Smartphones Under 15K: మీరు బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ కొనాలని ఎదురు చూస్తున్నట్లయితే అనేక ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. శాంసంగ్, రియల్‌మీ, నథింగ్ వంటి కంపెనీలు బడ్జెట్ విభాగంలో అనేక ఫోన్‌లను అందిస్తున్నాయి. ఈ ఫోన్‌లలో అవసరమైన అన్ని ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. మీరు ఎక్కువ డబ్బు ఖర్చు చేయవలసిన అవసరం లేదు. రూ.15000 రేంజ్‌లో అందుబాటులో ఉన్న వివిధ కంపెనీల బెస్ట్ ఫోన్‌ల గురించి తెలుసుకుందాం.
శాంసంగ్ గెలాక్సీ ఎం35 5జీ (Samsung Galaxy M35 5G)
ఈ ఫోన్ 1080 x 2340 రిజల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్న 6.6 అంగుళాల సూపర్ అమోఎల్ఈడీ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్లస్ ప్రొటెక్షన్‌తో మార్కెట్లోకి వచ్చింది. ఈ ఫోన్ ఎక్సినోస్ 138 ప్రాసెసర్‌తో వస్తుంది. కంపెనీ నాలుగు జనరేషన్ ఆండ్రాయిడ్ అప్‌డేట్లను, ఐదు సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్‌ను ఇందులో అందిస్తుంది. ఇందులో 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా ఉంది. అమెజాన్‌లో 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్‌తో వచ్చిన ఈ స్మార్ట్ ఫోన్ ప్రారంభ వేరియంట్ ధర రూ.14,999గా ఉంది. దీనిపై క్యాష్‌బ్యాక్, నో కాస్ట్ ఈఎంఐ ఆఫర్‌లు అందుబాటులో ఉన్నాయి.
Also Read: విమానంలో ఫోన్ ఎందుకు ఫ్లైట్ మోడ్‌లో పెట్టాలి? - పెట్టకపోతే ఏం జరుగుతుంది?
సీఎంఎఫ్ బై నథింగ్ ఫోన్ 1 5జీ (CMF BY NOTHING Phone 1 5G)
ఈ ఫోన్ 120 హెర్ట్జ్ అడాప్టివ్ రిఫ్రెష్ రేట్‌తో 6.55 అంగుళాల సూపర్ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 50 మెగాపిక్సెల్ ప్రధాన సెన్సార్, వెనుక భాగంలో పొర్‌ట్రెయిట్ సెన్సార్‌ను కలిగి ఉంది. ఇది సెల్ఫీల కోసం 16 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. ఇది శక్తివంతమైన 5000 ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంది. ప్రాసెసర్ గురించి చెప్పాలంటే ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 7300 5జీ ఎస్ఓసీతో వచ్చింది. దీని 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ అమెజాన్‌లో రూ.14,325కి అందుబాటులో ఉంది. మీరు దీనిపై బ్యాంక్ ఆఫర్‌లు, నో కాస్ట్ ఈఎంఐని పొందవచ్చు.
వివో టీ3ఎక్స్ 5జీ (Vivo T3x 5G)
ఈ వివో స్మార్ట్‌ఫోన్ 6.72 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లేతో వస్తుంది. ఇందులో వెనుకవైపు 50 మెగాపిక్సెల్ + 2 మెగాపిక్సెల్ సెన్సార్లు ఉన్నాయి. సెల్ఫీ లవర్స్ కోసం ఇది 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాతో మార్కెట్లోకి వచ్చింది. ఇది 6000 ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంది. దీని 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ అమెజాన్‌లో ఈ వెర్షన్ ధర రూ. 14,449గా ఉంది. దీనిపై ఇతర డీల్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.
Also Read: గూగుల్ పేలో ట్రాన్సాక్షన్లు డిలీట్ చేయడం ఎలా? - సింపుల్ స్టెప్స్‌తో పని అయిపోతుంది!