Apple WWDC 2023: రూ.2.5 లక్షల వీఆర్ హెడ్‌సెట్, కొత్త ల్యాప్‌టాప్‌లు, ఐవోఎస్ 17 - యాపిల్ బిగ్గెస్ట్ ఈవెంట్ నేడే!

యాపిల్ డబ్ల్యూడబ్ల్యూడీసీ 2023 ఈవెంట్ నేడు (సోమవారం) రాత్రి 10:30 గంటల నుంచి ప్రారంభం కానుంది.

Continues below advertisement

Apple WWDC 2023: యాపిల్ అతిపెద్ద ఈవెంట్ WWDC 2023 నేడు (సోమవారం) ప్రారంభం కానుంది. ఈ ఈవెంట్ సందర్భంగా పలు ఉత్పత్తులను యాపిల్ విడుదల చేయనుంది. మీరు యాపిల్ ప్రొడక్ట్స్‌ను ఉపయోగిస్తున్నా, లేకపోతే యాపిల్‌కు ఫ్యాన్ అయినా ఇందులో మీకు బోలెడన్ని అప్‌డేట్స్ లభిస్తాయి. కొత్త సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్, హార్డ్ వేర్ లాంచెస్... ఇలా ఎన్నో ఈరోజు మార్కెట్లోకి రానున్నాయి.

Continues below advertisement

ఏమేం లాంచ్ అవుతాయి?
యాపిల్ అతిపెద్ద ఈవెంట్ వరల్డ్‌వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్ (WWDC) గత మూడేళ్ల మాదిరిగానే జూన్ 5వ తేదీ నుండి జూన్ 9వ తేదీ వరకు కొనసాగుతుంది. ఈ ఈవెంట్ పూర్తిగా ఆన్‌లైన్‌లో జరుగుతుంది. కొంతమంది డెవలపర్లు, విద్యార్థులను యాపిల్ ప్రధాన కార్యాలయానికి పిలిచారు. అయినా ఇది పూర్తిగా ఆన్‌లైన్ ఈవెంటే. ఈ ఈవెంట్‌లో కంపెనీ ఐవోఎస్ 17, వాచ్ ఓఎస్ 10, మ్యాక్ ఓఎస్ 14లను లాంచ్ చేస్తుంది. వీటి కోసం ఒక కీనోట్ ఈవెంట్‌ను నిర్వహిస్తుంది.

వీటికి సంబంధించిన కొత్త వెర్షన్లు
ఈవెంట్ సందర్భంగా iOS, iPadOS, macOS, watchOS, tvOS కొత్త వెర్షన్‌లను పరిచయం చేయడానికి యాపిల్ సిద్ధంగా ఉంది. ఇది కాకుండా ఈ ఈవెంట్‌లో ఏఆర్/ వీఆర్ మిక్స్‌డ్ రియాలిటీ హెడ్‌సెట్ కూడా లాంచ్ అవుతుంది. వీటితో పాటు 15 అంగుళాల మ్యాక్‌బుక్ ఎయిర్ మార్కెట్లో ఎంట్రీ ఇవ్వనుంది.

యాపిల్ రియాలిటీ ప్రో మిక్స్డ్ హెడ్‌సెట్
దీని గురించి యాపిల్ ఇంతవరకు ఎక్కడా ప్రకటించలేదు. కానీ యాపిల్ రియాలిటీ ప్రో మిక్స్డ్ హెడ్‌సెట్ గురించి బోలెడన్ని లీకులు, రూమర్లు వినిపించడం మాత్రం ఆగలేదు. ఏఆర్, వీఆర్ టెక్నాలజీ రెండిటినీ సపోర్ట్ చేస్తూ కొత్త ఎక్స్ఆర్ఓఎస్ ఆపరేటింగ్ సిస్టంపై పని చేసే ఈ హెడ్ సెట్ ధర 3,000 డాలర్ల (మనదేశ కరెన్సీలో రూ.2.47 లక్షలు) రేంజ్‌లో ఉండవచ్చని తెలుస్తోంది. వీటిలో 5000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను సపోర్ట్ చేసే మైక్రో ఓఎల్ఈడీ డిస్‌ప్లేలు అందించనున్నట్లు సమాచారం.

యాపిల్ డబ్ల్యూడబ్ల్యూడీసీ 2023 ఎప్పుడు ఎక్కడ జరుగుతుంది?
యాపిల్ నిర్వహిస్తున్న అతిపెద్ద ఈవెంట్ జూన్ 5వ తేదీ నుంచి 9వ తేదీ వరకు వరకు కాలిఫోర్నియాలోని కుపెర్టినోలో ఉన్న యాపిల్ పార్క్‌లో జరుగుతుంది. సోమవారం రాత్రి 10.30 గంటల నుంచి ఈ ఈవెంట్ ప్రారంభం కానుంది. అయితే డెవలపర్‌ల కోసం కొత్త టెక్నాలజీ, అప్‌డేట్‌ల గురించి సమాచారాన్ని అందించే ప్రధాన కార్యక్రమం భారత కాలమానం ప్రకారం అర్థరాత్రి రెండు గంటలకు జరగనుంది.

యాపిల్ డబ్ల్యూడబ్ల్యూడీసీ 2023 ఈవెంట్‌ను ఆన్‌లైన్‌లో ఎలా చూడాలి?
ఆన్‌లైన్ ఈవెంట్‌ను యాపిల్ యూట్యూబ్ ఛానెల్‌లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూడవచ్చు. ఇది కాకుండా మీరు యాపిల్ అధికారిక వెబ్‌సైట్‌ను కూడా సందర్శించవచ్చు. ఈ ప్రత్యక్ష ప్రసార కార్యక్రమాన్ని Apple TV యాప్‌లో 'Watch Now' సెక్షన్‌లో కూడా వీక్షించవచ్చు. యాపిల్ కీనోట్ భారత కాలమానం ప్రకారం జూన్ 5వ తేదీన రాత్రి 10:30 గంటలకు ప్రత్యక్ష ప్రసారం అవుతుంది.

Read Also: వాట్సాప్ నుంచి సరికొత్త ఫీచర్, ఇకపై మీ స్క్రీన్ ఇతరులకు షేర్ చెయ్యొచ్చు!

Continues below advertisement