గూగుల్ పిక్సెల్ 7, గూగుల్ పిక్సెల్ 7 ప్రో స్మార్ట్ ఫోన్లు మనదేశంలో లాంచ్ అయ్యాయి. అయితే ఈ రెండిట్లోనూ కేవలం ఒక్క వేరియంట్ మాత్రమే లాంచ్ అయింది. అది కూడా బేస్ మాత్రమే కొనుగోలు చేయవచ్చు. ఇప్పుడు గూగుల్ పిక్సెల్ 7 పిక్సెల్ 7 ప్రోల్లో 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ మనదేశంలో లాంచ్ కాబోవడం లేదు. ఈ విషయాన్ని కంపెనీ ప్రకటించింది. దీంతోపాటు గూగుల్ వీపీఎన్ సర్వీస్ కూడా మనదేశంలో లాంచ్ కానుంది.


గూగుల్ పిక్సెల్ 7, పిక్సెల్ 7 ప్రోల్లో సపోర్టెడ్ కంట్రీస్‌లో వీపీఎన్‌ను గూగుల్ వన్ సబ్‌స్క్రిప్షన్‌తో ఉచితంగా అందిస్తున్నారు. యూఎస్, ఆస్ట్రేలియా, జపాన్, యూకే, యూరోప్‌లో దీన్ని ఉపయోగించవచ్చు. అయితే మనదేశంలో మాత్రం ఈ సర్వీస్‌ను లాంచ్ చేయడం లేదు. ఆండ్రాయిడ్ ఫోన్లలో యాపిల్‌కు పోటీ ఇచ్చే ఫోన్ ఏదైనా ఉంటే అవి గూగుల్ ఫోన్లే. కెమెరాల విషయంలో అయితే ఐఫోన్లకు దాదాపు ఈక్వల్‌గా గూగుల్ పిక్సెల్ ఫోన్లు పెర్ఫార్మెన్స్ చేస్తాయి. గూగుల్ పిక్సెల్ 7 సిరీస్ ఫోన్లు ఇటీవలే మనదేశంలో లాంచ్ అయ్యాయి.


గూగుల్ పిక్సెల్ 7, గూగుల్ పిక్సెల్ 7 ప్రో ధర
మనదేశంలో గూగుల్ పిక్సెల్ 7 ధరను రూ.59,999గా నిర్ణయించారు. స్నో, ఆబ్సీడియన్, లెమన్ గ్రాస్ కలర్ ఆప్షన్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు. గూగుల్ పిక్సెల్ 7 ప్రో ధర మనదేశంలో రూ.84,999గా ఉంది. స్నో, ఆబ్సీడియన్, హేజెల్ కలర్ ఆప్షన్లలో ఈ స్మార్ట్ ఫోన్ లాంచ్ అయింది. 


గూగుల్ పిక్సెల్ 7 స్పెసిఫికేషన్లు
ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టంపై గూగుల్ పిక్సెల్ 7 పని చేయనుంది. 6.32 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఓఎల్ఈడీ డిస్‌ప్లేను ఇందులో అందించారు. ఆక్టాకోర్ టెన్సార్ జీ2 ప్రాసెసర్‌ను ఇందులో అందించారు. ఈ ఫోన్ వెనకవైపు రెండు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ కూడా అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 10.8 మెగాపిక్సెల్ కెమెరా ఉంది.


ఇన్‌డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను గూగుల్ పిక్సెల్ 7లో అందించారు. ఫాస్ట్ వైర్డ్ చార్జింగ్, వైర్‌లెస్ చార్జింగ్ సపోర్ట్‌లు ఇందులో ఉన్నాయి. గూగుల్ ఎక్స్‌ట్రీమ్ బ్యాటరీ సేవర్ మోడ్ ద్వారా 72 గంటల వరకు దీని బ్యాటరీ బ్యాకప్ రానుందని కంపెనీ ప్రకటించింది.


గూగుల్ పిక్సెల్ 7 ప్రో స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టంపైనే గూగుల్ పిక్సెల్ 7 ప్రో కూడా పని చేయనుంది. ఈ ఫోన్‌లో 6.7 అంగుళాల క్వాడ్ హెచ్‌డీ+ ఓఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. టెన్సార్ జీ2 ప్రాసెసర్‌ను గూగుల్ పిక్సెల్ 7 ప్రోలో అందించారు. ఈ ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 48 మెగాపిక్సెల్ టెలిఫొటో లెన్స్ కూడా అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు గూగుల్ పిక్సెల్ 7 తరహాలోనే 10.8 మెగాపిక్సెల్ కెమెరా ఉంది.


Also Read: iPhone 14 Series: ఐఫోన్ 14 సిరీస్ వ‌చ్చేసింది - ధర విషయంలో జాగ్రత్త పడ్డ యాపిల్ - మనదేశంలో ఎంతంటే?


Also Read: Apple Watch Series 8: యాపిల్ బెస్ట్ వాచ్ వచ్చేసింది - మనదేశంలో ధర ఎంతో తెలుసా?