Infinix GT 10 Proపై గత కొంత కాలంగా మోబైల్ మార్కెట్లలో చర్చ నడుస్తోంది. అదిరిపోయే ఫీచర్లతో ఈ స్మార్ట్ ఫోన్ వినియోగదారులు ముందుకు రాబోతోందని కంపెనీ వెల్లడిస్తూ వస్తోంది. ఈ మధ్యే ఈ స్మార్ట్ ఫోన్ కు సంబంధించిన టీజర్ ను కంపెనీ అధికారికంగా విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ త్వరలో భారత్ తో పాటు గ్లోబల్ మార్కెట్లలో లాంచ్ అవుతుందని మోబైల్ ఎక్స్ ఫర్ట్స్ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో లాంచ్‌కు ముందే Infinix GT 10 Proకు సంబంధించిన స్పెసిఫికేషన్‌లు, డిజైన్ డీటైల్స్ ఆన్‌లైన్‌లో లీక్ అయ్యాయి. Infinix GT 10 ప్రో వేరియంట్ 7,000mAh భారీ బ్యాటరీతో రాబోతోంది. 256GB ఇన్ బిల్ట్ స్టోరేజీని కలిగి ఉండబోతోంది. ఈ ఫీచర్స్ చూస్తుంటునే వావ్ అనిపిస్తోంది కదూ. అందుకే దీన్ని అంతా ‘బాహుబలి’ ఫోన్ అంటున్నారు.
Infinix GT 10 Pro స్పెసిఫికేషన్లు
త్వరలో లాంఛ్ కాబోయే Infinix GT 10 ప్రో స్మార్ట్ ఫోన్ 5G నెట్ వర్క్ సపోర్టింగ్ తో రానుంది. 256 GB స్టోరేజ్ తో పాటు ఏకంగా 24GB RAMతో రూపొందినట్లు తెలుస్తోంది. చూసేందుకు సున్నితంగా ఉండటంతో పాటు మరింత సమర్థవంతమైన పనితీరుతో ఈ స్మార్ట్ ఫోన్ లాంచ్ కానున్నట్లు తెలుస్తోంది. స్మార్ట్ ఫోన్ హుడ్ కింద, MediaTek డైమెన్సిటీ 8050 చిప్‌సెట్ ఉండవచ్చని భావిస్తున్నారు. Infinix GT 10 Proలో చెప్పుకోదగినది 7,000mAh బ్యాటరీ. Infinix 160W, 260W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో రానుంది.
Infinix GT 10 Pro స్మార్ట్ ఫోన్ 120Hz AMOLED డిస్‌ప్లేను కూడా కలిగి ఉంటుంది. ఫోటోగ్రఫీ కోసం 100-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్‌తో కూడిన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ను కలిగి ఉంటుంది. ఇది రెండు 8-మెగాపిక్సెల్ కెమెరా సెన్సార్ల ద్వారా మద్దతు ఇవ్వబడుతుంది. సెల్పీల కోసం 32 మెగాపిక్సెల్ కెమెరా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.
Infinix GT 10 Pro నథింగ్ ఫోన్(2)ని పోలి ఉంటుందా?
ఇటీవల విడుదలైన Infinix GT 10 Pro టీజర్ నథింగ్ ఫోన్ (2) మాదిరగానే ఉన్నట్లు కనిపిస్తోంది. ఇది వెనుకవైపు LED లైట్లతో కూడిన గ్లిఫ్ ఇంటర్ ఫేస్ లాంటి డిజైన్‌ను కలిగి ఉంటున్నట్లు తెలుస్తోంది. అయినప్పటికీ, టీజర్ ఇమేజ్ లైటింగ్ బ్యాక్ ప్యానెల్‌ను చూపించలేదు. ఈ స్మార్ట్ ఫోన్ పలు కలర్ ఆప్షన్స్ లో అందుబాటులో ఉంటుందని తెలుస్తోంది. నలుపుతో పాటు ఆరెంజ్, తెలుపు బూడిద రంగులలో లభించనున్నట్లు సమాచారం.
Infinix GT 10 Pro ఇండియాలో ఎప్పుడు లాంచ్ అవుతుంది?
Infinix GT 10 Pro స్మార్ట్ ఫోన్‌ను ఆగస్టులో ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే లీక్‌ల ప్రకారం, వచ్చే రెండు నెలల్లో ఇండియాలో లాంచ్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గ్లోబల్ మార్కెట్లతో పోల్చితే భారతీయ వినియోగదారులు కొంచెం వేచి ఉండాల్సి వస్తుందని తెలుస్తోంది. Infinix GT 10 Pro+ భారత మార్కెట్లోకి రాకపోవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
Read Also: మీ ఫోన్ ఛార్జింగ్ త్వరగా అయిపోతుందా? అయితే, ఈ టిప్స్ పాటించండి!
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial