BSNL 5G Network: ప్రైవేట్ టెలికాం కంపెనీలు జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా తమ రీఛార్జ్ ప్లాన్‌ల ధరలను పెంచిన తర్వాత ప్రజలు బీఎస్ఎన్ఎల్ వైపు మొగ్గుచూపడం ప్రారంభించారు. ఇప్పుడు బీఎస్ఎన్ఎల్ 5జీకి రూట్ క్లియర్ అయిందని పెద్ద వార్త వచ్చింది. అంటే బీఎస్ఎన్ఎల్ 5జీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వారికి ఇది శుభవార్త.


కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా దీన్ని స్వయంగా పరీక్షించారు. దీని కోసం సింధియా సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్ (C-DOT)కి చేరుకుని 5జీ టెక్నాలజీని ఉపయోగించి వీడియో కాల్ చేశారు. 5జీ నెట్‌వర్క్ కెపాసిటీని కేంద్ర మంత్రి స్వయంగా పరీక్షించారు.


కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా చేసిన ఈ 5జీ టెస్టింగ్ తర్వాత ప్రజలు త్వరలో బీఎస్ఎన్ఎల్ 5జీ నెట్‌వర్క్‌ను యాక్సెస్ చేస్తారని చాలా వరకు స్పష్టమైంది. అయితే ప్రైవేట్ టెలికాం కంపెనీలకు మాత్రం ఇది ఆందోళన కలిగించే అంశం అనే చెప్పాలి.






Also Read: ఫేస్‌బుక్, ఇన్‌స్టాలో సరికొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్స్ - ధరలు ఎలా ఉన్నాయో తెలుసా?


జ్యోతిరాదిత్య సింధియా బీఎస్ఎన్ఎల్ 5జీ నెట్‌వర్క్‌లో వీడియో కాల్ చేసిన వీడియోని తన అధికారిక ఎక్స్ హ్యాండిల్ నుంచి షేర్ చేశారు. ఇది మాత్రమే కాదు బీఎస్ఎన్ఎల్ 5జీ నెట్‌వర్క్‌లో వీడియో కాల్‌ను ట్రై చేసినట్లు క్యాప్షన్ రాశారు. అలాగే తన పోస్ట్‌లో బీఎస్ఎన్ఎల్ ఇండియాను ట్యాగ్ చేసారు.


బీఎస్ఎన్ఎల్ 5జీ ట్రయల్...
ప్రభుత్వం బీఎస్ఎన్ఎల్ 5జీ నెట్‌వర్క్‌లో కోసం 700MHz, 2200MHz, 3300MHz, 26GHz స్పెక్ట్రమ్ బ్యాండ్‌లను కేటాయించింది. ప్రస్తుతం బీఎస్ఎన్ఎల్ 700MHz స్పెక్ట్రమ్ బ్యాండ్‌లో 5జీ సేవను ట్రయల్ చేస్తోంది. 


ఎయిర్‌టెల్, జియో లాగానే కేంద్ర ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ కూడా తన వినియోగదారులకు బ్రాడ్‌బ్యాండ్ సేవలను అందిస్తోంది. అదే భారత్ ఫైబర్. బీఎస్ఎన్ఎల్ తన బ్రాడ్‌బ్యాండ్ సర్వీస్ అయిన భారత్ ఫైబర్ ద్వారా వినియోగదారులకు హై స్పీడ్ ఇంటర్నెట్‌ను అందిస్తుంది. భారత్ ఫైబర్ వద్ద అనేక చవకైన, గొప్ప ప్లాన్లు కూడా ఉన్నాయి. ఎక్కువ డేటా అవసరం అయినప్పుడు ఇవి చక్కగా ఉపయోగపడతాయి. మొబైల్ నెట్‌వర్క్ విషయంలో కూడా ప్రస్తుతం ఎయిర్‌టెల్, జియో, వొడాఫోన్ ఐడియా కంటే బీఎస్ఎన్ఎల్ వద్ద చవకైన ప్లాన్లు ఉన్నాయి.






Also Read: మంచి కెమెరా క్వాలిటీ, పెద్ద బ్యాటరీ- రూ. 20 వేల లోపు బెస్ట్ 5G మొబైల్స్ ఇవే