Lava Agni 3 5G: లావా అగ్ని 3 5జీ స్మార్ట్ ఫోన్ మన దేశంలో అక్టోబర్ నెల మొదటి వారంలో లాంచ్ కానుంది. ఈ భారతీయ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఆదివారం లావా అగ్ని 3 5జీ లాంచ్ గురించిన విషయాన్ని కంపెనీ అధికారికంగా ప్రకటించింది. లావా అగ్ని 3 5జీకి సంబంధించిన డిజైన్, కెమెరా వివరాలను కూడా కంపెనీ టీజ్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ రెండు కలర్ ఆప్షన్లలో భారతీయ మార్కెట్లో అందుబాటులోకి రానుంది. ఈ ఫోన్‌లో వెనకవైపు 50 మెగాపిక్సెల్ కెమెరా ఉండనుంది. లావా అగ్ని 3 5జీకి సంబంధించిన సేల్ అమెజాన్‌లో జరగనుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్‌పై ఈ స్మార్ట్ ఫోన్ రన్ కానుందని సమాచారం.


అక్టోబర్ 4వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు మన దేశంలో ఈ ఫోన్ లాంచ్ కానుంది. లావా అగ్ని 3 5జీ లాంచ్ ఈవెంట్ యూట్యూబ్‌లో స్ట్రీమ్ కానుంది. ఈ ఫోన్ వెనకవైపు కెమెరా సెటప్‌ను చదరపు ఆకారంలో అందించారు. టాప్ లెఫ్ట్ కార్నర్‌లో ఈ స్క్వేర్ షేప్డ్ కెమెరా సెటప్‌ను చూడవచ్చు.


Also Read: మంచి కెమెరా క్వాలిటీ, పెద్ద బ్యాటరీ- రూ. 20 వేల లోపు బెస్ట్ 5G మొబైల్స్ ఇవే


ఈ స్మార్ట్ ఫోన్‌లో అందించే 50 మెగాపిక్సెల్ కెమెరాలో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఫీచర్ కూడా ఉండనుంది. దీన్ని కంపెనీ టీజర్‌లోనే డిస్‌ప్లే చేసింది. ఇందులో 6.78 అంగుళాల ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే అందించనున్నట్లు సమాచారం. ఫోన్ వెనకవైపు ఒక సెకండరీ డిస్‌ప్లే కూడా ఈ ఫోన్‌లో చూడవచ్చని తెలుస్తోంది.


గతంలో లాంచ్ అయిన లావా అగ్ని 2 5జీకి తర్వాతి వెర్షన్‌గా లావా అగ్ని 3 5జీ మార్కెట్లోకి రానుంది. గతేడాది మేలో రూ.21,999 ధరతో లావా అగ్ని 2 5జీ మార్కెట్లోకి వచ్చింది. ఈ ఫోన్ ధర రూ.21,999గా నిర్ణయించారు. విరీడియన్ కలర్ ఆప్షన్‌లో దీన్ని కొనుగోలు చేయవచ్చు.


లావా అగ్ని 2 5జీలో 6.78 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ కర్వ్‌డ్ అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. మీడియాటెక్ డైమెన్సిటీ 7050 ప్రాసెసర్‌పై ఇది రన్ కానుంది. 6 జీబీ వరకు ర్యామ్, ఫోన్ వెనకవైపు 50 మెగాపిక్సెల్ కెమెరా వంటి ఫీచర్లు ఇందులో అందించారు. దీని బ్యాటరీ సామర్థ్యం 4700 ఎంఏహెచ్ కాగా, 66W ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేయనుంది.  



Also Read: ఫేస్‌బుక్, ఇన్‌స్టాలో సరికొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్స్ - ధరలు ఎలా ఉన్నాయో తెలుసా?