యాపిల్ ఇటీవలే ఐఫోన్ 14 సిరీస్ స్మార్ట్ ఫోన్లను లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో నాలుగు కొత్త ఫోన్లు ఉన్నాయి. వీటి ర్యామ్, బ్యాటరీ సామర్థ్యాలను యాపిల్ అధికారికంగా ప్రకటించలేదు. అయితే ఇప్పుడు ఈ సిరీస్ ర్యామ్, బ్యాటరీ వివరాలు బయటకు వచ్చాయి.
యాపిల్ అప్‌డేట్స్ అందించే మ్యాక్‌రూమర్స్ కథనం ప్రకారం... ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్, ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ ఇలా అన్ని ఫోన్లలో 6 జీబీ ర్యామ్‌ను అందించనున్నారు. అయితే ఇది ఏ టైప్ ర్యామ్ అనేది మాత్రం తెలియరాలేదు. గతంలో వచ్చిన కథనాల్లో ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్‌ల్లో ఎల్పీడీడీఆర్5 ర్యామ్, ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్‌ల్లో ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్ ఉండనుందని పేర్కొన్నారు.
గత సంవత్సరం ఐఫోన్ 13 మినీ, ఐఫోన్ 13ల్లో 4 జీబీ ర్యామ్, ఐఫోన్ 13 ప్రో, ఐఫోన్ 13 ప్రో మ్యాక్స్‌ల్లో 6 జీబీ ర్యామ్‌ను అందించారు. వీటన్నిటిలో ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్‌నే యాపిల్ అందించింది. ఇక బ్యాటరీ సామర్థ్యాల విషయాలు కూడా బయటకు వచ్చాయి. దీని ప్రకారం ఐఫోన్ 14లో 3279 ఎంఏహెచ్, ఐఫోన్ 14 ప్లస్‌లో 4325 ఎంఏహెచ్, ఐఫోన్ 14 ప్రోలో 3200 ఎంఏహెచ్, ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్‌లో 4323 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండనుంది.
లైనప్‌లో ఉన్న అన్ని ఫోన్లకంటే ఐఫోన్ 14 ప్లస్‌లో పెద్ద బ్యాటరీ ఉంది. ఐఫోన్ 14 ప్రోలో తక్కువ సామర్థ్యం ఉన్న బ్యాటరీ ఉంది. ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 ప్లస్‌ల బ్యాటరీ సామర్థ్యం దాదాపు ఒకేలా ఉంది. ఇక గతేడాది చూసుకుంటే ఐఫోన్ 13 మినీలో 2406 ఎంఏహెచ్, ఐఫోన్ 13లో 3227 ఎంఏహెచ్, ఐఫోన్ 13 ప్రోలో 3095 ఎంఏహెచ్, ఐఫోన్ 13 ప్రో మ్యాక్స్‌లో 4352 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు.
ఐఫోన్ 14 సిరీస్ ప్రీ-ఆర్డర్లు ఇటీవలే మనదేశంలో ప్రారంభం అయ్యాయి. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, రిలయన్స్ డిజిటల్, క్రోమా వంటి ఆన్‌లైన్ ప్లాట్‌ఫాంల్లో ప్రీ-ఆర్డర్ చేయవచ్చు. హెచ్‌డీఎఫ్‌సీ కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే రూ.6,000 వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభించనుంది. ఈ విషయాన్ని యాపిల్ తెలిపింది.
ఐఫోన్ 14 సిరీస్ రేటు
ఐఫోన్ 14 ధర మనదేశంలో రూ.79,900 నుంచి ప్రారంభం కానుంది. ఇక ఐఫోన్ 14 ప్లస్ ప్రారంభ ధర రూ.89,900 నుంచి, ఐఫోన్ 14 ప్రో ధర రూ.1,29,990 నుంచి, ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ ధర రూ.1,39,990 నుంచి ప్రారంభం కానుంది.
Also Read: iPhone 14 Series: ఐఫోన్ 14 సిరీస్ వచ్చేసింది - ధర విషయంలో జాగ్రత్త పడ్డ యాపిల్ - మనదేశంలో ఎంతంటే?
Also Read: Apple Watch Series 8: యాపిల్ బెస్ట్ వాచ్ వచ్చేసింది - మనదేశంలో ధర ఎంతో తెలుసా?