iPhone 14 Plus Discount Offer: మీరు కూడా చాలా కాలంగా ఐఫోన్ కొనాలని ఎదురుచూస్తున్నట్లయితే ఈ గుడ్ న్యూస్ మీకే. ప్రస్తుతం ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 14 ప్లస్ భారీ తగ్గింపుతో అందుబాటులో ఉంది. ఐఫోన్ 14 ప్లస్ అసలు ధర రూ.79,900 కాగా ప్రస్తుతం 16 శాతం తగ్గింపుతో ఫ్లిప్‌కార్ట్‌లో లభిస్తుంది.
డిస్కౌంట్ తర్వాత ఐఫోన్ 15 ప్లస్ ధర రూ. 66,999కి తగ్గింది. ఇది మాత్రమే కాకుండా వినియోగదారులు ఎక్స్ఛేంజ్ వాల్యూ ప్రయోజనాన్ని కూడా పొందవచ్చు. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్‌పై రూ. 23,000 వరకు ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ ఆఫర్ అమలులో ఉంది.
ఒకవేళ మీరు మంచి కండీషన్‌లో ఉన్న ఐఫోన్ 13 మినీని ఎక్స్‌ఛేంజ్‌కు పెడితే ఐఫోన్ 14 ప్లస్ ధర రూ.44,297కు తగ్గుతుంది. ఇలా చేస్తే రూ.45 వేల లోపే ఈ ఫోన్ మీకు లభిస్తుంది. అయితే ఏదైనా మంచి కండీషన్‌లో ఉన్న వేరే ఫోన్‌ను పెట్టినా రూ.15 వేల వరకు ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ పొందవచ్చు. అప్పుడు దీన్ని రూ.50 వేల లోపు ధరకే కొనుగోలు చేయవచ్చు.
ఐఫోన్ 14 ప్లస్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు ఇవే...
ఐఫోన్ 14 ప్లస్‌లో 6.7 అంగుళాల సూపర్ రెటీనా ఎక్స్‌డీఆర్ ఓఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. 1200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను ఈ డిస్‌ప్లే డెలివర్ చేయనుంది. గత సంవత్సరం మోడల్లో అందించిన ఏ15 బయోనిక్ చిప్‌నే ఈ మోడల్లో కూడా అందించారు. ఫేస్ ఐడీ ఫీచర్ ద్వారా ఫోన్‌ను అన్‌లాక్ చేయవచ్చు.
ఐఫోన్ 14 ప్లస్ బ్యాటరీ, ర్యామ్ వివరాలను యాపిల్ అధికారికంగా ప్రకటించలేదు. అస్సలు ఏ ఫోన్‌కు సంబంధించిన బ్యాటరీ, ర్యామ్ డిటైల్స్‌ను యాపిల్ అందించదు. కానీ కొన్ని థర్డ్ పార్టీ టియర్ డౌన్ వీడియోల ద్వారా దీని వివరాలు బయటకు వచ్చాయి. ఇక కెమెరాల విషయానికి వస్తే యాపిల్ ఐఫోన్ 14 ప్లస్‌లో 12 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరాను అందించారు. మెరుగైన స్టెబిలైజేషన్ ఫీచర్ కూడా ఇందులో అందించడం విశేషం. దీనికి యాపిల్ యాక్షన్ మోడ్ అని పేరు పెట్టింది. లో లైట్‌లో కూడా ఈ ఫోన్ కెమెరా పెర్ఫార్మెన్స్ చాలా మెరుగ్గా ఉంది. ఐఫోన్ 14 కంటే మెరుగైన బ్యాటరీ బ్యాకప్‌ను ఐఫోన్ 14 ప్లస్ అందించనుంది.
Also Read: నోకియా ఫోన్లు ఇక కనిపించవా? - కంపెనీ కొత్త ప్రకటనకు అర్థం ఏంటి?