YCP has taken a U-turn on Hyderabad as Common Capital  :  ఏపీ రాజకీయాలు మలుపులు తిరుగుతున్నాయి. ఏపీకి రాజధాని కట్టుకునే  ఆర్థిక స్థోమత లేనందున హైదరాబాద్  నే ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలని వైవీ సుబ్బారెడ్డి డిమాండ్ చేశారు.్ ఈ అంశంపై కేంద్రంతో మాట్లాడతామని.. రాజ్యసభలో కూడా ప్రస్తాిస్తామని ఆయన చెప్పుకొచ్చారు. వైవీ సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. దీంతో మరో వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ మీడియా ముందుకు వచ్చారు. వైవీ సుబ్బారెడ్డి అలా అనలేదని వాదించారు. ఆయన మాటలను వక్రీకరించారని.. ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ను కొనసాగించడం సాధ్యం కాదని చెప్పుకొచ్చారు. 


వివాదాస్పదమైన వైవీ సుబ్బారెడ్డి ఉమ్మడి రాజధాని వ్యాఖ్యలు             


రాజధానిపై వైవీై సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలు రివర్స్ కావడంతో వైసీపీ హైకమాండ్ వెంటనే స్పందించి బొత్స సత్యనారాయణతో ప్రెస్ మీట్ పెట్టించినట్లుగా తెలుస్తోంది. పదేళ్ల తర్వాత ఉమ్మడి రాజదాని కొనసాగింపు సాధ్యం కాదని.. అనుభవం ఉన్న నేత ఎవరూ అలా మాట్లాడరని చెప్పుకొచ్చారు.  రాజధాని విషయంలో మా పార్టీ విధానం ఎప్పుడూ చెప్పాం. దానికి మేము కట్టుబడి ఉన్నాము.  అలాగే.. హైదరాబాద్‌ విశ్వనగరం.. అక్కడ ఎవరికైనా ఆస్తులు ఉండొచ్చు. అదేం ప్రశాంత్‌రెడ్డి ఆస్తి​ కాదు. చంద్రబాబు అర్ధరాత్రి పారిపోయి వచ్చారు గనుకే నేడు రాజధాని లేని దుస్థితి నెలకొంది. చంద్రబాబు పాపాల వల్లే ఈ పరిస్థితి వచ్చింది. ప్రతిపక్షాల చౌకబారు వ్యాఖ్యలపై మేం స్పందించబోమని  బొత్స వ్యాక్యానించారు. 


ఏం మేలు చేశామో అదే చూసి ఓట్లడుగుతున్నాం !                  


 మా పార్టీ స్టాండ్ ఎప్పుడు కూడా విభజన హామీలు సాధించడమే. మేము ప్రజలు ఏం మేలు చేశామో అది చెప్పే ఓట్లు అడుగుతాం ఇలాంటి జిమ్మిక్కులు మాకు అవసరం లేదు. చంద్రబాబు, పవన్‌కు ఈ రాష్ట్రంలో సొంత ఇల్లు లేదు. కానీ వీళ్ళకి ఇక్కడ రాజకీయాలు కావాలి ’’ అని మంత్రి బొత్స  విమర్శించారు.   అలాగే.. ఉద్యోగులతో ఆల్రెడీ చర్చలు జరిపామని, పెండింగులో ఉన్న బకాయిలు వచ్చే నెలలో ఇస్తాం అని చెప్పామని మంత్రి బొత్స మీడియాకు వివరించారు.


ఏపీ రాజకీయాల్లో మరోసారి రాజధాని అంశం హైలెట్                                      


ఉమ్మడి రాజధాని అంశం రాజకీయాల్లో సంచలనం సృష్టించడం.. బీఆర్ఎస్ తో పాటు టీడీపీ, బీజేపీ నేతలు కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు చేయడంతో వైసీపీ హైకమాండ్ .. వెంటనే దిద్దుబాటు చర్యలకు దిగినట్లుగా తెలుస్తోంది. అయితే వైవీ సుబ్బారెడ్డితో ఖండన ప్రకటన విడుదల చేయకుండా.. బొత్స సత్యనారాయణతో.. మాటల్ని వక్రీకరించారని చెప్పించడం కూడా వ్యూహంలో భాగమేనని భావిస్తున్నారు. మొత్తంగా  .. వైవీ సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలతో ...  ఏపీలో రాజధాని అంశం మరోసారి  హాట్ టాపిక్ అవుతోంది.