Apple iPhone 15 Pro Max Discount: యాపిల్ తన లేటెస్ట్ ఐఫోన్ 16 సిరీస్‌ను సెప్టెంబర్‌లో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ ఫోన్ లాంచ్ అయినప్పటి నుంచి కంపెనీ పాత మోడల్స్ ధరలు బాగా తగ్గుముఖం పట్టాయి. ఇప్పుడు ఐఫోన్ 15 ప్రో మాక్స్ ధరలు మరింత భారీగా తగ్గాయి. ప్రస్తుతం మీరు ఈ ఫోన్‌ను చాలా తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు.


డిస్కౌంట్ ఆఫర్లు ఇవే...
ఈ-కామర్స్ సైట్ అమెజాన్‌లో ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్‌పై 25 శాతం తగ్గింపు అందించారు. ప్రస్తుతం ఈ ఫోన్ ధర రూ.1,15,900గా ఉంది. ఇది మాత్రమే కాకుండా ఎస్‌బీఐ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే రూ.500 తగ్గింపు లభిస్తుంది. అదే సమయంలో దీనిపై రూ. 25,700 వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా ఇస్తున్నారు. అయితే ఈ ఆఫర్ మీ పాత డివైస్ కండీషన్, దాని బ్రాండ్‌పై ఆధారపడి ఉంటుంది.


ఐఫోన్ 15 ప్రో సిరీస్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
ఐఫోన్ 15 ప్రో సిరీస్‌లో రెండు ఫోన్లు ఉన్నాయి. అవే ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్. ఐఫోన్ 15 ప్రోలో 6.1 అంగుళాలు, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్‌లో 6.7 అంగుళాల సూపర్ రెటీనా ఎక్స్‌డీఆర్ ఓఎల్ఈడీ డిస్‌ప్లేను యాపిల్ అందించింది. ఈ స్మార్ట్ ఫోన్ల పీక్ బ్రైట్‌నెస్ ఏకంగా 2000 నిట్స్‌గా ఉండటం విశేషం. అడిషనల్ ప్రొటెక్షన్ కోసం సెరామిక్ షీల్డ్ మెటీరియల్ కూడా వీటిలో అందించడం విశేషం. యాపిల్ అప్పట్లో లాంచ్ చేసిన 3ఎన్ఎం ఏ17 బయోనిక్ ప్రాసెసర్‌పైనే ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ సిరీస్ ఫోన్లు పని చేయనున్నాయి. ఐపీ68 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ ఫీచర్లు కూడా వీటిలో ఉన్నాయి. వీటి ద్వారా ఈ ఫోన్ల సాయంతో అండర్ వాటర్ ఫొటోగ్రఫీ కూడా చేయవచ్చు.


ఐఫోన్ 15 ప్రో సిరీస్‌ను యాపిల్ గ్రేడ్ 5 టైటానియం, అల్యూమినియం సబ్ స్ట్రక్చర్‌తో రూపొందించింది. దీని ద్వారా ఈ స్మార్ట్ ఫోన్ సిరీస్ మరింత బలంగా మారింది. అలాగే ప్రీవియస్ సిరీస్‌తో పోలిస్తే బరువు మరింత తక్కువగా ఉంది. మ్యూట్ బటన్ స్థానంలో కొత్త యాక్షన్ బటన్‌ను ఈ స్మార్ట్ ఫోన్లలో అందించారు. ఇది ఎన్నో రకాలుగా ఉపయోగపడనుంది.


Also Read: రూ.15 వేలలోపు బెస్ట్ 5జీ స్మార్ట్ ఫోన్లు ఇవే - లిస్ట్‌లో 108 మెగాపిక్సెల్ ఫోన్లు కూడా!


ఐఫోన్ 15 ప్రోలో వెనకవైపు 48 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అందించారు. లెన్స్ మీద పడే గ్లేర్‌ను తగ్గించడానికి ప్రత్యేకమైన కోటింగ్ కూడా ఈ స్మార్ట్ ఫోన్‌లో ఉంది. 48 మెగాపిక్సెల్ ప్రధాన సెన్సార్‌తో పాటు 12 మెగాపిక్సెల్ 3x టెలిఫొటో కెమెరా, 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా కూడా వెనకవైపు సెన్సార్లలో అందుబాటులో ఉన్నాయి.  ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్‌లో కూడా దాదాపుగా ఇదే కెమెరా సెటప్ అందించారు. కానీ టెలిఫొటో కెమెరా బదులు 12 మెగాపిక్సెల్ పెరిస్కోప్ కెమెరాను ఇందులో చూడవచ్చు. ఇది ఏకంగా 5x ఆప్టికల్ జూమ్‌ను అందించనుండటం విశేషం. ఈ రెండు ఫోన్లలోనూ సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 12 మెగాపిక్సెల్ ట్రూడెప్త్ కెమెరా అందుబాటులో ఉంది.


ఛార్జింగ్, కనెక్టివిటీ కోసం యూఎస్‌బీ టైప్-సీ పోర్టులను ఈ స్మార్ట్ ఫోన్ సిరీస్‌లో అందించారు. యూఎస్‌బీ 3.0 స్పీడ్‌ను ఐఫోన్ 15 ప్రో సిరీస్ సపోర్ట్ చేయనుంది. ఐఫోన్ 15 ప్రో ఒక రోజు పూర్తిగా, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ అంత కంటే కొంచెం ఎక్కువగా బ్యాటరీని అందించనుందని యాపిల్ అధికారికంగా ప్రకటించింది.



Also Read: ఫోన్‌లో ఈ పాస్‌వర్డ్ పొరపాటున కూడా పెట్టుకోకండి - హ్యాక్ చేయడానికి సెకన్లు చాలు!