కొరియన్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ శాంసంగ్ గ్లోబల్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో టాప్‌లో ఉంది. ఈ ఏడాది రెండో త్రైమాసికంలో (ఏప్రిల్ నుంచి జూన్ వరకు) కంపెనీ 21 శాతం మార్కెట్ వాటాతో గ్లోబల్ మార్కెట్‌లో మొదటి స్థానంలో ఉంది. పోటీ కంపెనీ యాపిల్ (Apple) 17 శాతం మార్కెట్ వాటాతో రెండో స్థానంలో కొనసాగుతోంది. ఈ విషయాన్ని కెనాలిస్ అనే సంస్థ తన నివేదికలో పేర్కొంది. ఐఏఎన్ఎస్ నివేదిక ప్రకారం రెండో త్రైమాసికంలో ప్రపంచ స్మార్ట్‌ఫోన్ మార్కెట్ గత సంవత్సరంతో పోలిస్తే 11 శాతం క్షీణించింది.
త్రైమాసికంలో గ్లోబల్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్ అమ్మకాలు తగ్గడం వల్ల శాంసంగ్, యాపిల్ అమ్మకాలు కాస్త తగ్గుముఖం పట్టాయి. ఈ టాప్ 2 కంపెనీలు కాకుండా చైనీస్ బ్రాండ్ షావోమీ సప్లై చైన్‌లో ఇంప్రూవ్‌మెంట్ కారణంగా 13 శాతం మార్కెట్ వాటాతో మూడో స్థానంలో నిలిచింది. ఒప్పో (వన్‌ప్లస్‌తో సహా) 10 శాతం మార్కెట్ షేర్‌తో నాలుగో స్థానాన్ని ఆక్రమించగా, కొత్త వై సిరీస్ లాంచ్‌తో వివో ఎనిమిది శాతం మార్కెట్ షేర్‌తో ఐదో స్థానంలో నిలిచింది.
2022 నుంచి వరుసగా ఆరు త్రైమాసికాల పాటు క్షీణించిన తర్వాత స్మార్ట్‌ఫోన్ గ్లోబల్ మార్కెట్ రికవరీ సంకేతాలను చూపుతోందని కెనాలిస్‌కు చెందిన అనలిస్ట్ లే జువాన్ చైవ్ తెలిపారు. భవిష్యత్తులో మార్కెట్ కరెక్షన్‌కు స్మార్ట్ ఫోన్ కంపెనీలు సిద్ధమవుతున్నట్లు సూచనలు ఉన్నాయి. బ్రాండ్స్ తయారీలో పెట్టుబడిని ఆపలేదు. అలాగే ఆగ్నేయాసియా, భారతదేశం వంటి అభివృద్ధి చెందుతున్న మార్కెట్లపై ప్రత్యక్ష దృష్టి పెట్టారు.
విశ్లేషకుడు టోబి జూ ప్రకారం మార్కెట్ రికవరీ అవ్వడానికి స్మార్ట్‌ఫోన్ కంపెనీలు చురుకుదనం కలిగి ఉండటం చాలా ముఖ్యం. శాంసంగ్ (Samsung) గెలిచి బ్రాండ్ క్రింద అనేక స్మార్ట్‌ఫోన్‌లను పరిచయం చేసింది. దీనికి ప్రపంచవ్యాప్త మార్కెట్‌లో చాలా మంచి రెస్పాన్స్ లభించింది. స్మార్ట్‌ఫోన్స్ మాత్రమే కాకుండా శాంసంగ్ టాబ్లెట్స్, గెలాక్సీ వాచ్, ఇతర ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను తయారు చేస్తుంది.
Read Also: ఎప్పటికప్పుడు వెదర్ అప్ డేట్స్ తెలుసుకోవాలా? మీ ఫోన్ లో జస్ట్ ఈ సెట్టింగ్స్ చేస్తే సరిపోతుంది!
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial