స్మార్ట్ ఫోన్ వినయోగదారులు పలు రకాల అవసరాల కోసం రకరకాల యాప్స్ ఉపయోగిస్తూ ఉంటారు. వాటిలో కొన్ని యాప్స్ ఇన్ స్టాల్ చేసి మర్చిపోతుంటారు.  అలా ఎన్నో యాప్స్ స్మార్ట్ ఫోన్ లో పేరుకుపోయి ఉంటాయి. వీటి ద్వారా ఫోన్ స్టోరేజ్ తగ్గడంతో పాటు  ఫోన్ పని తీరు కూడా స్లో అవుతుంది. ఒకవేళ మీ స్మార్ట్ ఫోన్ లో ఈ 8 రకాల యాప్స్ ఉంటే వెంటనే డిలీట్ చేయడం మంచిది.   


 1. ముందే ఇన్‌స్టాల్ చేయబడిన బ్లోట్‌వేర్ యాప్స్


ఆండ్రాయిడ్ వినియోగదారులు ముందే ఇన్‌స్టాల్ చేసిన యాప్‌లు ఉపయోగకరంగా ఉన్నప్పటికీ, మీరు ఉపయోగించని వాటిని అన్‌ఇన్‌స్టాల్ చేయడం మంచిది. బ్లోట్‌వేర్ యాప్స్ చాలా వరకు Google యాప్‌లకు ప్రత్యామ్నాయాలుగా ఉంటాయి. అందుకే వాటిని తొలగించడం వల్ల ఫోన్ పని తీరు మెరుగు పడుతుంది. 


2. ఓల్డ్ యుటిలిటీ యాప్స్


2008లో ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ అందుబాటులోకి వచ్చినప్పుడు వేరు వేరు యుటిలిటీ యాప్‌లను డౌన్‌లోడ్ చేయాల్సి వచ్చేది. ఎందుకంటే ఈ ఫంక్షనాలిటీలు అప్పట్లో స్మార్ట్ ఫోన్ లో లేవు. ఇప్పుడు చాలా వరకు ఆ అవసరం లేకుండా పోయింది. మీ ఫోన్‌లో ఇప్పుడు అనవసరమైన యుటిలిటీ యాప్స్ ఉంటే, వాటిని తొలగించుకోవడం మంచిది. 


3. అవుట్ డేటెడ్ ప్రొడక్టివిటీ యాప్స్ 


యుటిలిటీ యాప్‌ల మాదిరిగానే, మీ ఫోన్‌లో అవుట్ డేటెడ్ ప్రొడక్టివిటీ యాప్స్ ఉండే అవకాశం ఉంది.  Gmail, Google Keep, Docs, Sheets, Slides, Meet, Calendar మొదలైన ఈ కోవలోనికే వస్తాయి. ఈ పనులన్నీ గూగుల్ లో చేసుకోవచ్చు.  అందుకే వాటన్నింటినీ తొలగించడం ఉత్తమం.  


4. ఫర్ఫార్మెన్స్ బూస్టర్ యాప్స్


ఫర్ఫార్మెన్స్ బూస్టర్ యాప్స్ ఆండ్రాయిడ్‌ స్మార్ట్ ఫోన్లకు చాలా ఇబ్బందికరంగా ఉంటాయి. RAM క్లీనర్‌లు, బ్యాటరీ సేవర్లు, గేమ్ ఆప్టిమైజర్లు సహా పలు ఫర్ఫార్మెన్స్ బూస్టర్ యాప్స్  మీ స్మార్ట్ ఫోన్ కు మేలు కంటే కీడునే ఎక్కువ కలిగిస్తాయి. బ్యాటరీ సేవర్ యాప్స్ పనికిరావు.  చాలా Android ఫోన్‌లు ఇప్పటికే అంతర్నిర్మిత బ్యాటరీ-సేవర్ మోడ్‌తో వస్తున్నాయి. అందుకే వీటిని డిలీట్ చేయడం ఉత్తమం.


5. ఒకే విధులను నిర్వర్తించే డూప్లికేట్ యాప్స్


ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లలో ఒకే విధులు నిర్వర్తించే పలు రకాల యాప్స్ ఉంటాయి.  అయితే, వాటిలో ఎక్కువ ఉత్తమమైన యాప్ ఉంచి మిగతావి డిలీట్ చేయడం మంచిది. ఉదాహరణకు వెబ్ బ్రౌజర్లు చాలా ఉంటాయి. వాటిలో ఒక్కటి ఉంచుకుని మిగతా వాటిని డిలీట్ చేయడం మంచిది.   


6. సోషల్ మీడియా యాప్స్ ఎక్కువ ఎంగేజ్ చేయడం


సోషల్ మీడియా చాలా సమయాన్ని వృధా చేస్తుంది. అందుకే,  సోషల్ మీడియాలో ఎక్కువ సమయం గడపడం  మంచిది కాదు. సోషల్ మీడియా వ్యసనానికి కూడా దారితీయవచ్చు. వీలైతే, ఇన్‌స్టాగ్రామ్ లాంటి సమయాన్ని ఎక్కువగా తీసుకునే యాప్‌లను అన్‌ ఇన్‌స్టాల్ చేయండి.  


7. పాత గేమ్ యాప్స్ తీసేయండి   


టెంపుల్ రన్, యాంగ్రీ బర్డ్స్ లాంటి గేమ్స్ ఇప్పటికీ కొంత మంది ఆడుతారు. వాటిపై ఇంట్రెస్ట్ లేకపోతే ఫోన్ నుంచి తొలగించడం మంచిది. ప్రస్తుతంస్మార్ట్‌ ఫోన్‌లు  5G, VR, AR గేమింగ్స్ ను కలిగి ఉంటున్నాయి. అందుకే పాత గేమ్ యాప్స్ ను తొలగించడం  ఉపయోగకరం.


8. మీరు ఇకపై ఉపయోగించని యాప్స్


గతంలో ఉపయోగించి, ఇప్పుడు అవసరం లేని యాప్స్ ఏవైనా ఉంటే అన్ ఇన్ స్టాల్ చేయడం మంచిది. డేటింగ్ యాప్‌లు,  మెడిటేషన్ యాప్‌లు ,ఫిట్‌నెస్ యాప్‌లు అవసరం లేకపోతే తీసేయడం బెస్ట్.


Read Also: మీ ఫోన్ ఛార్జింగ్ త్వరగా అయిపోతుందా? అయితే, ఈ టిప్స్ పాటించండి!


ముఖ్యమైనమరిన్ని ఆసక్తికర కథనాల కోసం టెలిగ్రామ్లో ఏబీపీ దేశంలో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial