Jio: భారతీయ టెలికాం రంగంలో జియో, ఎయిర్‌టెల్ కంపెనీలు టాప్ 2 స్థానాల్లో ఉన్న సంగతి తెలిసిందే. జియో ఎప్పట్నుంచో టాప్ ప్లేస్‌లో ఉండగా... ఎయిర్‌టెల్ కూడా ఆ స్థానం కోసం గట్టిగా ప్రయత్నిస్తుంది. వాలంటైన్స్ డే రోజు ఎయిర్‌టెల్‌ని రిలయన్స్ జియో టీజ్ చేసింది. ఎయిర్‌టెల్ బ్రాడ్‌బ్యాండ్ సర్వీసు ఎక్స్‌ట్రీమ్ గురించి టీజ్ చేసింది. వినియోగదారులను 5జీ ఆధారిత ఎయిర్‌ ఫైబర్ ఎంచుకోమని సూచింది.


‘ప్రియమైన ఎయిర్‌టెల్ వినియోగదారులారా... ఈ వాలంటైన్స్ డే రోజు మీ రిలేషన్ షిప్స్‌లో ‘రెడ్’ ఫ్లాగ్స్‌ని వదిలేయకండి. మీ 'Ex'-stream నుంచి మూవ్ ఆన్ అవ్వడానికి సరైన సమయం ఇదే. జియో కస్టమర్ నంబర్ పేర్కొని కుదిరితే కాల్ చేయండి.’ అని ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఎయిర్‌టెల్ లోగోలో ఉండే రెడ్ కలర్‌ను హైలెట్ చేస్తూ జియో ఇలా కామెంట్ చేసింది. ఎయిర్‌టెల్ బ్రాడ్‌బ్యాండ్ సర్వీసు ‘Xstream’ కాగా దాన్ని మాజీ ప్రేమికుడు/ప్రేమికారులితో పోలుస్తూ 'Ex'-stream అని పోస్ట్ చేసింది. ఇది ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.


ఈ పోస్టుపై ఎయిర్‌టెల్ స్పందించింది కూడా ‘సబ్ కుచ్ ట్రై కరో, ఫిర్ సహీ చునో’ అనే కొటేషన్ ఉన్న ఫొటోను దాని కింద రిప్లైగా పెట్టింది. అంటే ’అన్నీ ట్రై చేయండి. కానీ సరైనదాన్ని ఎంచుకోండి.’ అని అర్థం. దీనికి జస్ట్ సేయింగ్ అని క్యాప్షన్ పెట్టింది. అయితే ఈ పోస్టుపై జియో యూజర్లు ఫైర్ అవుతున్నారు. అందులో ఉన్న సమస్యలను ముందుగా పరిష్కరించాలని ట్వీట్లు చేస్తున్నారు. 


Also Read: నోకియా ఫోన్లు ఇక కనిపించవా? - కంపెనీ కొత్త ప్రకటనకు అర్థం ఏంటి?



Also Read: వాట్సాప్ ఛాట్ బ్యాకప్ చేస్తున్నారా? - అయితే త్వరలో రానున్న ఈ రూల్ తెలుసా?