Nothing Phone 2: రెండు 50 మెగాపిక్సెల్ కెమెరాలతో రానున్న నథింగ్ ఫోన్ 2? - ధర కూడా లీక్!

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ నథింగ్ తన కొత్త స్మార్ట్ ఫోన్ నథింగ్ ఫోన్ 2ను త్వరలో లాంచ్ చేయనుంది. దీని ధర, కెమెరా ఫీచర్లు ఆన్‌లైన్‌లో లీకయ్యాయి.

Continues below advertisement

Nothing Phone 2 price: ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ ప్రియులందరూ నథింగ్ ఫోన్ 2 కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ స్మార్ట్‌ఫోన్ జూలై 11వ తేదీన రాత్రి 8:30 గంటలకు భారతదేశంలో లాంచ్ కానుంది. లాంచ్ ఈవెంట్‌ను చూడటానికి మీరు కంపెనీ యూట్యూబ్ ఛానెల్‌ను సందర్శించాల్సి ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్‌కు సంబంధించి అనేక వివరాలు లీక్ అయ్యాయి. 

Continues below advertisement

టిప్‌స్టర్ అభిషేక్ యాదవ్ తెలుపుతున్న దాని ప్రకారం, నథింగ్ ఫోన్ 2లో డ్యూయల్ కెమెరా సెటప్ అందించనున్నారు. ఇందులో 50 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్890 కెమెరా, 50 మెగాపిక్సెల్ శాంసంగ్ జేఎన్1 అల్ట్రావైడ్ సెన్సార్ అందుబాటులో ఉండనున్నాయి. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం ముందు భాగంలో 32 మెగాపిక్సెల్ సెన్సార్ అందించనున్నారు.

దీని డిస్‌ప్లే వివరాలు కూడా ఆన్‌లైన్‌లో లీకయ్యాయి. మీరు ఫోన్‌లో ఫుల్ హెచ్‌డీ+ అమోఎల్ఈడీ డిస్‌ప్లేను పొందవచ్చు. ఇది 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌ను సపోర్ట్ చేయనుంది. దీని బ్యాటరీ సామర్థ్యం 4700 ఎంఏహెచ్‌గా ఉండనుంది.

స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 1 ప్రాసెసర్, ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌లను నథింగ్ ఫోన్ 2లో పొందవచ్చు. ధర గురించి చెప్పాలంటే ఈ ఫోన్ ధర రూ. 40 వేల నుంచి 42 వేల మధ్య ఉండవచ్చు. మీరు ఇప్పుడు స్మార్ట్‌ఫోన్‌ను ప్రీ ఆర్డర్ చేస్తే కంపెనీ మీకు అనేక ఆఫర్‌లను కూడా అందిస్తోంది.

Read Also: ట్విట్టర్ చరిత్రలోనే అత్యధిక వ్యూస్ పొందిన మస్క్ ట్వీట్ - ఎంత రీచ్ వచ్చింది?

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

Continues below advertisement