లెన్స్ కూడా అందించనున్నారు.


ఈ రెండు ప్రో మోడల్స్‌లోనూ వెనుకవైపు ట్రిపుల్ కెమెరా సెటప్‌ను అందించనున్నారు. ఐఫోన్ 15 ప్రోలో టెలిఫోటో లెన్స్, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్‌లో 6x వరకు ఆప్టికల్ జూమ్‌తో పెరిస్కోప్ లెన్స్‌ ఉండనున్నాయని జెఫ్ పు పేర్కొన్నారు. 3x జూమ్ సపోర్ట్ మాత్రమే లభించే 14 ప్రో మోడల్స్‌తో కంపేర్ చేస్తే ఇది చాలా పెద్ద అప్‌డేట్ అవుతుంది. 


91 మొబైల్స్ నివేదిక ప్రకారం యాపిల్ ఐఫోన్ 15 సిరీస్‌లో 18 శాతం ఎక్కువ సామర్థ్యమున్న బ్యాటరీని అందించనున్నారు. ఐఫోన్ 15 బ్యాటరీ ఐఫోన్ 14 కంటే 18 శాతం ఎక్కువగా ఉంటుందని సమాచారం. ఐఫోన్ 15 సిరీస్‌లో యూఎస్‌బీ టైప్-సీ ఛార్జర్, డైనమిక్ ఐలాండ్ సపోర్ట్ పొందుతారు.






















Read Also: ట్విట్టర్ చరిత్రలోనే అత్యధిక వ్యూస్ పొందిన మస్క్ ట్వీట్ - ఎంత రీచ్ వచ్చింది?


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి. 
Join Us on Telegram: https://t.me/abpdesamofficial