ఇన్‌ఫీనిక్స్ నోట్ 12 (2023) స్మార్ట్ ఫోన్‌ను కంపెనీ లాంచ్ చేసింది. ఇందులో మీడియాటెక్ హీలియో జీ99 ప్రాసెసర్‌ను అందించారు. మోన్‌స్టర్ గేమింగ్ కిట్, 4డీ వైబ్రేషన్ ఫీడ్‌బ్యాక్ ఉన్న లీనియర్ మోటర్ కూడా ఉన్నాయి. 33W ఫాస్ట్ చార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది.
ఇన్‌ఫీనిక్స్ నోట్ 12 (2023) ధర
ఇందులో కేవలం ఒక్క వేరియంట్ మాత్రమే అందుబాటులో ఉంది. 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ ఉన్న ఈ వేరియంట్ ధరను 168 డాలర్లుగా (సుమారు రూ.14,000) నిర్ణయించారు. బ్లూ, వైట్, గ్రే ఆప్షన్లలతో దీన్ని కొనుగోలు చేయవచ్చు. త్వరలో ఈ ఫోన్ మనదేశంలో కూడా లాంచ్ అయ్యే అవకాశం ఉంది.
ఇన్‌ఫీనిక్స్ నోట్ 12 (2023) స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
ఇందులో 6.7 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఎక్స్ఓఎస్ ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా, 33W ఫాస్ట్ చార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది.
ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్‌గా ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 16 మెగాపిక్సెల్ కెమెరా అందుబాటులో ఉంది. మీడియాటెక్ హీలియో జీ99 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ఇందులో ఉన్నాయి. ర్యామ్ ఎక్స్‌టెన్షన్ ఫీచర్ ద్వారా ర్యామ్‌ను మరో 5 జీబీ వరకు పెంచుకోవచ్చు. దీని మందం 0.78 సెంటీమీటర్లు కాగా, డ్యూయల్ స్పీకర్లు కూడా అందించారు.
ఇన్‌ఫీనిక్స్ జీరో 55 క్యూఎల్ఈడీ స్మార్ట్ టీవీ, ఎక్స్3 50 స్మార్ట్ టీవీలు మనదేశంలో లాంచ్ అయ్యాయి. ఈ రెండు స్మార్ట్ టీవీ మోడళ్లలోనూ 4కే డిస్‌ప్లేలను ఇన్‌ఫీనిక్స్ అందించింది. వీటిలో 55 అంగుళాల మోడల్‌ను ఫ్లిప్‌కార్ట్‌లో విక్రయించనున్నారు. ఇన్‌ఫీనిక్స్ ఎక్స్3 50 అంగుళాల టీవీ డాల్బీ ఆడియోను సపోర్ట్ చేయనుంది.
ఇన్‌ఫీనిక్స్ జీరో 55 క్యూఎల్ఈడీ ధరను మనదేశంలో రూ.34,999గా నిర్ణయించారు. ఇన్‌ఫీనిక్స్ ఎక్స్3 50 అంగుళాల స్మార్ట్ టీవీ ధర రూ.24,990గా ఉంది. యాక్సిస్ బ్యాంకు క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా ఈ టీవీలను కొనుగోలు చేస్తే తగ్గింపు లభించనుంది.
Also Read: iPhone 14 Series: ఐఫోన్ 14 సిరీస్ వచ్చేసింది - ధర విషయంలో జాగ్రత్త పడ్డ యాపిల్ - మనదేశంలో ఎంతంటే?
Also Read: Apple Watch Series 8: యాపిల్ బెస్ట్ వాచ్ వచ్చేసింది - మనదేశంలో ధర ఎంతో తెలుసా?