రిలయన్స్ జియో ఎప్పటికప్పుడు వినియోగదారులను ఆకట్టుకునే ప్లాన్స్ తీసుకొస్తున్నది. ఇప్పటికే అన్ లిమిటెడ్ కాలింగ్ తో పాటు  రోజు వారి డేటాతో పాటు అనేక ప్రీపెయిడ్ ప్లాన్‌ లను అందిస్తుంది. 1 GB, 2 GB, 3 GB రోజు వారీ డేటాతో ప్లాన్‌ లను వినియోగదారులకు పరిచయం చేసింది.  రోజుకు 3GB డేటాను అందించే ప్లాన్‌ ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.  ఈ ప్లాన్‌ లు అపరిమిత కాలింగ్ ప్రయోజనాలు,  OTT బెనిఫిట్స్ పొందే అవకాశం ఉంది.  ప్రతిరోజూ 3GB డేటా  అందించే Jio ప్లాన్స్ ఏమిటో చూసేయండి మరి.

  


రూ. 419 ప్లాన్


ఈ ప్రీపెయిడ్ ప్లాన్ 28 రోజుల చెల్లుబాటుతో 84 GB మొత్తం డేటాను అందిస్తుంది. ఇందులో 3GB రోజువారీ డేటా, అపరిమిత కాలింగ్, రోజుకు 100 SMS, Jio యాప్‌ లకు కాంప్లిమెంటరీ యాక్సెస్ అందిస్తుంది. వీటితో పాటు Disney+ Hotstar మొబైల్‌ కి 3 నెలల ఉచిత సబ్‌ స్క్రిప్షన్ అవకాశం కల్పిస్తోంది.   


రూ. 601 ప్లాన్


ఈ ప్రీపెయిడ్ ప్లాన్‌ లో 28 రోజుల పాటు 3GB రోజు వారీ పరిమితితో 90 GB మొత్తం డేటా ఉంది. ఇది జియో యాప్‌ లకు కాంప్లిమెంటరీ సబ్‌ స్క్రిప్షన్‌ తో అపరిమిత కాలింగ్, రోజుకు 100 SMS మరియు అదనపు 6GB డేటాను కూడా అందిస్తుంది. వినియోగదారులు ఈ ప్లాన్‌ తో రూ. 499 విలువైన ఏడాది  డిస్నీ+ హాట్‌ స్టార్ మొబైల్ సబ్‌ స్క్రిప్షన్‌ ను  పొందుతారు.


రూ. 1,199 ప్లాన్


ఈ ప్రీపెయిడ్ ప్లాన్ 84 రోజుల చెల్లుబాటు కోసం 3GB రోజువారీ డేటా పరిమితితో 252GB మొత్తం డేటాను అందిస్తుంది. ఈ ప్లాన్ అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 100 SMS, Jio యాప్ సబ్‌స్క్రిప్షన్ మరియు రూ.149 విలువైన డిస్నీ+ హాట్‌ స్టార్ మొబైల్ సబ్‌ స్క్రిప్షన్‌ ను ఉచితంగా 3 నెలలు అందిస్తుంది.


రూ. 4,199 ప్లాన్


ఈ వార్షిక ప్లాన్ 3 GB రోజువారీ డేటా పరిమితితో 1,095 GB డేటాను అందిస్తుంది. ఇందులో అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 100 SMSలు, Jio యాప్‌లకు కాంప్లిమెంటరీ సబ్‌ స్క్రిప్షన్ కూడా ఉన్నాయి. దానితో పాటుగా ఈ ప్లాన్ సంవత్సరం పాటు  డిస్నీ+ హాట్‌ స్టార్ ప్రీమియం సబ్‌ స్క్రిప్షన్‌ అందిస్తుంది. ఇది OTTలో అందుబాటులో ఉన్న మొత్తం కంటెంట్‌కు ఉచితంగా యాక్సెస్‌ ని అందిస్తుంది.  జియో టీవీ, జియో క్లౌడ్, జియో సెక్యూరిటీ, జియో సినిమాలకు ఫ్రీ యాక్సెస్ ఉంటుంది. 


ఇప్పటికే ఎయిర్‌ టెల్, వొడాఫోన్ ఐడియా వంటి కంపెనీలు పలు రీచార్జ్ ప్లాన్స్‌ లో భాగంగా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సబ్‌ స్క్రిప్షన్‌ ను ఉచితంగా అందిస్తున్నాయి. అయితే, రిలయన్స్ జియో తాజాగా ప్రవేశపెట్టిన ప్రీపెయిడ్ ప్లాన్స్‌ లో అంతకుమించిన బెనిఫిట్స్ ను అందిస్తోంది.