Best Budget Smartphones: ప్రస్తుతం అమెజాన్‌లో స్మార్ట్‌ఫోన్‌ల కోసం ప్రత్యేక సేల్ జరుగుతోంది. ఈ సేల్ పేరు స్మార్ట్‌ఫోన్ ప్రీమియం లీగ్ సేల్. ఈ సేల్ సమయంలో రూ.10 అనేక స్మార్ట్‌ఫోన్‌లపై గొప్ప ఆఫర్‌లు కనిపిస్తున్నాయి. ఈ సేల్‌లో డిస్కౌంట్లు, ఆఫర్‌లతో లభించే కొన్ని మంచి స్మార్ట్‌ఫోన్‌ల గురించి మీకు తెలియజేద్దాం.
రెడ్‌మీ 13సీ 5జీ (Redmi 13C 5G)
4 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ కలిగిన ఈ ఫోన్ అసలు ధర రూ.10,999 కాగా, రూ.1,000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్‌తో రూ. 9,999కే కొనుగోలు చేయవచ్చు. ఇందులో 6.74 అంగుళాల డిస్‌ప్లే, 50 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా సెటప్, మీడియాటెక్ డైమెన్సిటీ 6100 ప్లస్ ప్రాసెసర్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ సహా పలు ప్రత్యేక ఫీచర్లు ఉన్నాయి.
టెక్నో స్పార్క్ 20సీ (Tecno Spark 20C)
ఇది కూడా ఒక మంచి స్మార్ట్‌ఫోన్. ఈ సేల్‌ను సద్వినియోగం చేసుకోవడం ద్వారా సరసమైన ధరలో కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్‌లో వినియోగదారులు 16 జీబీ వరకు ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ సౌకర్యాన్ని పొందుతారు. ఈ సేల్‌లో ఫోన్ ధర రూ. 8,999 మాత్రమే. అంతేకాకుండా వినియోగదారులు ఈ ఫోన్‌పై రూ.1,000 తక్షణ తగ్గింపును పొందవచ్చు. అందువల్ల ఈ ఫోన్‌ను రూ.7,999కే కూడా కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా, 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, డైనమిక్ పోర్ట్ ఫీచర్, 16 జీబీ ర్యామ్ సపోర్ట్‌తో కూడిన 5000 ఎంఏహెచ్ బ్యాటరీ సహా అనేక ప్రత్యేక ఫీచర్లు ఉంటాయి.
శాంసంగ్ గెలాక్సీ ఎం14 5జీ (Samsung Galaxy M14 5G)
ఈ సేల్‌ను సద్వినియోగం చేసుకుని వినియోగదారులు ఈ సేల్‌లో శామ్‌సంగ్ 5జీ స్మార్ట్‌ఫోన్‌ను రూ. 10,000 కంటే తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. అదే శాంసంగ్ గెలాక్సీ ఎం14 5జీ. దీన్ని రూ. 9,990 కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్‌లో 4 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, 6.6 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, ఎక్సినోస్ 1330 ప్రాసెసర్, 6000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా, దీంతో పాటు మరో రెండు 2 మెగాపిక్సెల్ సెన్సార్లను కూడా శాంసంగ్ అందించింది.
రెడ్‌మీ 13సీ 4జీ (Redmi 13C 4G)
రెడ్‌మీ 13సీని కూడా ఈ సేల్‌లో తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. మీకు 5జీ నెట్‌వర్క్ అవసరం లేకపోతే ఈ ఫోన్‌ను తక్కువ ధరకు కూడా కొనుగోలు చేయవచ్చు. 4 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ కలిగిన ఈ ఫోన్ రూ.7,999కే లభిస్తుంది. ఇందులో 6.74 అంగుళాల డిస్‌ప్లే, 50 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా సెటప్, మీడియాటెక్ డైమెన్సిటీ జీ85 చిప్‌సెట్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ సహా పలు ప్రత్యేక ఫీచర్లు ఉన్నాయి.
Also Read: నోకియా ఫోన్లు ఇక కనిపించవా? - కంపెనీ కొత్త ప్రకటనకు అర్థం ఏంటి?