రియల్‌మీ సీ53 బడ్జెట్ స్మార్ట్ ఫోన్ మనదేశంలో లాంచ్ అయింది. ఈ ఫోన్‌లో కంపెనీ 108 మెగాపిక్సెల్ కెమెరాను అందించడం విశేషం. 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్న వాటర్ డ్రాప్ నాచ్ తరహా డిస్‌ప్లేను అందించారు. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ కూడా ఉంది. 18W ఫాస్ట్ ఛార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. 6 జీబీ వరకు ర్యామ్, 128 జీబీ వరకు స్టోరేజ్ ఇందులో ఉన్నాయి. డైనమిక్ ర్యామ్ ఫీచర్ ద్వారా 12 జీబీ వరకు ర్యామ్‌ను పెంచుకోవచ్చు.


రియల్‌మీ సీ53 ధర
ఈ ఫోన్‌లో రెండు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 4 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.9,999గా నిర్ణయించారు. టాప్ ఎండ్ మోడల్ అయిన 6 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.10,999గా ఉంది. జులై 26వ తేదీన ఫ్లిప్‌కార్ట్, రియల్‌మీ.కాం వెబ్ సైట్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు.


ఛాంపియన్ గోల్డెన్, ఛాంపియన్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. ఐసీఐసీఐ, ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డుల ద్వారా ఈ ఫోన్ కొనుగోలు చేస్తే రూ.500 వరకు డిస్కైంట్ లభించనుంది.


రియల్‌మీ సీ53 స్పెసిఫికేషన్లు
ఆండ్రాయిడ్ 13 ఆధారిత రియల్‌మీ యూఐ టీఎడిషన్ ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పని చేయనుంది. ఇందులో 6.74 అంగుళాల డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్‌గా ఉంది. స్క్రీన్ టు బాడీ రేషియో 90.3 శాతం కాగా, టచ్ శాంప్లింగ్ రేట్ 180 హెర్ట్జ్‌గానూ ఉండనుంది. ఆక్టాకోర్ 12 ఎన్ఎం చిప్‌సెట్‌ను ఇందులో అందించినట్లు కంపెనీ పేర్కొంది. కానీ ప్రాసెసర్ పేరును మాత్రం తెలపలేదు. 6 జీబీ వరకు ర్యామ్ అందుబాటులో ఉంది. డైనమిక్ ర్యామ్ ఫీచర్ ద్వారా 12 జీబీ వరకు పెంచుకోవచ్చు.


ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు రెండు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 108 మెగాపిక్సెల్ కాగా, మరో ఏఐ సెన్సార్ కూడా ఉంది. రూ.10 వేలలోపు ధరలో 108 మెగాపిక్సెల్ కెమెరాతో ఫోన్ లాంచ్ అవ్వడం మనదేశంలో ఇదే మొదటి సారి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 8 మెగాపిక్సెల్ కెమెరా అందుబాటులో ఉంది. 128 జీబీ వరకు స్టోరేజ్ ఈ ఫోన్‌లో అందించారు. దీన్ని మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 2 టీబీ వరకు అందించారు.


4జీ, జీపీఎస్, వైఫై, బ్లూటూత్ 5, 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్, యూఎస్‌బీ టైప్-సీ పోర్ట్ వంటి కనెక్టివిటీ ఫీచర్లు అందించారు. యాక్సెలరో మీటర్, మ్యాగ్నెటిక్ సెన్సార్, లైట్ సెన్సార్, గైరోమీటర్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్లు కూడా అందించారు. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా, 18W ఫాస్ట్ ఛార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. దీని మందం 0.79 సెంటీమీటర్లు కాగా, బరువు 186 గ్రాములుగా ఉంది.


Read Also: ఎప్పటికప్పుడు వెదర్ అప్ డేట్స్ తెలుసుకోవాలా? మీ ఫోన్ లో జస్ట్ ఈ సెట్టింగ్స్ చేస్తే సరిపోతుంది!


ముఖ్యమైనమరిన్ని ఆసక్తికర కథనాల కోసం టెలిగ్రామ్లో ఏబీపీ దేశంలో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial