New MacBook Air: యాపిల్ తన కొత్త మ్యాక్‌బుక్ ఎయిర్ మోడల్‌ను మనదేశ మార్కెట్లో లాంచ్ చేసింది. ఇందులో 15 అంగుళాల డిస్‌ప్లేను అందించారు. యాపిల్ స్వయంగా రూపొందించిన ఎం2 చిప్‌పై ఈ ల్యాప్‌టాప్ పని చేయనుంది. ఇంటెల్ ప్రాసెసర్లతో పని చేసే మ్యాక్‌బుక్ కంటే 12 రెట్లు వేగంగా ఇది పని చేయనుందని కంపెనీ తెలిపింది.
యాపిల్ మ్యాక్‌బుక్ ఎయిర్ 15 అంగుళాల మోడల్ ధర
దీని ధరను మనదేశంలో రూ.1,34,900గా నిర్ణయించారు. మిడ్ నైట్, సిల్వర్ స్పేస్ గ్రే, స్టార్ లైట్ కలర్ ఆప్షన్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు. దీనికి సంబంధించిన ప్రీ-ఆర్డర్లు ఇప్పటికే ప్రారంభం అయ్యాయి.
యాపిల్ మ్యాక్‌బుక్ ఎయిర్ 15 అంగుళాల మోడల్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
ఈ ల్యాప్‌టాప్‌లో 15.3 అంగుళాల లిక్విడ్ రెటీనా డిస్‌ప్లేను అందించారు. ఇది 500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను సపోర్ట్ చేయనుంది. దీని మందం కేవలం 11.5 మిల్లీమీటర్లు మాత్రమే. ప్రపంచంలోనే అత్యంత సన్నటి 15 అంగుళాల ల్యాప్‌టాప్ ఇదే.
ఇందులో 8 కోర్ సీపీయూని అందించారు. వీటిలో నాలుగు పెర్ఫార్మెన్స్ కోర్లు కాగా, మిగతా నాలుగు ఎఫీషియన్సీ కోర్లు. వీటితో పాటు 10 కోర్ల జీపీయూ, 16 కోర్ల న్యూరల్ ఇంజిన్ కూడా ఈ ల్యాప్‌టాప్‌లో యాపిల్ అందించింది.
మ్యాగ్ సేఫ్ ఛార్జింగ్, కనెక్టింగ్ యాక్సెసరీల కోసం రెండు థండర్ బోల్ట్ పోర్టులు, 6కే ఎక్స్‌టర్నల్ డిస్‌ప్లే, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్ ఇందులో ఉన్నాయి. 1080P వెబ్ క్యాం, మూడు మైకులను వాయిస్ కాల్స్ కోసం అందించారు. దీంతోపాటు ఆరు స్పీకర్లు కూడా ఉన్నాయి. మ్యాక్ఓఎస్ వెంచురా ప్రాసెసర్‌పై ఈ ల్యాప్‌టాప్ పని చేయనుంది.
దీంతో పాటు యాపిల్ తన వార్షిక ఈవెంట్ తాజా ఎడిషన్‌లో అనేక ప్రకటనలు చేసింది. మరో వైపు కంపెనీ తన అభిమానులను కొత్త డివైస్‌లతో ట్రీట్ ఇచ్చింది. అదే సమయంలో ఆపరేటింగ్ సిస్టమ్ అప్‌డేట్లు కూడా వచ్చాయి. ఇవి కంపెనీ పాత వినియోగదారుల కోసం విడుదల అయ్యాయి. చాలా మంది ప్రజల దృష్టి ఆపరేటింగ్ సిస్టమ్ iOS 17పై ఉంది. దీంతో పాటు కంపెనీ iPadOS 17, watchOS 10 లను కూడా ప్రకటించింది.
ఆపరేటింగ్ సిస్టమ్ ఐవోఎస్ 17 గురించి చెప్పాలంటే ఇందులో చాలా ఇంట్రస్టింగ్ ఫీచర్లు ఉన్నాయి. కొత్త ఆపరేటింగ్ సిస్టంతో వినియోగదారులు తమ ఫోటోలనే స్టిక్కర్‌లుగా తయారు చేయవచ్చు. ఇది కాకుండా దాని కీప్యాడ్‌ను కూడా మాడిఫై చేశారు. దీని కారణంగా యాపిల్ డివైసెస్‌లో టైప్ చేయడం మరింత సులభం అవుతుంది.
ఈ కొత్త అప్‌డేట్‌తో నేమ్ డ్రాప్ ఫీచర్, ఫేస్‌టైమ్ వీడియో మెసేజ్ ఫీచర్లు అందించారు. దీంతోపాటు అన్నిటికన్నా ముఖ్యమైన స్టాండ్‌బై మోడ్ అందుబాటులోకి వచ్చింది. ఈ స్టాండ్ బై మోడ్ ద్వారా ఐఫోన్ ఛార్జింగ్ పెట్టినప్పుడు లాక్ స్క్రీన్ హారిజంటల్‌గా మారుతుంది. ఇది ఐఫోన్‌ను స్మార్ట్ డిస్‌ప్లేగా మారుస్తుంది. దీనిపై డేట్, టైం, లైవ్ యాక్టివిటీస్, విడ్జెట్స్‌ను చూడవచ్చు. ఫోన్‌కు ఛార్జింగ్ పెట్టి పక్కన పెట్టినప్పుడు ఈ ఫీచర్ ఆటోమేటిక్‌గా యాక్టివేట్ అవుతుంది.
Read Also: వాట్సాప్ నుంచి సరికొత్త ఫీచర్, ఇకపై మీ స్క్రీన్ ఇతరులకు షేర్ చెయ్యొచ్చు!