గ్రూప్ సభ్యులను 1,024కు పెంచుకోవచ్చు!


యూజర్ల కోసం ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి తెస్తున్న వాట్సాప్.. మరో గుడ్ న్యూస్ చెప్పింది. గ్రూపులో సభ్యుల సంఖ్యను రెండింతలకు పైగా పెంచబోతున్నది. కొద్ది వారాల క్రితం వరకు గ్రూపులో కేవలం 256 మంది సభ్యులనే చేర్చుకునే వెసులుబాటు ఉండేది. ఆ సంఖ్యను  కొద్ది రోజుల క్రితం 512కు పెంచింది. ఇప్పుడు గ్రూపులో సభ్యుల సంఖ్యను ఏకంగా 1,024కు పెంచాలని నిర్ణయించింది. ఇప్పటికే  కొంత మంది వాట్సాప్‌ బీటా యూజర్లకు ఈ అప్‌ డేట్‌ అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉన్న ఈ అప్ డేట్, పూర్తయిన వెంటనే మిగతా యూజర్లకూ చేరనుంది. వాట్సాప్ తీసుకున్న ఈ నిర్ణయం ద్వారా ఓకేసారి గ్రూపులో వెయ్యి మందికి పైగా సభ్యులతో చాట్ చేసే వెసులుబాటు ఉంటుంది.  


Read Also: అందుబాటులోకి నయా వాట్సాప్ ఫీచర్, ఇక డాక్యుమెంట్లను క్యాప్షన్‌తో షేర్ చేసుకోవచ్చు!


గ్రూపులో చేరాలంటే అడ్మిన్అప్రూవ్తప్పనిసరి


గ్రూపు సభ్యుల పెంపుతో పాటు వాట్సాప్ మరో ఫీచర్ ను టెస్ట్ చేస్తున్నది. గ్రూప్ అడ్మిన్ల కోసం అప్రూవల్ సిస్టమ్ ను పరిచయం చేయబోతున్నది. ఎవరైనా గ్రూపులో చేరాలి అనుకుంటే.. అడ్మిన్‌ అనుమతి తప్పకుండా తీసుకోవాల్సి ఉంటుంది. గ్రూపులో చేరేందుకు వచ్చిన రిక్వెస్టులన్నీ, పెండింగ్ పార్టిసిపెంట్స్ రూపంలో కనిపిస్తాయి. వాటిని అడ్మిన్‌ చెక్‌ చేసుకుని.. ఆ వ్యక్తులను గ్రూపు సభ్యులుగా ఉంచాలి అనుకుంటే యాక్సెప్ట్ చెయ్యొచ్చు. వద్దు అనుకుంటే రిక్వెస్ట్‌ ను రిజెక్ట్‌ చేయొచ్చు. 






వాట్సాప్ కాల్ లింక్ సహా పలు ఫీచర్ల టెస్టింగ్


త్వరలో వాట్సాప్ కాల్ లింక్ ఫీచర్ ను సైతం అందుబాటులోకి తీసుకురాబోతుంది. ఈ ఫీచర్ జూమ్, గూగుల్ మీట్ యాప్స్‌ మాదిరిగా పనిచేస్తుంది. ఎవరినైనా గ్రూప్ కాల్‌ లో చేర్చుకోవాలి అంటే వారికి కాల్ లింక్స్ పంపితే సరిపోతుంది. ఆ లింక్స్‌పై క్లిక్ చేయడం ద్వారా యూజర్లు గ్రూప్ కాల్స్‌ లో చేరే అవకాశం ఉంటుంది. అటు యూజర్ల ప్రైవసీ విషయంలోనూ వాట్సాప్ కీలక నిర్ణం తీసుకుంది. ‘వ్యూ వన్స్‌’ పేరుతో స్క్రీన్‌ షాట్‌ బ్లాక్ ఫీచర్‌ ను తీసుకొస్తోంది. యూజర్లు వ్యూ వన్స్ ద్వారా పంపే మెసేజ్‌లతో పాటు ఫోటోలను అవతలి వ్యక్తులు స్క్రీన్‌ షాట్‌ తీసుకునే అవకాశం ఉండదు. మరోవైపు యూజర్లు వాట్సాప్‌ స్టేటస్‌ లో ఆడియో మెసేజ్‌లను కూడా పెట్టుకునే వెసులుబాటు కల్పించబోతున్నది. ముందుగాస్టేటస్‌ బటన్‌ క్లిక్‌ చేస్తే.. వాయిస్‌ రికార్డ్‌ చేసే ఆప్షన్‌ కనిపిస్తుంది.  దాని ద్వారా వాయిస్‌ స్టేటస్‌ ను సెట్ చేసుకోవచ్చు.


Read Also: పాస్ వర్డ్స్ ఎంపికలో ఈ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే, మీ అకౌంట్స్ ఈజీగా హ్యాక్ అవుతాయి!