Tecno POP 9 4G Launched: టెక్నో పాప్ 9 4జీ స్మార్ట్ ఫోన్ మనదేశంలో శుక్రవారం లాంచ్ అయింది. మీడియాటెక్ హీలియో జీ50 ప్రాసెసర్‌పై ఇది రన్ కానుంది. 6 జీబీ వరకు డైనమిక్ ర్యామ్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో ఈ ఫోన్ మార్కెట్లోకి వచ్చింది. ఈ ఫోన్ వెనకవైపు 13 మెగాపిక్సెల్ సెన్సార్‌ను ప్రధాన కెమెరాగా అందించారు. దీంతో పాటు 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా కూడా ఉంది. ఐపీ54 రేటెడ్ డస్ట్, స్ప్లాష్ రెసిస్టెన్స్‌తో ఈ ఫోన్ మార్కెట్లోకి వచ్చింది. ఆండ్రాయిడ్ 14 ఆధారిత హైఓఎస్ 14 స్కిన్‌పై ఈ ఫోన్ రన్ కానుంది. ఈ సంవత్సరం సెప్టెంబర్‌లో లాంచ్ అయిన టెక్నో పాప్ 9 5జీ స్మార్ట్ ఫోన్‌కు ఇది 4జీ వేరియంట్.


టెక్నో పాప్ 9 4జీ ధర (Tecno POP 9 4G Price in India)
ఇందులో కేవలం ఒక్క వేరియంట్ మాత్రమే భారతదేశ మార్కెట్లో అందుబాటులో ఉంది. 3 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్‌తో మార్కెట్లోకి వచ్చిన ఈ వేరియంట్ ధరను రూ.6,499గా నిర్ణయించారు. దీనిపై రూ.200 బ్యాంక్ ఆఫర్ కూడా ఉంది. దాన్ని కూడా కలిపితే రూ.6,499కి ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. అమెజాన్‌లో నవంబర్ 26వ తేదీ నుంచి దీనికి సంబంధించిన సేల్ జరగనుంది. గ్లిట్టరీ వైట్, లైమ్ గ్రీన్, స్టార్‌ట్రెయిల్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు.



Also Read: ఫోన్‌లో ఈ పాస్‌వర్డ్ పొరపాటున కూడా పెట్టుకోకండి - హ్యాక్ చేయడానికి సెకన్లు చాలు!


టెక్నో పాప్ 9 4జీ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు (Tecno POP 9 4G Specifications)
టెక్నో పాప్ 9 4జీ స్మార్ట్ ఫోన్‌లో 6.67 అంగుళాల హెచ్‌డీ+ స్క్రీన్‌ను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్ కాగా, టచ్ శాంప్లింగ్ రేట్ 180 హెర్ట్జ్‌గానూ ఉంది. 12ఎన్ఎం మీడియాటెక్ హీలియో జీ50 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ రన్ కానుంది. 3 జీబీ వరకు ర్యామ్, 64 జీబీ వరకు స్టోరేజ్‌ను కూడా ఈ ఫోన్‌లో అందించారు. ఆండ్రాయిడ్ 14 ఆధారిత హైఓఎస్ 14 ఆపరేటింగ్ సిస్టంపై టెక్నో పాప్ 9 4జీ పని చేయనుంది.


ఇక కెమెరాల విషయానికి వస్తే... ఈ స్మార్ట్ ఫోన్ వెనకవైపు13 మెగాపిక్సెల్ సెన్సార్‌ను అందించారు. 4x డిజిటల్ జూమ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. 1080p క్వాలిటీలో వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 8 మెగాపిక్సెల్ సెన్సార్‌ను అందించారు. ఇది కూడా 1080p వీడియో రికార్డింగ్‌ను సపోర్ట్ చేయనుంది.


దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా 15W వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్‌ను అందించనుంది. యూఎస్‌బీ టైప్-సీ పోర్టు కూడా ద్వారా ఛార్జింగ్ పెట్టవచ్చు. డీటీఎస్ బ్యాక్డ్ డ్యూయల్ స్టీరియో స్పీకర్ యూనిట్ అందుబాటులో ఉంది. ఐఆర్ రిమోట్ కంట్రోల్ సపోర్ట్ అందించారు. డస్ట్, స్ప్లాష్ రెసిస్టెన్స్ కోసం ఐపీ54 రేటింగ్ కూడా ఉంది. దీని మందం 0.84 సెంటీమీటర్లు కాగా, బరువు 188.5 గ్రాములుగా ఉంది. 


Also Read: రూ.15 వేలలోపు బెస్ట్ 5జీ స్మార్ట్ ఫోన్లు ఇవే - లిస్ట్‌లో 108 మెగాపిక్సెల్ ఫోన్లు కూడా!