షావోమీ 12టీ సిరీస్ ఫోన్లు అక్టోబర్‌లో లాంచ్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. తాజాగా వినిపిస్తున్న కథనాల ప్రకారం షావోమీ 12టీ ఇప్పటికే గీక్ బెంచ్ అధికారిక వెబ్‌సైట్‌లో కనిపించింది. ఇప్పుడు షావోమీ 12టీ ప్రో స్మార్ట్ ఫోన్ కూడా ఈ డేటాబేస్‌లో స్పాట్ అయిందని సమాచారం. ఇందులో క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 ప్లస్ జెన్ 1 ప్రాసెసర్ ఉండనుంది. ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టం, 8 జీబీ ర్యామ్ వంటి ఫీచర్లు ఈ ఫోన్‌లో ఉండనున్నాయి.


22081212UG మోడల్ నంబర్‌తో ఒక ఫోన్ గీక్ బెంచ్ డేటాబేస్‌లో కనిపించింది. ఇది షావోమీ 12టీ ప్రో గ్లోబల్ వేరియంట్ అయ్యే అవకాశం ఉంది. ఈ ఫోన్ గీక్ బెంచ్ సింగిల్ కోర్ టెస్టులో 1,300 పాయింట్లను, మల్టీకోర్ టెస్టులో 4,061 పాయింట్లను సాధించింది. ఇదే వెబ్‌సైట్ సింగిల్ కోర్ టెస్టులో షావోమీ 12టీ 753 పాయింట్లను, మల్టీకోర్ టెస్టులో 2,990 పాయింట్లను షావోమీ సాధించింది.


షావోమీ 12టీ, షావోమీ 12టీ ప్రో స్మార్ట్ ఫోన్లు అక్టోబర్‌లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఇందులో వెనకవైపు 200 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్‌ను అందించనున్నారు. దీంతోపాటు ఎల్ఈడీ ఫ్లాష్ కూడా ఉండనుంది. ఈ స్మార్ట్ ఫోన్ల ధర కూడా ఆన్‌లైన్‌లో లీకైంది. వీటిలో షావోమీ 12టీ ధర 649 యూరోలుగానూ (సుమారు రూ.51,500), షావోమీ 12టీ ప్రో ధర 849 యూరోలుగానూ (సుమారు రూ.67,000) ఉండనుందని వార్తలు వస్తున్నాయి.


షావోమీ 11టీ ప్రో 5జీ స్మార్ట్ ఫోన్ మనదేశంలో లాంచ్ అయింది. ఇందులో మూడు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.39,999గా ఉంది. ఇక 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.41,999గానూ, 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.43,999గా ఉంది. సెలెస్టియల్ మ్యాజిక్, మెటియోరైట్ గ్రే, మూన్‌లైట్ వైట్ రంగుల్లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. 


షావోమీ 11టీ ప్రో 5జీ స్పెసిఫికేషన్లు
ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఎంఐయూఐ 12.5 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో 6.67 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఫ్లాట్ అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది.


ఇందులో వెనకవైపు మూడు కెమెరాలు ఉండనున్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 108 మెగాపిక్సెల్ కాగా.. దీంతోపాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 5 మెగాపిక్సెల్ టెలిమాక్రో షూటర్‌లను ఇందులో అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 16 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు.


దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉంది. 120W హైపర్ చార్జ్ ఫాస్ట్ చార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. 0 నుంచి 100 శాతం చార్జింగ్ కేవలం 17 నిమిషాల్లోనే ఎక్కనుంది. ఫోన్‌తో పాటు 120W వైర్డ్ చార్జర్‌ను అందించనున్నారు. దీని మందం 0.88 సెంటీమీటర్లు కాగా, బరువు 204 గ్రాములుగా ఉంది.


Also Read: iPhone 14 Series: ఐఫోన్ 14 సిరీస్ వ‌చ్చేసింది - ధర విషయంలో జాగ్రత్త పడ్డ యాపిల్ - మనదేశంలో ఎంతంటే?


Also Read: Apple Watch Series 8: యాపిల్ బెస్ట్ వాచ్ వచ్చేసింది - మనదేశంలో ధర ఎంతో తెలుసా?