Stocks to watch today, 12 October 2022: ఇవాళ (బుధవారం) ఉదయం 7.30 గంటల సమయానికి, సింగపూర్‌ ఎక్సేంజ్‌లో నిఫ్టీ ఫ్యూచర్స్‌ (SGX నిఫ్టీ ఫ్యూచర్స్) 41.5 పాయింట్లు లేదా 0.28 శాతం గ్రీన్‌ కలర్‌లో 16,981.5 వద్ద ట్రేడవుతోంది. మన మార్కెట్‌ ఇవాళ పాజిటివ్‌గా ప్రారంభం అవుతుందని SGX నిఫ్టీ సూచిస్తోంది. 


ఇవాళ Q2 ఫలితాలు ప్రకటించనున్న మేజర్‌ కంపెనీలు: HCL టెక్, విప్రో, నేషనల్ స్టాండర్డ్ (ఇండియా), స్టెర్లింగ్ మరియు విల్సన్ రెన్యూవబుల్ ఎనర్జీ (SW సోలార్), నెక్ట్స్‌డిజిటల్‌ (NxtDigital), మంగళం ఇండస్టియల్ ఫైనాన్స్, ఆర్ట్సన్ ఇంజినీరింగ్.


నేటి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి:


టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS): దేశంలో అతి పెద్ద సాఫ్ట్‌వేర్ ఎగుమతి కంపెనీ TCS, సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీని (CBDC) తెచ్చేందుకు, వినియోగానికి ఉపయోగపడే ఒక సాఫ్ట్‌వేర్‌ను రూపొందించింది. సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీని సపోర్ట్‌ చేసేలా RBI, వాణిజ్య బ్యాంకులను మార్చేందుకు, తన బ్లాక్‌చెయిన్ సొల్యూషన్స్ ప్లాట్‌ఫామ్ క్వార్ట్‌జ్‌ను (Quartz) ఎనేబుల్ చేసింది.


ఇన్ఫోసిస్: ఈ ఐటీ సర్వీసెస్ ప్రెసిడెంట్ రవికుమార్ తన పదవికి రాజీనామా చేశారు. ఏ కారణం వల్ల ఆయన రాజీనామా చేశారో కంపెనీ ప్రకటించలేదు. రెండో త్రైమాసిక ఆదాయాల వెల్లడికి కొన్ని రోజుల ముందు వచ్చిన ఈ ప్రకటన మార్కెట్‌ను ఆశ్చర్యంలో ముంచెత్తింది.


డా.రెడ్డీస్ లాబొరేటరీస్: ఈ డ్రగ్‌ మేజర్‌కు చెందిన హైదరాబాద్‌లోని బాచుపల్లి యూనిట్‌ను ‘గ్లోబల్‌ లైట్‌హౌస్‌ నెట్‌వర్క్‌’ కింద ప్రపంచ ఆర్థిక వేదిక (WEF) గుర్తించింది.


ఇండస్‌ఇండ్ బ్యాంక్: యుఎస్ ఆధారిత హెడ్జ్ ఫండ్ "రూట్ వన్ ఫండ్ I" (Route One Fund I), ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌లో తనకున్న 1.54 శాతం వాటా 1,20,00,000 షేర్లను ఓపెన్‌ మార్కెట్‌ లావాదేవీ ద్వారా అమ్మింది. ఒక్కో షేరుకు సగటు ధర రూ.1,168.26తో మొత్తం రూ.1,401.91 కోట్లకు 1.54 శాతం వాటాను ఉపసంహరించుకుంది. గోల్డ్‌మన్ సాక్స్ ఇన్వెస్ట్‌మెంట్ (మారిషస్) ఐ లిమిటెడ్ 69 లక్షల షేర్లను కైవసం చేసుకుంది.


పవర్ గ్రిడ్ కార్పొరేషన్: మన దేశంలోని తూర్పు, ఈశాన్య ప్రాంతాలను కలిపేలా ఇంటర్ స్టేట్ ట్రాన్స్‌మిషన్ ప్రాజెక్ట్‌ను నిర్మించడానికి ఒక స్పెషల్ పర్పస్ వెహికల్‌లో (SPV) 100 శాతం ఈక్విటీని కొనుగోలు చేసినట్లు ఈ ప్రభుత్వ రంగ సంస్థ  తెలిపింది. రూ.7.04 కోట్లకు SPVని కొనుగోలు చేసింది.


అదానీ ఎంటర్‌ప్రైజెస్: అదానీ ఎంటర్‌ప్రైజెస్ యూనిట్ అయిన అదానీ డేటా నెట్‌వర్క్‌కు యాక్సెస్ సేవల కోసం యూనిఫైడ్‌ లైసెన్స్ మంజూరు అయింది. దేశంలోని అన్ని టెలికాం సేవలను అందించడానికి ఈ లైసెన్స్‌ వీలు కల్పిస్తుంది. ఇటీవల జరిగిన వేలంలో స్పెక్ట్రం కొనుగోలు చేసిన అదానీ గ్రూప్, టెలికాం రంగంలోకి ప్రవేశించింది.


అదానీ గ్రీన్ ఎనర్జీ: అదానీ గ్రూప్‌లోని గ్రీన్ ఎనర్జీ సంస్థకి పూర్తిగా అనుబంధ సంస్థగా ఉన్న "అదానీ రెన్యూవబుల్ ఎనర్జీ హోల్డింగ్ ఫోర్" (Energy Holding Four), రెండు కొత్త అనుబంధ సంస్థలను స్థాపించింది. ఈ రెండు అనుబంధ సంస్థల పేర్లు.. అదానీ రెన్యూవబుల్ ఎనర్జీ ఫార్టీ ఫోర్ ‍‌(Adani Renewable Energy Forty Four), అదానీ రెన్యూవబుల్ ఎనర్జీ ఫార్టీ ఎయిట్‌ (Adani Renewable Energy Forty Eight).


శోభ: ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో, ఈ రియల్ ఎస్టేట్ సంస్థ సేల్స్‌ బుకింగ్స్‌ 13 శాతం పెరిగి రూ.1,164.2 కోట్లకు చేరుకుంది. గత ఏడాది ఇదే కాలంలో బుకింగస్‌ రూ.1,030.2 కోట్లుగా ఉన్నాయి.


డెల్టా కార్ప్: రెండో త్రైమాసికంలో, ఏకీకృత లాభంలో 19.5 శాతం సీక్వెన్షియల్ వృద్ధితో రూ.68.25 కోట్లను సాధించింది. ఇదే కాలంలో ఆదాయం 8 శాతం పెరిగి రూ.270 కోట్లకు చేరుకుంది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని 'ఏబీపీ దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.