HMD Fusion Smart Outfits: స్మార్ట్ ఫోన్లు పోను పోనూ కొత్త రూపాలను సంతరించుకుంటున్నాయి. ఇంతకు ముందు నోకియాను కొనుగోలు చేసిన హెచ్ఎండీ సంస్థ మనదేశంలో కొత్త తరహా ఫోన్‌ను లాంచ్ చేసింది. అదే హెచ్ఎండీ ఫ్యూజన్. ఈ స్మార్ట్ ఫోన్ ఇంటర్‌ఛేంజబుల్ కవర్లతో మార్కెట్లోకి వచ్చింది. వీటిని ప్రత్యేకంగా కొనుగోలు చేయాల్సి వస్తుంది. ఈ ఇంటర్‌ఛేంజబుల్ కవర్స్‌ను స్మార్ట్ కవర్స్ అని పిలుస్తున్నారు. ప్రత్యేకమైన స్మార్ట్ పిన్స్‌తో వీటిని ఉపయోగించుకోవచ్చు. ఇది ఫోన్‌కు కొత్త తరహా లుక్‌ను అందిస్తుంది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ రన్ కానుంది. హెచ్‌ఎండీ ఫ్యూజన్‌ను కంపెనీ 2024 సెప్టెంబర్‌లో బెర్లిన్‌లో జరిగిన ఐఎఫ్ఏ ట్రేడ్ షోలో ప్రదర్శనకు ఉంచింది.


హెచ్ఎండీ ఫ్యూజన్ ధర (HMD Fusion Price in India)
8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్‌తో వచ్చిన ఈ వేరియంట్ ధరను రూ.17,999గా నిర్ణయించారు. ఈ ఫోన్ కొనుగోలుపై కంపెనీ రూ.5,999 విలువైన హెచ్ఎండీ క్యాజువల్ అవుట్ ఫిట్స్, ఫ్లాషీ అవుట్ ఫిట్స్, గేమింగ్ అవుట్ ఫిట్స్‌ను ఉచితంగా అందిస్తుంది. ఈ ఫోన్‌ను లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ కింద అమెజాన్‌లో రూ.15,999కే విక్రయిస్తున్నారు. అయితే ఈ ఆఫర్ ఎన్నాళ్లు ఉంటుందో తెలియరాలేదు. దీనికి సంబంధించిన సేల్ నవంబర్ 29వ తేదీ మధ్యాహ్నం 12:01 నుంచి జరగనుంది.



Also Read: ఫోన్‌లో ఈ పాస్‌వర్డ్ పొరపాటున కూడా పెట్టుకోకండి - హ్యాక్ చేయడానికి సెకన్లు చాలు!


హెచ్ఎండీ ఫ్యూజన్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు (HMD Fusion Specifications)
ఈ ఫోన్ కొనడం ద్వారా లభించే హెచ్ఎండీ స్మార్ట్ అవుట్ ఫిట్స్ కొత్త ఫీచర్లను కూడా అందించనున్నాయి. ఫ్యూజన్ గేమింగ్ అవుట్ ఫిట్స్ ద్వారా గేమింగ్ కంట్రోల్స్, ఫ్లాషీ అవుట్ ఫిట్ ద్వారా ఫోల్డబుల్ ఆర్జీబీ ఎల్ఈడీ ఫ్లాష్ రింగ్ వంటి ఫీచర్లు ఉండనున్నాయి. ఈ కస్టమైజబుల్ అవుట్ ఫిట్స్‌ను ఆరు స్మార్ట్ పిన్స్ ద్వారా వాడుకోవచ్చు. ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ రన్ కానుంది. రెండు సంవత్సరాల పాటు ఆపరేటింగ్ సిస్టం అప్‌గ్రేడ్లు, మూడు సంవత్సరాల పాటు సెక్యూరిటీ అప్‌డేట్స్ లభించనున్నాయి.


ఇందులో 6.56 అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్ కాగా, 600 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను డెలివర్ చేయనుంది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 4 జెన్2 ప్రాసెసర్‌పై హెచ్ఎండీ ఫ్యూజన్ పని చేయనుంది. 8 జీబీ వరకు ర్యామ్, 256 జీబీ స్టోరేజ్‌తో ఈ ఫోన్ లాంచ్ అయింది.


ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు రెండు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమరా సామర్థ్యం 108 మెగాపిక్సెల్ కాగా, దీంతో పాటు 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కూడా అందించారు. ముందువైపు మాత్రం సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 50 మెగాపిక్సెల్ కెమెరా అందుబాటులో ఉంది. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా, 33W ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేయనుంది. సెక్యూరిటీ కోసం ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఫోన్ పక్కభాగంలో అందించారు. ఫేస్ అన్‌లాక్ ఫీచర్ కూడా ఇందులో ఉంది. దీని మందం 0.83 సెంటీమీటర్లు కాగా, బరువు 202.5 గ్రాములుగా ఉంది.


Also Read: రూ.15 వేలలోపు బెస్ట్ 5జీ స్మార్ట్ ఫోన్లు ఇవే - లిస్ట్‌లో 108 మెగాపిక్సెల్ ఫోన్లు కూడా!