Canada Swaminarayan Temple: 


స్వామినారాయణ్ టెంపుల్‌లో ఘటన..


కెనడాలోని BAPS స్వామినారాయణ్ మందిర్ వద్ద ఉన్న శిలాఫలకంపై గుర్తు తెలియన వ్యక్తులు "ఖలిస్థాన్ జిందాబాద్" అనే నినాదాలు రాశారు. అటు పక్కనే హిందుస్థాన్‌ను అనుమానించే విధంగా స్లోగన్స్‌ రాశారు. స్థానికంగా ఇది పెద్ద అలజడికి కారణమైంది. రాత్రికి రాత్రే వీటిపై ఎవరు రాశారన్న అంశంపై సరైన విచారణ జరపాలని హిందువులు డిమాండ్ చేస్తున్నారు. టోర్నటోలో ఉన్న ఈ ఆలయం అక్కడ ఎంతో ప్రసిద్ధి. దీనిపై ఇండియన్ హై కమిషన్ (Indian High Commission) తీవ్రంగా స్పందించింది.





ఆలయ ప్రతిష్ఠకు ఇలా మచ్చ తెచ్చిన వారెవరో కనుక్కో వాలని, నిందితులపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని కెనడా అధికారులకు సూచించింది. దీనిపై పలువురు రాజకీయ నేతలూ స్పందించారు.


బ్రాంప్టన్ (Brampton) సౌత్ ఎంపీ సోనియా సిధు ట్వీట్ చేశారు. "భిన్న సంస్కృతులు, భిన్న విశ్వాసాలున్న సమాజం మనది. ఇక్కడ సురక్షితంగా జీవించే హక్కు అందరికీ ఉంది. ఈ ఘటనకు బాధ్యులెవరో గుర్తించి కఠిన శిక్ష విధించాలి" అని పోస్ట్ చేశారు. ఓ నెటిజన్...టెంపుల్‌ శిలాఫలకంపై అభ్యంతరకర రాతలు రాసినట్టు ఓ వీడియో తీసి ట్విటర్‌లో పోస్ట్ చేశాడు. అయితే...ఈ వీడియో నిజమా కాదా అన్నది ఇంకా స్పష్టత రాలేదు. బ్రాంప్టన్ మేయర్ పాట్రిక్ బ్రౌన్‌ కూడా ఈ ఘటనపై స్పందించారు. "ఇలాంటి దుశ్చర్యలకు కెనడాలో 
తావు లేదు. వీలైనంత త్వరగా నిందితుల్ని పట్టుకుంటారని ఆశిద్దాం" అని ట్వీట్ చేశారు. భారత సంతతికి చెందిన కెనడా ఎంపీ చంద్ర ఆర్య కూడా ఇదే విషయమై అసంతృప్తి వ్యక్తం చేశారు. కెనడాలోని హిందూ ఆలయాలను లక్ష్యంగా చేసుకుని కొందరు ఉద్దేశపూర్వకంగా
ఇలాంటివి చేస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి ఘటనల్ని అందరూ ఖండించాలని సూచించారు. 














వరుసగా ఇలాంటివే..


గతేడాది కూడా టోర్నటో ప్రాంతంలోని కొన్ని హిందూ ఆలయాల్లో ఇలాంటి ఘటనలే జరిగాయి. ఇప్పటికే ఆరు ఆలయాల్లో ఇలాంటివి జరగ్గా... కొన్ని చోట్ల హుండీలను దొంగిలించారు. గతేడాది నవంబర్‌లో హిందూ సభ టెంపుల్, శ్రీ జగన్నాథ్ టెంపుల్‌పై ఇలాంటి దాడే జరిగింది. ఆ తరవాత ఈ ఏడాది జనవరిలో మా చింత్‌పూర్ణి మందిర్, హిందూ హెరిటేజ్ సెంటర్, గౌరీ శంకర్ మందిర్, హామిల్టన్ సమాజ్ టెంపుల్స్‌ కూడా దాడికి గురయ్యాయి. 


Also Read: Tirumala Hundi Income: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ, నిన్న హుండీ ఆదాయం ఎంతంటే?